S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/05/2015 - 06:58

అందాన్ని ప్రదర్శించడానికి వయసుతో పనిలేదని నిరూపిస్తోంది ఆల్ ఇండియా అతిలోక సుందరి శ్రీదేవి. ముదిమి మీదపడుతున్నా చూపులు తిప్పుకోలేనట్లు సైజ్ జీరో లెవెల్లో హొయలు పోతూ ఫొటోషూట్ చేసింది శ్రీదేవి. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి విజయ్‌తో చేసిన పులి సినిమాలో పాత్రకు మంచి గుర్తింపే వచ్చింది. ఓ రకంగా ప్రతినాయికగా నటించిన పులి చిత్రంలో ఆమె నటనకు మార్కులే పడ్డాయి.

12/05/2015 - 06:58

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కబాలీ’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రాధికా ఆప్టే నటిస్తోంది. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. మలేసియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో రజనీకాంత్ మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నాడు.

12/05/2015 - 06:57

వరస వర్షాలతో అతలాకుతలమైన చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు చలనచిత్ర రంగం చేయూతనిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ఎందరో ప్రముఖులు ఇప్పటికే తమవంతు సహాయం అందించారు. కాగా దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తాజాగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలుగు చిత్రసీమకు చెందిన అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, ప్రభాస్, కృష్ణంరాజు రూ. 15 లక్షలు, ఏపీలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం రూ.

12/03/2015 - 00:41

తెలుగులో పవన్‌కళ్యాణ్‌కున్న ఇమేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన సరసన హీరోయిన్‌గా నటించాలని చాలామంది హీరోయిన్లు తహతహలాడుతూంటారు. ఈ విషయంపై చాలామంది పవన్‌తో నటించాలనుందనే విషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లక్ష్మీరాయ్‌కు మాత్రం ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. పవన్‌కళ్యాణ్ తాజాగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాలో ఈమె ఓ ఐటెం సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

12/03/2015 - 00:39

ప్రస్తుతం దక్షిణాదిలో హారర్ సినిమాల హవా జోరు ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో రూపొందిన సినిమాలు వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ తరహా చిత్రాల్లో నటించేందుకు క్రేజీ హీరోయిన్లు సైతం సై అంటున్నారు. తెలుగు తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంచలన తార నయనతార ఇటీవలే ‘మాయ’ (మయూరి) సినిమాతో భయపెట్టిన విషయం తెలిసిందే.

12/03/2015 - 00:37

బాలీవుడ్‌లో చేసిన ఒక్క సినిమాతో హాట్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్ అటుపై తెలుగు, తమిళ భాషల్లో రెండు చిత్రాల్లో నటించింది. ఆమె చేసిన రెండు సినిమాలు అపజయం పాలవడంతో మళ్లీ బాలీవుడ్‌నే నమ్ముకుంది. ఒకటి రెండు సినిమాలు చేస్తున్న ఈ భామ ఇపుడు ఓ యువ హీరోతో ప్రేమాయణం సాగిస్తోంది. ఆ హీరో ఎవరో కాదు పుల్కిత్ సామ్రాట్.

12/03/2015 - 00:03

ప్రముఖ నటుడు మోహన్‌బాబు, అల్లరి నరేష్‌ల కాంబినేషన్‌లో శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘మామ మంచు అల్లుడు కంచు’.

12/03/2015 - 00:01

‘గమ్యం’, ‘వేదం’ వంటి చిత్రాలతో దర్శకునిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు క్రిష్. ఆయన ఇటీవలే రూపొందించిన ‘కంచె’ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కమర్షియల్‌గా ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని రాబట్టకపోయినా గుర్తింపు మాత్రం దక్కింది. తాజాగా తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తికావచ్చిందని తెలిసింది.

12/02/2015 - 23:59

ప్రస్తుతం చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాల కారణంగా జన జీవనం స్తంభించిపోయింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చెన్నై నగర వాసులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు వస్తున్నారు. తాజాగా నందమూరి సోదరులు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్‌రామ్‌లు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చారు. మహేష్ బాబు, ఎన్టీఆర్ చెరో రూ.10 లక్షలు, కళ్యాణ్‌రామ్ రూ.5 లక్షలు ప్రకటించారు.

12/02/2015 - 23:54

ముంబైలో జరిగిన ఫిల్మ్‌ఫేర్ స్టయిల్ అవార్డు-2015 ప్రదానోత్సవంలో బాలీవుడ్ తారలు తమ అందచందాలతో ఆహూతులను అలరించారు. హీరోయిన్ అలియాభట్ ‘ట్రెండ్‌సెట్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో అదరగొట్టింది. ప్రఖ్యాత డిజైనర్ జార్జెస్ చక్ర రూపొందించిన
దుస్తులతో మెరిసిపోయింది. ఇక సోనాక్షిసిన్హా అయితే మోనిష జైసింగ్ రూపొందించిన ఎర్రటిగౌన్ ధరించి ధగధగలాడింది.

Pages