S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/29/2016 - 03:44

న్యూఢిల్లీ, మార్చి 28: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (బిఐఎఎల్)లో 33 శాతం వాటాను అమ్మేస్తున్నట్లు జివికె పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సోమవారం తెలిపింది. 2,149 కోట్ల రూపాయలకు ఫెయిర్‌ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్ ఈ వాటాను దక్కించుకుంటోంది.

03/29/2016 - 03:44

న్యూఢిల్లీ, మార్చి 28: ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థ కాల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్.. సోమవారం మూడోసారి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను రూపాయి విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్‌కు 3 రూపాయల డివిడెండ్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో ఈ మేరకు ఆమోదం కూడా వచ్చినట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు కాల్గేట్ పామోలివ్ స్పష్టం చేసింది.

03/29/2016 - 03:43

జైపూర్, మార్చి 28: సింగరేణి సిఎండి శ్రీ్ధర్ సోమవారం ఎస్‌టిపిసి విద్యుత్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంటులో జరుగుతున్న పనులను పూర్తిస్థాయిలో పరిశీలించారు. అనంతరం పనులు నిర్వహిస్తున్న 11 సంస్థల ప్రతినిధులతో సాయంత్రం వరకు సమీక్షించారు. ముఖ్యంగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి సాధ్యమైనంత త్వరలో విద్యుత్‌ను అందజేయాలని, ఇందుకోసం పనులు వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు.

03/29/2016 - 04:40

న్యూఢిల్లీ, మార్చి 28: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేస్తున్నవారిపై ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా తరహా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

03/29/2016 - 03:40

గోదావరిఖని, మార్చి 28: ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో రామగుండం ఎన్టీపిసి గడువుకు మూడురోజుల ముందే 20,030 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిపి మరో రికార్డును సృష్టించింది. సోమవారం ఉదయం 10.30 గంటల వరకే నిర్ణయించిన వార్షిక ఉత్పత్తి 20,030 మిలియన్ యూనిట్లను అధిగమించడంతో ఎన్టీపిసి ఇడి ప్రశాంత్ కుమార్ మహాపాత్ర ఉద్యోగులను అభినందించారు.

03/29/2016 - 03:38

కడప, మార్చి 28: నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు కడప విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నారు. అందులో భాగంగా ఏప్రిల్ 5వ తేదీ నుంచి విజయవాడకు, 8 నుంచి హైదరాబాద్, తిరుపతిలకు విమాన సర్వీసులు నడపడానికి చర్యలు పూర్తయ్యాయి. గతంలో ఈ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమాన రాకపోకలను కొనసాగించారు. అయితే తగినంత మంది ప్రయాణికులు లేకపోవడంతో 4 నెలల క్రితం సర్వీసులను నిలిపివేశారు.

03/29/2016 - 03:36

ముంబయి, మార్చి 28: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం వృద్ధిపథంలో దూసుకెళ్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఏడాది నవ్యాంధ్రకు పర్యాటకులు 30 శాతం అధికమయ్యారు. సముద్ర తీర అందాలు, ప్రాచీన దేవాలయాలు, కొండ ప్రాంతాలు, జలపాతాలతో ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌కు 2015లో 12 కోట్ల 18 లక్షల 30 వేల మంది పర్యాటకులు వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయి.

03/29/2016 - 03:35

న్యూఢిల్లీ, మార్చి 28: ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రామాలకు పూర్తిగా సౌర శక్తి ఆధారంగానే విద్యుత్ ప్రసారం కానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తూర్పుతల్లు, పెదమ్యానవానిలంక గ్రామాలను ఈ ఏడాది 100 శాతం సౌర విద్యుత్ ఆధారిత గ్రామాలుగా మార్చబోతున్నట్లు సీతారామన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సౌర శక్తిపైనే గ్రామాలు ఆధారపడటం దేశంలోనే ఇది తొలిసారి అని ఆమె తెలిపారు.

03/29/2016 - 03:34

న్యూఢిల్లీ, మార్చి 28: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి.. కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లోని చమురు, గ్యాస్ బ్లాక్ అభివృద్ధికి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడుతోంది.

03/29/2016 - 03:32

ముంబయి, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుస లాభాల్లో పరుగులు తీస్తున్న సూచీలకు మదుపరుల భయాలు బ్రేకులు వేశాయి. మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగుస్తుండటం, ఏప్రిల్ 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష చేస్తుండటంతో ముందస్తుగా లాభాల స్వీకరణకు మదుపరులు ఆసక్తి కనబరిచారు.

Pages