S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 04:14

అమరావతి, ఏప్రిల్ 15: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి, మండల పరిధి గ్రామాల్లో శుక్రవారం సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు పరాశరం రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.

04/16/2016 - 04:13

గుంటూరు, ఏప్రిల్ 15: ఆక్వారైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎక్సైజ్, బిసి సంక్షేమశాఖల మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. ఆక్వారైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుంటుందన్నారు.

04/16/2016 - 04:13

విజయపురిసౌత్, ఏప్రిల్ 15: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి మరో నాలుగు టీఎంసీల నీటి విడుదలకు కృష్ణానది జలాల యాజమాన్య మండలి అనుమతించింది. ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పదిరోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు రివర్‌స్లూయిట్ గేటు ద్వారా విడుదల చేస్తున్న నీటిని కొనసాగిస్తున్నారు.

04/16/2016 - 04:12

గుంటూరు (కల్చరల్), ఏప్రిల్ 15: ‘శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష, రామనామం మహాశక్తివంతం, ఆర్తజన బాంధవుడి నామపారాయణ జీవన్ముక్తికి సోపానం’ అంటూ వైఖానస, పాంచరాత్ర ఆగమ విధివిధానాలలో నిష్ణాతులైన వైష్ణవ అర్చకస్వాములు దశరథ తనయుడిని కీర్తిస్తుండగా శుక్రవారం గుంటూరు నగరంలో జగదానందకారకుని కల్యాణం జగన్మోహనంగా జరిగింది.

04/16/2016 - 04:10

ఆత్రేయపురం, ఏప్రిల్ 15: ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణం శుక్రవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. కల్యాణబ్రహ్మ శ్రీనివాసులు వెంకటాచార్యులు బ్రహ్మత్వంలో అర్చకులు వాడపల్లి రంగాచార్యులు, వాడపల్లి భాస్కరాచార్యులు, ఖండవల్లి శోభనాద్రాచార్యులు, టివి ఫణికుమార్ శర్మ అవధాని కల్యాణం నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ పెనుమత్స సత్యనారాయణరాజు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు.

04/16/2016 - 04:10

కాకినాడ, ఏప్రిల్ 15: డయల్ యువర్ జెసి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులతో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కోర్టుహాలులో డయల్ యువర్ జెసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వారి సమస్యలు చెప్పేందుకు జిల్లా కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు.

04/16/2016 - 04:09

కాకినాడ రూరల్, ఏప్రిల్ 15: ఇది చెట్టా? లేక చెట్టు ముసుగులో టవరా? అన్న సందేశం కలుగజేస్తోంది ఈ దృశ్యం. ఇది ఒక బహుళ జాతి కంపెనీ మాయాజాలపు సృష్టి. సెల్ టవర్ పేరు చెప్పితే రేడియేషన్ పేరుతో ఒణికిపోయే ఈ జనానికి చిన్న ముసుగు. ఈ టవర్‌ల వల్ల రేడియేషన్ వస్తుందని కొందరు, పర్వాలేదు అ ప్రభావం కొంతే, భయం లేదని కొందరు ఎవరి వాదన వారికి ఉంది. ఎక్కువ శాతం మందిలో మాత్రం రేడియేషన్ భయం ఉంది.

04/16/2016 - 04:09

పెదపూడి, ఏప్రిల్ 15: రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీకోదండ రాముని కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖుల రాకతో ఆలయ ఆవరణ అంతా సందడిగా మారింది. కల్యాణ ఘట్టాన్ని వీక్షించడానికి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. తెల్లవారు ఝాము నుండి స్వామిని దర్శించుకోడానికి భక్తులు బారులు తీరారు.

04/16/2016 - 04:08

అమలాపురం, ఏప్రిల్ 15:రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమితులై తొలిసారి తన నివాసమైన అయినవిల్లి మండలం మాగాం వచ్చిన మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీకి ఘనస్వాగతం లభించింది. కోనసీమ నలుమూలల నుండి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ధ సంఖ్యలో మాగాం చేరుకుని శివాజీని పూలమాలలతో ముంచెత్తారు.

04/16/2016 - 04:06

శంఖవరం, ఏప్రిల్ 15: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానం రత్నగిరిపై క్షేత్రపాలకులుగా వెలుగొందుతున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. చైత్రశుద్ధ నవమి పురస్కరించుకుని సీతారాములుకు తెల్లవారుజామున నాలుగు గంటలకు పంచామృతాభిషేకాలు, ఆరు గంటలకు అంకురారోపణ, ధ్వజారోహణం గావించారు.

Pages