S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/05/2018 - 22:32

గుంతకల్లురూరల్, మార్చి 5: మండలంలోని కసాపురం ఆంజనేయస్వామి ఆలయానికి ఎదురుగానున్న పార్క్‌లో గుర్తుతెలియని వృద్ధుడు క్రిమిసంహారం మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కసాపురం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దాదాపు 60 సంవత్సరాల వృద్ధుడు ఆదివారం అర్ధరాత్రి సమయంలో క్రిమిసంహారక మందు తాగి మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామాంజినేయులు తెలిపారు.

03/05/2018 - 05:02

అద్దంకి, మార్చి 4: అద్దంకి మండలం వెంపరాల గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వద్ద బొప్పూడి శ్యాంసన్(45) హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు అద్దంకి సిఐ హైమారావు ఘటనా స్థలానికి వెళ్ళి మృతదేహాన్ని పరిశీలించారు. శ్యాంసన్‌ను శనివారం రాత్రి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హంతకులను పట్టుకునేందుకు ఒంగోలు నుండి జాగిలాలను, వేలిముద్రల సేకరించేందుకు క్లూస్‌టీంను రప్పించారు.

03/05/2018 - 05:01

మార్కాపురం టౌన్, మార్చి 4: ఇతరులతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త భార్యను కడతేర్చిన సంఘటన శనివారం రాత్రి పట్టణ శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పట్టణ శివారులోని చెన్నరాయునిపల్లి గ్రామానికి చెందిన పారుమంచాల చిన్నరంగమ్మ (47) ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త కృష్ణయ్య నిత్యం ఇంటివద్ద గొడవలు పడేవాడు.

03/05/2018 - 04:48

దర్భంగా, మార్చి 4: ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి ఒకరు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి అరుణ్‌కుమార్ ఝా (61), మధుబని జిల్లాలోని గారాటోల్ గ్రామం నుంచి పాట్నాకు తిరిగి వస్తుండగా, ఎన్‌హెచ్-7 పైన డివైడర్‌ను కారు ఢీకొని బోల్తా పడింది.

03/05/2018 - 04:19

కైకలూరు, మార్చి 4: ఆగి ఉన్న ఆటోను టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం పెరికెగూడెం ఐస్ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండల పరిధిలోని గోపవరానికి చెందిన ధారం సునీల్ సామ్రాజ్య (44) ట్రక్ ఆటోలో బియ్యం బస్తాలను కైకలూరు నుండి గుడివాడకు తీసుకువెళుతున్నాడు.

03/05/2018 - 00:28

సిరిసిల్ల, మార్చి 4: సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామంలో విద్యుత్ లైన్లు తెగి పడి 21 గొర్రెలు దుర్మరణం చెందాయి. ఆదివారం సాయంత్రం జరిగిన విద్యుతాఘాతం ఉదంతంలో గొర్రెల మందపై విద్యుత్ వైర్లు తెగి పడడంతో మందలో ఉన్న మొత్తం గొర్రెలు మృత్యువాతకు గురయ్యాయి. సలంద్రి మల్లయ్యకు చెందిన గొర్రెలను పెద్దూరులోని పెల్లెలో ఏర్పాటు చేసుకున్న దొడ్డికి చుట్టూ రక్షణగా ఇనుప కంచె నిర్మించారు.

03/05/2018 - 00:20

సైదాపూర్, మార్చి 4: మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన తిప్పారపు బాలమ్మ (47) అనే మహిళ రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సైదాపూర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్ తెలిపిన ప్రకారం..తనకున్న ఎకరంన్నర భూమితో పాటు మరో ఎకరమున్నర కౌలుకు తీసుకొని పత్తి, వరి సాగు చేసుకుంటోంది. గత మూడు సంవత్సరాల నుండి ఆశించిన దిగుబడి రాకపోవడంతో దాదాపు మూడు లక్షల రూపాయలు అప్పులైనట్లు ఆయన తెలిపారు.

03/04/2018 - 23:35

కట్టంగూర్, మార్చి 4: సెలవుదినం రోజున సరదాగా ఇంటి ముందు ఆడుకుంటున్న ముక్కుపచ్చలారని మూడేళ్లబాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద సంఘటన మండలపరిధిలోని ఈదులూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఈదులూరు గ్రామంలోని పందెనపల్లి రోడ్డులో అదేగ్రామానికి చెందిన జి.నర్సింహ అనేవ్యక్తికి చెందిన ట్రాక్టర్ సమీపంలో నిలిపి ఉంది.

03/04/2018 - 23:28

సదాశివపేట, మార్చి 4: చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మరో పత్తి రైతు సంఘటన మండల పరిధిలోని పొట్టిపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చవిచూసింది. గత నెల 27వ తేదీన బాబిల్‌గావ్ గ్రామానికి చెందిన తలారి శ్రీశైలం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరిచిపోకముందే మరోరైతు తనువు చాలించడంతో అన్నదాతల్లో ఆందోళన తీవ్రతరమవుతోంది.

03/04/2018 - 04:44

వి.కోట, మార్చి 3: సులభంగా రుణాలు వస్తాయని, తాకట్టు పెట్టిన బంగారు నగలు భద్రంగా ఉంటుందని భావించిన ఖాతాదారులకు ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ ప్రకాష్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులకు చెందిన రూ.కోటి విలువ కలిగిన ఆభరణాలను మాయం చేశాడన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు రూ. 40లక్షల విలువచేసే ఖాతాదారుల ఆభరణాలు లాకర్లోనుంచి మాయమైనట్లు ఆడిటర్లు గుర్తించారు.

Pages