S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/31/2018 - 19:25

ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా విజయ్‌వర్మ పాకలపాటి ఎంపికయ్యారు. ద్వితీయ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళగిరి మండలం ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్‌లో ఆదివారం నిర్వహించారు. సమావేశంలో వాణిజ్య మండలి నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి కె సురేష్‌బాబు ప్రకటించారు.

10/31/2018 - 19:24

మిషాల్ శైలేష్‌జైన్, హేమలత హీరో హీరోయిన్లుగా శుక్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3 చిత్రం బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ప్రారంభమైంది. విఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో సంజీవ్‌కుమార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సత్యప్రకాశ్ క్లాప్ కొట్టగా నిర్మాత సంజీవ్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా సత్యప్రకాశ్ దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్‌లకు అభినందనలు తెలిపారు.

10/31/2018 - 19:23

అంతకుముందు ఆ తరువాత, లవర్స్, కేరింత వంటి సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో సుమంత్ అశ్విన్, దండుపాళ్యం సిరీస్ దర్శకుడు శ్రీనివాసరాజు కాంబినేషన్‌లో భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ‘గరుడవేగ’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

10/30/2018 - 19:54

ఇటీవలే తెలుగులో విడుదలైన ఆర్‌ఎక్స్ 100 సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ నెగెటివ్ షేడ్‌లో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటనతోపాటు గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు వస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

10/30/2018 - 19:53

భద్ర, సింహలాంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన కొరటాల శివ, మిర్చితో దర్శకుడిగా మారాడు. తర్వాత శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస హిట్లుతో అగ్ర దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్లు, టాప్ హీరోలు కొరటాల కోసం క్యూకట్టే పరిస్థితి ఉంది. అయితే, కొరటాల చిరంజీవితో సినిమా చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.

10/30/2018 - 19:51

పిఎస్‌వి గరుడవేగతో సక్సెస్ అందుకున్న రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న మరో యాక్షన్ మూవీ -కల్కి. గరుడవేగ సంచలన విజయంతో రాజశేఖర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

10/30/2018 - 19:49

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఓ చిత్రం తెరమీదకు రానుంది. ‘పలాస 1978’ పేరిట కరుణకుమార్ దర్శకత్వంలో అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ నిర్మించనున్నారు. రఘు కుంచె సంగీతాన్ని, వినె్సంట్ అరుల్ సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ యదార్థ సంఘటనల ఆధారంగా ‘పలాస 1978’ చిత్రాన్ని తెరమీదకు తెస్తున్నామన్నారు.

10/30/2018 - 19:48

ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనదైన బ్రాండ్ మార్క్‌తో దూసుకుపోతున్న బ్యానర్ మైత్రీ మూవీస్. స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలు నిర్మిస్తూ సంచలన విజయాలను నమోదు చేస్తున్నారు. బ్యానర్‌కు తగ్గట్టుగానే ముగ్గురు నిర్మాతల మైత్రి బంధం టాలీవుడ్‌లో మెగా బ్రాండ్‌ను క్రియేట్ చేసింది.

10/30/2018 - 19:46

కోలీవుడ్‌లో అందరూ ఫైర్‌బ్రాండ్ అనీ పిలిచే హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది వరలక్ష్మి. ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, హీరోయిన్‌గానే కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇటీవలే పందెంకోడి 2 చిత్రంలో నెగెటివ్ షేడ్‌లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా విజయ్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సర్కార్ చిత్రంలో నటించింది.

10/30/2018 - 19:44

శృంగార తార షకీల. 90లలో యూత్‌ను పిచ్చెక్కించిన స్టార్. షకీలా సినిమా వస్తుందంటే? స్టార్ హీరోల సినిమాలు సైతం వాయిదా పడిన సందర్భాలు లేకపోలేదు. ముఖ్యంగా కన్నడ, తెలుగు, మలయాళం భాషల్లో షకీలా సినిమాలకు పిచ్చి గిరాకీ. షకీలా సినిమా పోస్టర్ గోడమీద పడిందంటే చాలు యువతనుంచి పండుముసలి వరకూ థియేటర్‌వైపు సైకిళ్లు మళ్లించేవారు. షకీలా సినిమా తెలుగు డబ్బింగ్ టైటిల్స్ అంతే క్యాచీగా ఉండేవి.

Pages