S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/27/2016 - 21:30

అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ ప్రధాన తారాగణంగా గీతా ఆర్ట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ రూపొందించిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను నేరుగా ఏప్రిల్ 1న మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. విశాఖపట్నంలో పదో తారీఖున ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు.

03/27/2016 - 21:25

కన్నడంలో విజయం సాధించిన ‘రోజ్’ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నామని, ఇందులో సాయికుమార్ పాత్ర ప్రధానంగా హైలెట్‌గా ఉంటుందని నిర్మాత వరప్రసాద్ తెలిపారు. కృష్ణ అజయ్‌రావు, శ్రావ్య జంటగా కన్నడంలో రూపొందించిన రోజ్ చిత్రాన్ని తెలుగులో ‘పంతులుగారి అమ్మాయి’ (ప్రేమకథ) పేరుతో అనువాదం చేస్తున్నారు. చంద్రకళ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై సహనా హెచ్.ఎస్.

03/27/2016 - 21:24

నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన తరాగణంగా చందు మొండేటి దర్శకత్వంలో సితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశి రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

03/27/2016 - 01:33

దుర్గాదేవి ఫిలిం మేకర్స్ పతాకంపై ఎన్.డి. ఉదయ్‌కుమార్ దర్శకత్వంలో కవనరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. వికాస్, కళ్యాణి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తికావడంతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

03/27/2016 - 01:31

రాహుల్ రవీంద్రన్, కార్తిక్ ఆనంద్ ప్రధాన తారాగణంగా అమ్మా నాన్న ఫిలింస్ పతాకంపై రాథోడ్ దర్శకత్వంలో మణీంద్రన్.ఎం. రూపొందిస్తున్న ఓ చిత్రం వచ్చే నెలనుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందే ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని తెలిపారు.

03/27/2016 - 01:29

‘నాన్నకు ప్రేమతో’ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇటీవలే ముంబాయిలో భారీ షెడ్యూల్‌ను జరిపిన ఈ టీం హైదరాబాద్ చేరుకుంది. నేటినుండి హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో వేసిన గ్యారేజ్ సెట్‌లో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

03/27/2016 - 01:26

దినేష్, సాయి, సంజన, సుమలత, నిందు ప్రధాన తారాగణంగా చలనచిత్ర కంబైన్స్ పతాకంపై టి.రాము దర్శకత్వంలో వేణుగోపాల్ చౌదరి రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ భువనగిరిలో పూర్తయింది.

03/27/2016 - 01:23

వెండితెర అద్భుతం ‘బాహుబలి’ చిత్రం. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. వాటిని బద్దలు కొట్టడం సామాన్యమైన విషయం కాదు. అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ మాత్రం తన ‘తేరీ’ చిత్రంతో బాహుబలి రికార్డును బద్దలుకొట్టాడు. బాహుబలి ట్రైలర్‌ను 24 గంటల్లో 1.2 మిలియన్లమంది చూస్తే, ఇప్పుడు విజయ్ తాజా చిత్రం ‘తేరీ’ ట్రైలర్ కేవలం 22 గంటల్లోనే ఈ రికార్డును బద్దలుకొట్టింది. దీంతో అందరూ షాక్ తింటున్నారు.

03/27/2016 - 01:21

కామెడీ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించి అన్ని రకాల పాత్రలు పోషించగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకున్న ఈయన, ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నాడు. ఇప్పటివరకూ పాజిటివ్ పాత్రల్లో ఆకట్టుకున్న రాజేంద్రప్రసాద్ నెగెటివ్ పాత్రల్లో కూడా నటించేందుకు సిద్ధమవుతున్నాడు.

03/27/2016 - 01:19

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఏప్రిల్ 8న విడుదల
చేసేందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన ఆడియోకి మంచి
రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బిజినెస్ పరంగా
సంచలనం క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జోరుగా

Pages