S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త టైటిల్‌పై ఇద్దరు దర్శకులు ‘మాదంటే మాది’ అంటూ నానా రభస చేస్తున్నారు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా? ‘అహం బ్రహ్మస్మి?’ ఈ టైటిల్ కోసం ఓ వైపు క్రేజీ దర్శకుడు క్రిష్ ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ‘ఘాజి’తో సంచలన దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న సంకల్ప్‌రెడ్డి కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? మెగా హీరో వరుణ్ తేజ్. వివరాల్లోకి వెళితే...
నారా రోహిత్ ప్రస్తుతం ‘ఆటగాళ్ళు’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు పరుచూరి మురళీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. ఈ చిత్రంలో రోహిత్ సరసన హీరోయిన్‌గా బెంగాలీ నటి దర్శన బానిక్‌ను సెలెక్ట్ చేశారట. ఇప్పటికే ఆమె తన పాత్ర తాలూకు షూటింగ్ కూడా మొదలుపెట్టింది.
ఇండియన్ సినిమా 2013లో శత వార్షిక సంబరాలు చేసుకున్నప్పుడు- సిఎన్‌ఎన్ ఐబిఎన్ వాళ్లు చేసిన సర్వేలో - వందేళ్ల ఉత్తమ నటిగా - రూప్ కి రాణిగా ఉత్తరాదిన- అతిలోక సుందరిగా దక్షిణాన వాసికెక్కిన-250 చిత్రాల మహానటి శ్రీదేవి ఎంపికైంది.. నటుల పాలిట బాక్సాఫీసు వరం ఆమె - నటీమణుల పాలిట సింహస్వప్నం కూడా అయిన శ్రీదేవి - నిర్వచనానికి సరిపోయే ‘చైల్డ్ ప్రోడిజి’.
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ముంబైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో శివ, గోవింద గోవింద సినిమాల తరువాత దాదాపు 20 ఏళ్ళ గ్యాప్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా నిలిచిన శివ తర్వాత ఆ స్థాయిలో తెరెకెక్కుతున్న చిత్రమిది.
నిరూప్ భండారి, అవంతిక షెట్టి జంటగా, ఆర్య ముఖ్యపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజరథం’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పలువురు టాప్ టెక్నీషియన్లు ఈ ట్రైలర్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా రాజకృష్ణన్ మాట్లాడుతూ- ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే చిత్రం ఇదని, ఇంత మంచి చిత్రాన్ని అందిస్తున్న టీమ్‌ను అభినందించకుండా ఉండలేమని తెలిపారు.
షఫీ, లక్కీ ఎకారి, సాయికిరణ్, పూజాశ్రీ, మేఘన, జ్యోతికా యాదవ్ ముఖ్యపాత్రల్లో సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్ పతాకంపై హెచ్.రఘు నిర్మిస్తున్న చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాటల సీడీని ఎర్రళ్ల శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు శివారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మధుసూదనాచారి, ఆర్.కె.గౌడ్, సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఓ వైపు హీరోగా డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ మరోవైపు ‘అ!’తో నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం చిత్రంలో నటిస్తున్న నాని, మరో చిత్రానికి ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మైత్రీ మూవీస్ బ్యానర్‌లో పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.
సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ అంటే ఖచ్చితంగా గ్లామర్‌గా వుండాలి, అందంగా ఆకర్షించాలి. అందుకే ఆమెను అందమైన చందమామలా చూపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. సినిమాల్లో హీరోదే పైచేయి అయినా కూడా హీరోయిన్ లేకపోతే ఆ సినిమా లెక్కలోకి రాదు. హీరోయిన్ అంటేనే ఆ సినిమాకు అందం చందం.
‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ అంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. అతడితో సినిమా చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘సాహూ’ సినిమా చేస్తున్న ప్రభాస్ దీని తరువాత ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమాకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే.
బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దండుపాళ్యం. ఈ గ్యాంగ్‌కి కన్నడలో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు శ్రీనివాసరాజు సహజంగా తెరకెక్కించారు. అలా చేసిన దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 భారీ ఓపెనింగ్స్‌తో సూపర్ సక్సెస్ సాధించాయి.