S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 04:51

శ్రీకాకుళం(కల్చరల్), ఏప్రిల్ 15: జగదభి రాముడు జానకి ప్రాణనాథుడయ్యాడు... సిగ్గులొలికే సీతమ్మ మెడలో అందాల రాముడు మూడు ముళ్లు వేశాడు... మణిబాసికాన్ని నుదుటన కట్టిన సీతమ్మ, సొంపుగా కస్తూరి నామాన్ని దిద్దుకున్న రామయ్య...వధూవరులుగా పెళ్లి సందడి చేశారు. లోకకల్యాణం కోసం జరిగిన సీతారామ కల్యాణాన్ని జనులంతా తిలకించి పరవశించిపోయారు.

04/16/2016 - 04:47

ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 15 : అగ్రిగోల్డ్ సమస్యను ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కరించే విధంగా జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం నాయకులు వి మోజేష్, జి జడ్సన్, ఏ కోటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

04/16/2016 - 04:47

ఒంగోలు, ఏప్రిల్ 15: ఒంగోలు నగరంలోని పోతురాజుపాలెంలో గల శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివార్ల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమం ఉంగరాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు పాల్గొన్నారు. పూజారులు ప్రత్యేకంగా పూజలు చేసి ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు.

04/16/2016 - 04:46

కందుకూరు, ఏప్రిల్ 15: ప్రకాశం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు. ఈ నేపధ్యంలో జిల్లాకు వరాలు జల్లు కురిసేనా అని ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.

04/16/2016 - 04:45

ఒంగోలు, ఏప్రిల్ 15 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చని పరిస్థితి నెలకొంది. జిల్లాకు వచ్చిన ప్రతిసారి అనేక హామీలు ప్రకటించటం ముఖ్యమంత్రికి పరిపాటిగా మారిందే తప్ప ఆ హామీల అమలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

04/16/2016 - 04:44

చీరాల, ఏప్రిల్ 15: ఎఎంసి చైర్మన్ పదవి నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బిసి సామాజికవర్గానికి చెందిన మహిళలకు ఇవ్వాలని పలువురు మహిళా నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ బిసి ఐక్యవేదిక సమావేశం పట్టణంలోని స్థానిక ఆదిపరాశక్తి ఆలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించారు.

04/16/2016 - 04:44

ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 15 : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా శ్రీరాముని కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వాడవాడలా చలువ పందిళ్లు వేసి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండవగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను వేదికపై ఉంచి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తలంబ్రాల కార్యక్రమాన్ని నయానానందకరంగా చేపట్టారు.

04/16/2016 - 04:43

ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 15 : ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

04/16/2016 - 04:42

ఒంగోలు, ఏప్రిల్ 15 : రాష్టర్రవాణా, రోడ్లు భవనాలశాఖమంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌ల రెండేళ్ల పరిపాలన భేష్‌గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పరోక్ష ఎన్నికల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చిన శిద్దా రాఘవరావుకు నవ్యాంధ్ర తొలి క్యాబినేట్‌లో రెండుశాఖలకు చెందిన మంత్రి పదవులు వచ్చాయి.

04/16/2016 - 04:37

నాయుడుపేట, ఏప్రిల్ 15: మండల పరిధిలోని అత్తిమిట్ట గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో, బైకు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలుకాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు పుదూరు గ్రామానికి చెందిన ఓసూరుమణి, గురుస్వామి, పీరాసి రత్నంలు బైకుపై పట్టణం నుండి స్వగ్రామానికి వెళుతున్నారు.

Pages