S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/07/2018 - 01:22

బేస్తవారపేట, మార్చి 6: బేస్తవారపేట మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన వివాహితను తర్లుపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలాల్లో హత్య చేసిన సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. వివరాల మేరకు ఖాజీపురం గ్రామానికి చెందిన నాగమణి (40)ని తర్లుపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యచేసి కంభం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.

03/07/2018 - 01:02

మొగల్తూరు, మార్చి 6: మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామ పంచాయతీ సమీపంలోగల ఆర్‌అండ్‌బీ రహదారిపై మంగళవారం ఉదయం పది గంటల సమయంలో జరిగిన రోడ్డుప్రమాదంలో తూర్పుతాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందింది. దీనికి సంబంధించిన వివరాలిలావున్నాయి.

03/07/2018 - 00:36

తిరుపతి, మార్చి 6: తిరుపతి, తిరుచానూరు, నెల్లూరు, కాకినాడ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ తమిళనాడుకు చెందిన అంతరాష్ట్ర దొంగ గిరిబాబు (34)ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 17,67,500 విలువచేసే 569 గ్రాముల బంగారు నగలు, కిలో 690 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి క్రైం సబ్ డివిజన్ డిఎస్పీ ఆర్.రవిశంకర్ రెడ్డి వెల్లడించారు.

03/06/2018 - 23:51

ఆత్మకూర్ (యం)/మోత్కూర్, మార్చి 6: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకొని.. మోసం చేసిన ప్రేమికుడు.. చివరికి ప్రేమికురాలిని దారుణంగా హత్య చేసి బావిలో పూడ్చివేసిన సంఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ కె.యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం..

03/06/2018 - 23:32

అచ్చంపేట, మార్చి 6: భార్యతో అక్రమ సంబంధం నడుపుతున్నడనే నెపంతో ఓ భర్త యువకుడిని కత్తితో పొడిచి చంపిన సంఘటన అచ్చంపేట పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సీఐ రామకృష్ణ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట పట్టణం గోకుల్‌నగర్ కాలనీకి చెందిన పుట్ట సైదులు (22) అనే అవివాహితుడు పట్టణంలో వాటర్ బండిపై డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు.

03/06/2018 - 04:50

కాటారం, మార్చి 5: మహాముత్తారం మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మండల కేంద్రం ఎంపీటీసీ మార్క రాముగౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి ఈ విషయాన్ని కాటారం డీఎస్పీ కేఆర్‌కే ప్రసాదరావు ధ్రువీకరించారు.

03/06/2018 - 04:41

హైదరాబాద్, మార్చి 5: అక్రమ పెట్టుబడుల కేసులో సిబిఐ కోర్టు ముందు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలన్న ఇండియా సిమ్మెంట్స్ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ పిటీషన్‌పై తీర్పును హైకోర్టు సోమవారం నాడు రిజర్వులో ఉంచింది.
దసపల్లా భూమి రిజస్ట్రేషన్ సస్పెన్షన్

03/06/2018 - 03:42

పాతబస్తీ, మార్చి 5: నగరంలో వేర్వేరు పోలీసు స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురిని సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుండి రూ. 7 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలోని సీసీఎస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఏడీసీపీ షరీన్ బేగం వివరాలు వెల్లడించారు.

03/06/2018 - 03:41

పాతబస్తీ, మార్చి 5: ఆటోలో మరచిపోయిన బ్యాగ్‌ను దొంగిలించిన ఆటోడ్రైవర్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి రూ. మూడున్నర లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఏడీసీపీ షరీన్ బేగం మాట్లాడుతూ నగరంలోని పటమటలంకకు చెందిన ఇంకొల్లు అంకమరావు (35) అగ్రిగోల్డ్‌లో పనిచేస్తూ మానేసి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు.

03/06/2018 - 02:58

ఘట్‌కేసర్, మార్చి 5: ఆర్టీసీ బస్సు కిందపడి ఇంజనీరింగ్ విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అవుషాపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. విద్యార్ధి మృతితో తోటి విద్యార్ధులు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేయడంతో రెండు గంటలపైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Pages