S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/05/2020 - 22:25

అందంకన్నా అభినయమే మిన్న -అన్న చిత్రోక్తిని ఒకింత ఆలస్యంగా అర్థం చేసుకున్నట్టుంది రకుల్‌ప్రీత్. అందంకంటే అభినయానికి ప్రాధాన్యమంటూ -ముందుతరం హీరోయిన్లు ఎందుకు చెప్పేవారో ఇప్పుడు అర్థమైనట్టుంది ఈ పంజాబీ బ్యూటీకి. స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేసినా -ఒకేతరహా గ్లామర్ రోల్స్ ఏకబిగిన చేయడం వల్లే కెరీర్ కొంపమునిగిందన్న గ్రహింపుకొచ్చిందట ఈ జిమ్ ఫ్రీక్ బ్యూటీ.

03/05/2020 - 22:22

ధనుష్‌బాబు, సింధూర, కావ్యకీర్తి హీరో హీరోయిన్లుగా శ్రీవల్లిక ఫిలింస్ బ్యానర్‌పై దర్శకుడు ముస్కు రాంరెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం -నాకిదే ఫస్ట్‌టైం. నిర్మాత కురుపా విజయ్‌కుమార్ ముదిరాజ్ నిర్మిస్తోన్న చిత్రం ఆడియో, ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ -ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలా ఉంది.

03/04/2020 - 22:29

రక్షిత్, నక్షత్ర జోడీగా దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కించిన చిత్రం -పలాస 1978. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా శుక్రవారం విడుదలవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా సంగీత దర్శకుడు రఘు కుంచె మీడియాతో మాట్లాడాడు.

03/04/2020 - 22:27

సహజంగా -హీరోలతో ఎంటర్‌టైన్‌మెంట్ కథల్ని తెరకెక్కిస్తుంటారు. అలాంటి సినిమాల్ని ఆడియన్స్ చూసేశారు. అందుకే హీరోయిన్లనే హీరో పాత్రలుగా మలచి ఎంటర్‌టైన్‌మెంటే సినిమా చేశా. అదే అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అంటున్నాడు -దర్శకుడు బాలు అడుసుమిల్లి. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై ధన్య బాలకృష్ణ, సిద్దీ ఇద్నాని, త్రిధాచౌదరి, కోమలి లీడ్‌రోల్స్‌లో హేమ వెలగపూడి రూపొందించారు.

03/04/2020 - 22:24

విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్‌రావు, నిత్యశెట్టి, బ్రహ్మాజీ ప్రధాన తారాగణంగా భవ్య క్రియేషన్స్‌పై వి ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన చిత్రం -ఓ పిట్ట కథ. కొత్త దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కించిన చిత్రం 6న థియేటర్లకు వస్తోంది. కథలో కీలకమైన ఇనె్వస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర పోషించిన బ్రహ్మాజీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

03/04/2020 - 22:21

కనులు కనులను దోచాయంటే ఓటిటి, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చూసే సినిమా కాదు. థియేటర్స్‌లో చూస్తున్నపుడు కలిగే థ్రిల్లే వేరు. నేను కూడా సినిమాను థియేటర్‌లోనే సింగిల్‌గా చూశా. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వేరు, ఓటిటిలో వస్తుందని వెయిట్ చేయకండి అని కథానాయకుడు దుల్కర్ సల్మాన్ తెలిపారు.

03/04/2020 - 22:19

జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్లుగా మురళీ రామస్వామి (ఎంఆర్) తెరకెక్కిస్తోన్న చిత్రం -ప్రేమపిపాసి. ఎస్‌ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్ బ్యానర్‌పై రాహుల్‌భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రానికి పిఎస్ రామకృష్ణ (ఆర్‌కె) నిర్మాత. సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమా మార్చి 13న భారీఎత్తున విడుదల కానుంది.

03/04/2020 - 22:17

కుమారి 21ఎఫ్‌తో కుర్రకారుకి దగ్గరైన హెబ్బాపటేల్ -ఆ తరువాత అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. వచ్చిన కొద్దిపాటి చాన్స్‌లూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ చూపించినా ఫలితం లేకపోయంది. ఈమధ్యే విడుదలైన భీష్మలో ‘స్పెషల్ సెక్సీ అప్పియరెన్స్’తో కుర్రాళ్లను ఆకట్టుకున్న హెబ్బా -ఇప్పుడు రామ్ ‘రెడ్’తో మరో సెక్సీ గాలం వేయబోతోందట.

03/04/2020 - 22:15

హిట్టు తెచ్చిన ఉత్సాహంతో -ప్రతి ప్రాజెక్టునీ పండగ చేసే ప్రయత్నంలో ఉన్నాడు హీరో సాయితేజ్. ప్రస్తుతం -సోలో బ్రతుకే సో బెటర్ అన్న థీమ్‌తో దర్శకుడు సుబ్బు చేస్తున్న ప్రాజెక్టుతో బిజీగా వున్న సాయితేజ్, తరువాతి ప్రాజెక్టునీ లైన్‌లో పెట్టేశాడట. ‘ఎస్‌బిఎస్‌బి’ ప్రాజెక్టు చిత్రీకరణ దాదాపు పూరె్తైంది. మే 1న సినిమాను థియేటర్లకు తెచ్చే సన్నాహాల్లో చిత్రబృందం ఉంది.

03/04/2020 - 22:13

భయం, భక్తి, ఎదుటివాళ్లకు మర్యాద, నిర్మాత ఇచ్చే రూపాయికి విలువ గుర్తెరిగితే -ఎంతకాలమైనా పరిశ్రమలో కొనసాగొచ్చు. నాటకాల నుంచి సినిమాలకు వచ్చినపుడు అదే తెలుసుకున్నా. అదే పాటిస్తున్నా. అందుకే -ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నా -అంటోంది అన్నపూర్ణమ్మ. తొలినాళ్లలో ఒకట్రెండు హీరోయిన్ పాత్రలు చేసినా -తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలూ చేశారు అన్నపూర్ణ.

Pages