S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/05/2018 - 19:44

మెగా ఆర్ట్స్ బ్యానర్‌పై వాడపల్లి జగన్నాథం సమర్పణలో వాడపల్లి రాజు, దావల రాజ్‌కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘మొనగాడెవరు’. ‘హు ఈజ్ నెం.1’ ట్యాగ్‌లైన్. ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కుమార్ రాజేంద్ర దర్శకుడు. రాజ్ వాడపల్లి, వంశీకృష్ణ, ప్రియా అగస్టీన్, కావ్య కీర్తిబండారి హీరో హీరోయిన్లు. ముహూర్తపు సన్నివేశానికి శివాజీరాజా క్లాప్ కొట్టగా బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్‌చేశారు.

11/04/2018 - 22:08

‘దేశముదురు’ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక, తర్వాత చాలా తెలుగు సినిమాల్లోనే నటించింది. తరువాత ఎందుకో కోలీవుడ్‌కు మకాం మార్చింది. తెలుగులో దాదాపు కనిపించడమే మానేసింది. ఈమధ్య హన్సిక పెళ్లి విషయమై మీడియాలో జోరుగా వార్తలు వస్తుండటంతో ఆమె స్పందించింది. తన వయసు 27 ఏళ్లని, వయసు దాచేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి వ్యవహారం మాత్రం తన తల్లికే వదిలేశానంటోంది.

11/04/2018 - 22:07

ఎక్కువ శాతం సినిమాలు -కాంబినేషన్‌లతోనే ఆసక్తి రేకెత్తిస్తాయి. క్రేజీ కాంబినేషన్ అంటూ కథనాలు వెలువడిన దగ్గర్నుంచీ -సినిమా

11/04/2018 - 22:01

ప్రస్తుత సీజన్ -హానెస్ట్ బేస్ట్ జోనర్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. కానె్సప్ట్ ఏదైనా నిజాయితీగా రాసుకుంటే ప్రేక్షకులు అంగీకరిస్తున్నారు. అలా వస్తోన్న మరో జోనర్ బేస్డ్ ఫిల్మ్ ‘హవా’. రీసెంట్‌గా రానా చేతులమీదుగా విడుదలైన మోషన్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘హవా’ కానె్సప్ట్ పోస్టర్‌ను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు.

11/04/2018 - 22:00

శ్రీవిష్ణు హీరోగా ‘నీది నాది ఒకే కథ’ అనే చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఉడుగుల మరోసారి వైవిధ్యమైన కథతో మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన రానా, సాయిపల్లవి జంటగా ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది.

11/04/2018 - 21:58

రుక్సార్ థిల్లాన్‌తో జత కట్టిన అల్లు శిరీష్ చేస్తున్న తాజా చిత్రం -ఏబీసీడీ. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ పాత్రలో చేస్తున్నాడు. సంజీవ్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న క్రేజీ ప్రాజెక్టును మధుర శ్రీ్ధర్‌రెడ్డి, యస్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడ సంగీత దర్శకుడు జుధాసాంధీ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రాజా, కోట, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

11/04/2018 - 21:57

బాలీవుడ్‌లో సీక్వెల్స్ షరా మామూలే. హిట్టయిన చిత్రాలకు సిరీస్‌లు రూపొందిస్తూనే ఉంటారు. తాజాగా మహేష్‌భట్ హిట్టు మూవీ సడక్‌కు సిరీస్‌గా సడక్-2 రాబోతోంది. మహేష్‌భట్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఆదిత్యరాయ్, సంజయ్‌దత్, పూజాభట్ ముఖ్య పాత్రధారులు. సడక్-2 చిత్రానికి సంబంధించి రెక్కీ మొదలైనట్టు పూజాభట్ వెల్లడించింది.

11/04/2018 - 21:56

అందమైన లొకేషన్స్‌లో అద్భుత కథాకధనాలతో తెరకెక్కిన చిత్రం -మంచు కురిసె వేళలో. రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా చేస్తున్న చిత్రానికి దర్శకుడు బాల బోడెపూడి. దర్శకుడు దేవా కట్టా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బాల తొలిసారి దర్శక నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూరె్తైన సందర్భంగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

11/04/2018 - 21:54

దర్శకుడు సుకుమార్ చాలాకాలం క్రితమే సుకుమార్ రైటింగ్ బ్యానర్‌లో నిర్మాణం మొదలెట్టాడు. కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ యువ దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. మొదటి రెండు చిత్రాలు ఒకింత స్లోగానే చేసినా, ఇపుడు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. సోలో ప్రొడ్యూసర్‌గా కాకుండా పెద్ద బ్యానర్లతో జాయింట్ వెంచర్లకు సుక్కూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్.

11/04/2018 - 21:53

క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నిర్మాణంలో నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో భారీ తారాగణంతోపాటు, కొంతమంది దర్శకులు నటిస్తున్నారు. దర్శకుడు దేవి ప్రసాద్ గుమ్మడిగా, క్రిష్ కె.వి.రెడ్డిగా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు ఎన్.శంకర్ కూడా విఠలాచార్యగా కనిపించబోతున్నారని సమాచారం.

Pages