S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 04:37

తడ, ఏప్రిల్ 15: మండల పరిధిలోని మాంబట్టు సెజ్‌లోని వికెసి పరిశ్రమలో పనిచేస్తున్న ఇద్దరు యువతులు అదృశ్యమైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న గురువారం ఉదయం మండల పరిధిలోని మాంబట్టు పంచాయతీ ఎన్‌ఎం కండ్రిగకు చెందిన సుబ్రహ్మణ్యం కుమార్తె హారతి (17), కట్టవ గ్రామానికి చెందిన రమేష్ కుమార్తె నిషిత (18)లు విధులకు హాజరయ్యారు.

04/16/2016 - 04:37

నెల్లూరు, ఏప్రిల్ 15: స్థానిక మూలాపేట పోలీస్ క్వార్టర్స్ వద్ద శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఎస్పీ దంపతులు హాజరయ్యారు. ఎస్పీ విశాల్‌గున్ని దంపతులతోపాటు అదనపు ఎస్పీ శరత్‌బాబు దంపతులు కూడా హాజరై వారి చేతుల మీదుగా కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి.

04/16/2016 - 04:36

మనుబోలు, ఏప్రిల్ 15: రైతులు ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వం పనిచేస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ కె.హేమలత అధ్యక్షతన సోమిరెడ్డి చేతుల మీదుగా మత్స్యకారులకు సైకిళ్లు, వలలు పంపిణీ చేశారు.

04/16/2016 - 04:36

వెంకటాచలం, ఏప్రిల్ 15: అభివృద్ధే నినాదంగా కేంద్రంలో తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. వెంకటాచలంతోపాటు వింజమూరు మండల కేంద్రాల్లో 4 కోట్ల 33లక్షలతో నూతనంగా నిర్మించనున్న 30 పడకల సామాజిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల శిలాఫలకాలను శుక్రవారం ఆయన మండల కేంద్రమైన వెంకటాచలంలో ఆవిష్కరించారు.

04/16/2016 - 04:35

బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్ 15: పెన్నా నదిలో స్నానానికి వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం జొన్నవాడలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారంతో పాటు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వరికుంటపాడు మండలం జడదేవికి చెందిన యాదగిరి మురళి (15) ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు నెల్లూరులోని ఓ విద్యాలయంలో శిక్షణ పొందుతున్నాడు.

04/16/2016 - 04:35

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 15: విద్యార్థులు భారత దేశం సంస్కృతీ, సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. శుక్రవారం నెల్లూరు నగర శివారు కొత్తూరులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు.

04/16/2016 - 04:34

నెల్లూరు, ఏప్రిల్ 15: తన ఆటోలో ప్రయాణికుడు మరచిపోయిన బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించడం ద్వారా ఒక ఆటో డ్రైవర్ ఎస్పీ అభినందనలు అందుకున్నాడు. వివరాల్లోకి వెళితే... స్థానిక చింతారెడ్డిపాలెంకు చెందిన కాయల రఘు అనే యువకుడు నగరంలో ఆటో(నెం. ఏపి26 టిజి 4327) నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

04/16/2016 - 04:33

నెల్లూరుసిటీ, ఏప్రిల్ 15: శ్రీరామ నవమి సందర్భంగా నగరంలోని దర్గామిట్ట శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో నగరంలోని పలు రామాలయాలు తెల్లవారు జామున నుంచే శ్రీరామనామ జపంతో మారుమోగాయి. సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసేందుకు భక్తులు భారీగా వేదిక వద్దకు చేరుకున్నారు.

04/16/2016 - 04:30

భద్రాచలం, ఏప్రిల్ 15: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా రామాలయానికి వచ్చిన సీఎంకు అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. పరివట్టం కట్టి ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. గర్భగుడిలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ధ్వజస్తంభం వద్ద నమస్కరించారు.

04/16/2016 - 04:29

కూసుమంచి, ఏప్రిల్ 15: మన సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడేందుకు జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల ప్రదర్శన పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాత్రి జీళ్ళచెర్వు గ్రామంలో జాతీయ స్థాయి ఒంగోలు గిత్తలను పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జీళ్ళచెర్వు గ్రామస్థులు, నిర్వాహాకులు ఇంటూరి శేఖర్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు.

Pages