S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 04:28

భద్రాచలం, ఏప్రిల్ 15: భద్రాచలం ఆలయం ప్రాశస్త్యం ఎంతో గొప్పది. సీతారాముల కల్యాణం ఎంతో వైభవంగా జరిగింది. బ్రహ్మాండంగా జరిపారు. భద్రాచలాన్ని, పర్ణశాల, జటాయువుక్షేత్రాలను సమగ్రంగా అభివృద్ధి చేసుకుందాం. అందుకు బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటాయిస్తున్నాం. ఆంధ్రలో విలీనమైన ఆ ఐదు పంచాయితీలను ఇవ్వడానికి అమరావతిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు.

04/16/2016 - 04:25

భద్రాచలం, ఏప్రిల్ 15: శ్రీరామనవమిపై ఈసారి వరుస జాతరల ప్రభావం తీవ్రంగా పడింది. గోదావరి పుష్కరాలు, మేడారం జాతర వల్ల నవమికి భక్తుల రాక తగ్గింది. దానికితోడు దేవస్థానం సైతం సరైన ప్రచారం నిర్వహించకపోవడం వల్ల భక్తులు అయోమయానికి గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులు, కొనుగోలు శక్తి తగ్గడం, భానుడి ప్రతాపం వెరసి శ్రీరామనవమికి ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కళ్యాణంలో అపశృతులు సైతం చోటు చేసుకున్నాయి.

04/16/2016 - 04:25

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 15: సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు ముత్యాల తలంబ్రాల కోసం నిరీక్షించారు. దేవస్థానం ఆధ్వర్యంలో పట్టణంలోని పలు కూడళ్లలో తలంబ్రాల కేంద్రాలు ఏర్పాటు చేసిన భక్తులకు పూర్తి సమాచారం లేకపోవడంతో వారికి కనపడిన కేంద్రం వద్దనే ఎగబడి మరీ తలంబ్రాల కోసం పాకులాడారు. ఈ క్రమంలో తానీషా కళ్యాణ మండపం వద్ద భక్తుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది.

04/16/2016 - 04:24

భద్రాచలం, ఏప్రిల్ 15: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున విచ్చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు హెలీప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ ఛైర్‌పర్సన్ గడిపల్లి కవిత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

04/16/2016 - 04:22

ఎర్రుపాలెం, ఏప్రిల్ 15: జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ చంద్రస్వామి వారి కల్యాణంను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సీతారాముల వారిని ఉంచి అర్చకులు కురవి సుబ్రహ్మణ్యశాస్ర్తీ, మార్తి రమణబాబుల ఆధ్వర్యంలో ఈ కాల్యాణాన్ని నిర్వహించారు.

04/16/2016 - 04:21

చింతకాని, ఏప్రిల్ 15: శ్రీరామ నవమి సందర్భంగా మండల పరిధిలోని రామకృష్ణాపురం, లచ్చగూడెం, ప్రొద్దుటూరు గ్రామాల్లో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణానికి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక శాసన సభ్యులు మల్లు భట్టివిక్రమార్క హాజరయ్యారు. కల్యాణ వేడుకల్లో పాల్గొన్న ఆయన పురోహితుల దీవెనలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురిసి పంటలు పండాలని వేడుకున్నానని అన్నారు.

04/16/2016 - 04:20

భద్రాచలం, ఏప్రిల్ 15: జగదభిరాముడు...రఘుకుల సోముడు..శ్రీరామచంద్రుడు..కల్యాణరాముడుగా మారి...సౌందర్యరాశి...సుగుణాల సీతమ్మను అభిజిత్ లగ్నంలో పరిణయమాడాడు. నునుసిగ్గుల మొలకైన సీతమ్మకు నొసటన కల్యాణబొట్టు, బుగ్గన కాసింత దిష్టిచుక్కను పెట్టి..రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను అలంకరింప చేశారు. దీంతో అసలే సుగుణాల రాశి జనకుని కూతురు సీతమ్మ మరింత అందంగా కన్పించింది.

04/16/2016 - 04:16

చేబ్రోలు, ఏప్రిల్ 15: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వాడవాడలా సీతారామస్వామి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది శ్రీరామనవమి పండుగ సీతమ్మతల్లికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు రావడంతో ప్రతి గ్రామంలోని రామమందిరాల్లో సీతారాముల కల్యాణ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు.

04/16/2016 - 04:16

అచ్చంపేట, ఏప్రిల్ 15: మండలంలోని అన్ని గ్రామాల్లో దశరధ మహారాజు గారాల తనయుడు శ్రీరాముడు, జనక మహారాజు గారాలపట్టి సీతమ్మ తల్లి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అబిజిత్ లగ్నమందు జగదభిరాముడు, సీతమ్మతల్లి వివాహ వేడుకలు చలువ పందిళ్లలో వేడుకగా జరిగాయి. వివాహ వేడుకలను పురస్కరించుకుని రామాలయాలను సుందరంగా అలంకరించారు. నూతన వధూవరులైన సీతారామచంద్రమూర్తుల దర్శనంతో భక్తులు పులకించారు.

04/16/2016 - 04:15

మంగళగిరి, ఏప్రిల్ 15: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంగళగిరి పట్టణంలోను, పరిసర గ్రామాల్లోని ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

Pages