S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/20/2016 - 20:48

పెళ్ళయ్యాక కథానాయికల తీరు మారుతుంది. అంతకుముందులా గ్లామర్‌గా కనిపించలేరు. ఎవరేమనుకొంటారో అనే ఫీలింగ్. పాత్రల విషయంలోనూ కొన్ని షరతులు విధించాల్సి వస్తుంటుంది. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా హుందాతనంతో కూడిన పాత్రలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. పెళ్ళయ్యాక అమలాపాల్ ప్రయాణం కూడా ఇంచుమించు అలాగే సాగింది. ఎక్కడా హద్దులు దాటి కనిపించినట్టు అనిపించలేదు.

09/19/2016 - 01:03

మహేష్‌బాబు కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో ఆమె పాల్గొంటోంది. అయితే, ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నయనతార నటించనున్నారని ఇటీవల టాలీవుడ్‌లో వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలో నిజంలేదని మురగదాస్ తన ట్విట్టర్ ద్వారా తేల్చిచెప్పారు.

09/19/2016 - 02:28

నానిని ‘అష్టాచమ్మ’తో పరిశ్రమకు హీరోగా పరిచయం చేసి, అతని కెరీర్‌లో ‘జెంటిల్‌మన్’ వంటి మర్చిపోలేని హిట్ ఇచ్చిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి త్వరలో యంగ్ హీరో నాగచైతన్యతో కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రము ఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మించనుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం మొదలవుతుందని తెలుస్తోంది.

09/19/2016 - 01:04

ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సినిమా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ప్రస్తుతం ‘లక్కున్నోడు’ చిత్రానికి పనిచేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ నేటినుండి జరుపుకోనున్న ఈ చిత్రంతో తనకు మంచి గుర్తింపు వస్తుందని డైమండ్ రత్నబాబు తెలిపారు.

09/19/2016 - 00:56

దర్శకుడు జయంత్ సి.పరాంజి గతంలో అగ్రహీరోలతో చిత్రాలను రూపొందించేవాడు. ఇప్పుడు నూతన నటీనటులను పరిచయంచేస్తూ కొత్త టాలెంట్‌ను వెండితెరకు చవిచూపుతున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన రవి గంటా హీరోగా కాళహస్తి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరో హీరో నీలేష్ ఈటి, ఇజబెల్ కథానాయికగా ఇషాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘ఉగ్రం’ అనే మరో చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నారు.

09/19/2016 - 00:54

‘అత్తారిల్లు’ సినిమా విడుదలైనప్పటినుండీ తమ యూనిట్ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఒక పాత్రను పెట్టారని, దానిని తొలగించాలంటూ బెదిరిస్తున్నారని చిత్ర దర్శకుడు అంజన్ కె. కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

09/19/2016 - 00:52

షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వరశర్మ దర్శకత్వంలో ఖయ్యూం, నందినీకపూర్ జంటగా మనోహర్‌కుమార్ తాడి రూపొందించిన చిత్రం డర్టీగేమ్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌తోపాటు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మా ట్లాడుతూ..

09/19/2016 - 00:51

రామ్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందిస్తున్న ‘హైపర్’ (ప్రతీ ఇంట్లో ఒకడుంటాడు) చిత్రానికి సంబంధించిన మొదటి పాటను విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభించిందని, మొదటి పాటకు కూడా అన్ని కేంద్రాలనుండి మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిపారు.

09/19/2016 - 00:40

గతంలో 5 కలర్స్ మల్టీమీడియా మూవీ పతాకంపై ‘ఏకవీర’, ‘వెంటాడు వేటాడు’ చిత్రాలను నిర్మించారు శ్రీనివాస్ దామెర. తాజాగా 5 కలర్స్ మల్టీమీడియా సమర్పణలో ఎస్‌టిఐఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘హౌల్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని తెలుగులోకి ‘దెయ్యాలబండి’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 23న ఇండియా వైడ్‌గా విడుదలవుతోంది.

09/19/2016 - 00:39

కన్నాంబ పసుపులేటి మూవీస్ పతాకంపై శివనాగేశ్వరరావు దర్శకత్వంలో పవన్, బిందు బార్బీ జంటగా దేవి చౌదరి రూపొందిస్తున్న చిత్రం ‘మనసంతా నువ్వే’. ఈ చిత్రానికి సంబంధించిన పాటలకు ప్లాటినమ్ డిస్క్ లభించిన సందర్భంగా హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించారు.

Pages