S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/30/2016 - 06:10

బర్నింగ్ స్టార్‌గా హృదయకాలేయం సినిమాతో ఇమేజ్‌ని తెచ్చుకున్న సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం కొబ్బరిమట్ట. ఇటీవలే విడుదలే ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ టీజర్‌ను ప్రముఖ నటుడు చిరంజీవి చూసి సంపూర్ణేష్‌ను అభినందించాడట. రోనాల్డ్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంపూర్ణేష్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు.

05/30/2016 - 06:10

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో నిరుత్సాహానికి గురైనాడు. మొత్తంమీద అందులోంచి బయటకు వచ్చిన పవన్ మళ్లీ కొత్త ఉత్సాహంతో మరో సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. తన కెరీర్‌లో ‘ఖుషి’లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

05/28/2016 - 22:26

కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా ముప్పలనేని శివ దర్శకత్వంలో సాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్ సిరాజ్ రూపొందించిన చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 3న విడుదలకు సిద్ధం చేశారు.

05/28/2016 - 22:24

భారీ అంచనాల మధ్యన గత వారం విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ సినిమా అంచనాలను అందుకోలేక, అభిమానులను సైతం నిరాశపరచడంతో మహేష్ ఇకపై చేయబోయే సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సౌతిండియాలో పాపులర్ డైరెక్టర్ అయిన ఎ.ఆర్.మురగదాస్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైన మహేష్, ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

05/28/2016 - 22:21

బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌గా ఇమేజ్ తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మి. తన ప్రతి సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలతో సంచలనం క్రియేట్ చేసే ఇతగాడి బ్రాండ్‌కి బ్యాండ్ వేస్తుంది కుర్ర హీరోయిన్ ఆలియాభట్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమానుండే లిప్‌లాక్ సన్నివేశాలు, బికినీ, రొమాంటిక్ సీన్స్‌తో అందరికీ షాక్ ఇచ్చింది.

05/28/2016 - 22:19

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి ‘గబ్బర్‌సింగ్’ ఎంత ప్రత్యేకమైన సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన అభిమానులు ఎంతోకాలంపాటు ఎదురుచూసిన హిట్‌ని దర్శకుడు హరీష్‌శంకర్ ఈ సినిమాతో అందించారు. అలాంటి హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్‌లో తాజాగా మరో సినిమా తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

05/28/2016 - 22:16

సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి ప్రధాన తారాగణంగా సందీప్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ రూపొందించిన చిత్రం ‘నేను సీతాదేవి’. ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేశారు.

05/28/2016 - 22:14

క్రియేషన్స్ పతాకంపై రాజ్‌కృష్ణ, కీర్తన జంటగా బాలకృష్ణారెడ్డి దర్శకత్వంలో టి.రాజశేఖరరెడ్డి రూపొందించిన ‘రుద్ర ఐ.పి.ఎస్’ జూన్‌లో విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది.

05/28/2016 - 21:06

బాలీవుడ్ హాట్ భామ శిల్పా శెట్టి సీరోయిన్‌గా అప్పుడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో.. ఇప్పుడు సినిమాలు మానేసినా కూడా బిజినెస్ చేస్తూ.. మరోవైపు హాట్ హాట్ షోలలో పాల్గొంటూ అంతకంటే ఎక్కువే ఎక్కువే సంపాదిస్తోంది? ప్రస్తుతం సినిమాలు తగ్గిపోయాయి కాబట్టి రియాలిటీ షోలు చేస్తున్న ఈమె తాజాగా ‘ఇండియాస్ సూపర్ డాన్సర్’ అనే రియాలిటీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతోంది.

05/28/2016 - 21:02

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రం ఇటీవల తన తొలి షెడ్యూల్‌లో దాదాపు నలభై రోజులపాటు మొరాకోలో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రెండవ షెడ్యూల్‌కు సమాయత్తం అవుతున్నది.

Pages