S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/16/2018 - 22:33

సామర్లకోట, నవంబర్ 16: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్‌లోవున్న ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ వెనుక షెడ్‌లో పార్కింగ్ చేసి ఉన్న 20 మోటార్ సైకిళ్ళు, ఒక సైకిలు ఆగ్నిప్రమాదంలో శుక్రవారం తెల్లవారుజామున కాలి బూడిదయ్యాయి.

11/16/2018 - 22:32

కాకినాడ రూరల్, నవంబర్ 16: జిల్లా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు యతి ఫుడ్స్, వాటర్ ప్లాంట్‌లపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ డిజి గౌతం సేవాంగ్ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధర్ తన టీంతో ఈ దాడులు జరిపారు. రమణయ్యపేట ఇండస్ట్రీయల్ కాలనీలోని యతి ఫుడ్స్, నాగమల్లి జంక్షన్‌లోని వాటర్ ప్లాంట్‌పైనా శుక్రవారం దాడులు జరిపారు.

11/16/2018 - 22:29

కరీంనగర్, నవంబర్ 16: ఎన్నికల నియమావళిలో భాగంగా శుక్రవారం కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో రూ.12.85 లక్షలు పట్టుబడినట్లు నగర పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ పట్టణంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిపోతున్న రూ.9.63 లక్షలు, కరీంనగర్ రూరల్ పోలీసుల తనిఖీల్లో రూ.1.5 లక్షలు, కొత్తపల్లి పోలీసులు రూ.1.72 లక్షలను పట్టుకున్నట్లు వివరించారు.

11/16/2018 - 22:26

సిరిసిల్ల, నవంబర్ 16: కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అప్పుల బాధతో నేత కార్మికుడు గోశికొండ రాంప్రసాద్(52) బలవన్మరణం చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక గాంధీనగర్‌లోని ఆయన కార్కాణాలోనే బతుకమ్మ చీరెలు నేస్తున్న మరమగ్గాల మద్యనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడు సాంచాలు(మరమగ్గాలు) ఉన్న రాంప్రసాద్ వాటిపైనే వస్త్ర ఉత్పత్తులు చేస్తున్నాడు.

11/16/2018 - 22:15

టేకులపల్లి, నవంబర్ 16 : పత్తి పంట సాగు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి మనస్తాపానికి గురై ఒక రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మద్రాసుతండాలో గురువారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కోయగూడెం గ్రామ పంచాయతీలోని మద్రాసుతండాకి చెందిన బానోతు నగేశ్ (30)కు పది సంవత్సరాల క్రితం జ్యోతితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు.

11/16/2018 - 22:13

గుంటూరు (అరండల్‌పేట) నవంబర్ 16: అర్బన్ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అత్యంత సత్ఫలితాలు ఇస్తుంది. అర్బన్ పరిధిలో ఎక్కువ రోజులు ఇల్లు వదిలి బంధువులు, తీర్థయాత్రలు, శుభకార్యాలకు వెళ్లే వారు లాక్‌డ్ హౌస్ కెమేరాలు పెట్టుకుంటున్నారు. తాజాగా గుంటూరు అర్బన్ పరిధిలోని సంఘటన లాక్‌డ్‌హౌస్ కెమేరాల అవసరాన్ని తెలిపాయి.

11/16/2018 - 22:00

గుడిబండ, నవంబర్ 16 : మండలంలోని హిరేతుర్పి గ్రామంలో గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి తన కుమారులను కూడా బావిలోకి తోసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నాటక పావగడ తాలూకా కోటకు చెందిన లక్ష్మిని పదేళ్ల క్రితం మధుగిరి తాలూకా నిడదరగల్లుకు చెందిన యతీష్‌తో వివాహమయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

11/16/2018 - 03:24

సైదాబాద్, నవంబర్ 15: నామినేషన్ ర్యాలీలో అనుమతులు మీరడంతో మజ్లిస్ మలక్‌పేట మాజీ ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై మాదన్నపేటలో కేసు నమోదైంది. మజ్లిస్ నాయకులపై కూడా మూడు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం నామినేషన్ ర్యాలీ నిర్వహించిన మలక్‌పేట మజ్లిస్ అభ్యర్థి మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించినందుకు కేసు నమోదైంది.

11/16/2018 - 03:23

జీడిమెట్ల, నవంబర్ 15: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాజులరామారం, రోడామేస్ర్తి నగర్‌లో నివాసముండే ఇమ్రాన్ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తాడు. ఇతనికి అంబేద్కర్ నగర్‌కు చెందిన మహ్మద్ మాజిద్ కుమార్తె అమ్రీన్ బేగం(19)తో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి.

11/16/2018 - 03:23

కుషాయిగూడ, నవంబర్ 15: కుషాయిగూడ చక్రిపూరం చౌరస్తాలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండుగా రూ.12 లక్షలు స్వాధీనం చేసుకోని సీజ్ చేసినట్లు ఏన్నికల స్పెషల్ అధికారులు తెలిపారు. సీఐ చంద్ర శేఖర్ కథనం ప్రకారం... కుషాయిగూడ చక్రిపూరం చౌరస్తాలో ఏన్నికల ఫ్లైయింగ్ స్కాండ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తునట్లు తెలిపారు.

Pages