S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/08/2016 - 21:51

పరాయి భాషా కథానాయికలకు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలిగిపోవాలని కోరిక వుండడం సహజమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు భామలు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. ఇప్పుడు మరో పంజాబీ భామ టాలీవుడ్‌కి పరిచయం కానుంది. ‘అందాల రాక్షసి’ కథానాయకుడు నవీన్ చంద్ర, సంజీవ్‌కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘బుర్రకథ’ చిత్రంలో కథానాయికగా రోనికా సింగ్‌ను ఎంపిక చేశారు.

06/08/2016 - 21:49

కొంత గ్యాప్ తీసుకున్న తరువాత అల్లరి నరేష్ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా మారనున్నాడు. దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డితో భారీ చిత్రాన్ని, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌తో ఓ చిన్న సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో ‘వినవయ్యా రామయ్యా’ కథానాయికగా నటించిన కృతికా జయకుమార్‌ని ఎంపిక చేశారు. కృతికా జయకుమార్ ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేష్ కూతురిగా నటించిన సంగతి తెలిసిందే.

06/08/2016 - 21:46

ఓవర్సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఎంతపని చేశావే శిరీషా’. శివరామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పట్లూరి బాలకృష్ణ, రామ్‌ప్రసాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కానల నిర్మాతలు. మహత్ రాఘవేంద్ర కథానాయకుడు. పునర్నవి భూపాలం కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో బుధవారం ఉదయం జరిగింది.

06/08/2016 - 21:31

నందమూరి బాలకృష్ణ 100 చిత్రంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ చిత్రంలో శాతకర్ణి భార్య వాసిష్ఠ పాత్రకు హీరోయిన్ శ్రీయను ఎంపిక చేశారు. తొలుత నయనతారను తీసుకోవాలని భావించినా, ఆమె డేట్స్ కుదరకపోవడంతో దర్శకుడు క్రిష్ శ్రీయను ఎంపిక చేసినట్లు సమాచారం.

06/08/2016 - 21:28

ఐ వింక్ ప్రొడక్షన్స్‌లో డైరెక్టర్ వినోద్ లింగాల తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’ వెండితెర మీదకు రావడానికి సిద్ధమైంది. సాయిరోనక్, అతిది సింగ్, ఐశ్వర్య.కె, నోయల్ నేని, నవీన్ నేని ప్రధాన తారాగణంగా నటించారు. ఈనెలో 17న విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

06/08/2016 - 21:26

చిరంజీవి 150వ చిత్రం తమిళ ‘కత్తి’ రీమేక్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 15నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అనుష్కను కథానాయికగా అనుకున్న తరువాత పాటల చిత్రీకరణతో షూటింగ్ మొదలుపెట్టాలని చిరంజీవి, వి.వి.వినాయక్ భావించారు.

06/08/2016 - 21:22

‘పరిశ్రమలో సీనియర్ నటులను గౌరవించుకోవడం సంప్రదాయం. అది బాధ్యత కూడా. ఎక్కువకాలం సినీ పరిశ్రమకు సేవలు అందించిన సీనియర్‌లను ఎంపిక చేసి దశలవారీగా వారిని సత్కరించుకునేందుకు ఎజిఎమ్ మీటింగ్‌లను వేదికగా చేస్తున్నామని’ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు.

06/08/2016 - 21:19

‘ఇప్పుడు నిర్మాతగా ఎన్ని కథలు విన్నా లాభం లేకుండా ఉంది. కాంబినేషన్లు సెట్ చేసుకున్న తరువాతే సినిమా చేయడం ఉత్తమం’ అని అంటున్నారు ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల. ‘ఆరోప్రాణం’ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ‘యముడికి మొగుడు (అల్లరి నరేష్)’, ‘అడవిరాముడు (ప్రభాస్)’ వంటి సినిమాల నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’.

06/07/2016 - 22:02

సుమంత్ అశ్విన్

06/07/2016 - 22:00

శ్యామ్‌కుమార్, పావని, వౌనిక ప్రధాన పాత్రల్లో ప్రభాకర్ జైని దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మిస్తున్న చిత్రం ‘క్యాంపస్ అంపశయ్య’. హిందీలో కూడా డబ్‌చేసి విడుదల చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన హిందీ పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

Pages