S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

08/07/2016 - 21:52

‘‘్భద్రుడూ ఇది విన్నావటోయ్’’ హడావుడిగా లోపలికి వచ్చి అడుగుతున్న సత్యాన్ని చూసి ‘‘అబ్బే నువ్వు చెప్పందే ఏం వింటా’’ అంటూ ఎదురుప్రశ్న వేశాడు భద్రం.
‘‘అవున్నిజమే కదా! నే చెప్పందే నీకసలేం తెలవదు. సంగతేంటంటే ఈరోజు నాగన్న జన్మదినం. నువ్వు కాస్త శుభాక్షాంక్షలు చెప్పావనుకో. ఒకరికొకరు ఎంతో ఆనందిస్తారు’’ అన్నాడు సత్యం.

08/07/2016 - 21:49

ఏనుగుల ఘీంకారాలతో, అశ్వాల సకిలింపులతో, భటుల పదఘట్టనలతో రథాలు కదిలే శబ్దాలు కోట సామ్రాజ్యం దూరంగా జరిగిపోయాయి. కోటను దాటి దూరంగా కారడవిలోకి తరలాడు ధర్మరాజు. తోవ సవ్యంగా లేదు. మార్గం ముళ్లడొంకలమయం. పైగా సాయంకాలం అయింది. తోడుగా ధర్మా ఒక్కడే మిగిలాడు. మూన్నాళ్ల నుండి తిండి లేదు. ఆకలిగా ఉంది. దాహంగా ఉంది. దరిదాపుల్లో దాహార్తికి సమాధానంగా చిన్న నీటిమడుగైనా లేదు.

07/31/2016 - 07:58

వంశపారంపర్యంగా వస్తున్న పౌరోహిత్యాన్ని నమ్ముకున్నాడు రామావధాన్లు. భార్య, ఒకే ఒక్క కొడుకు. సంసారం చిన్నపాటిదే అయినా తను చేస్తున్న వృత్తికి భారమైనదే.

07/27/2016 - 00:06

‘‘మన స్కూల్లో ఎడ్మిషన్ కోసం వచ్చారట సార్’’ అన్నాడు ప్రిన్సిపాల్‌తో అటెండర్.
‘‘కూర్చోండి’’ మమ్మల్ని చూసి అన్నారు ప్రిన్సిపాల్‌గారు.
‘‘నమస్తే సార్. వీడు మా అబ్బాయి వినీత్’’ అని చెబుతూనే వినీత్ వైపు తిరిగి ‘‘సార్‌కి నమస్కారం చెప్పరా’’ అని చెవి దగ్గర గొణిగాను.
రెండు చేతులూ జోడించాడు వినీత్.
‘‘ఇంతకు ముందు ఏ స్కూల్లో చదివావు వినీత్?’’ నవ్వుతూ అడిగారు ప్రిన్సిపాల్.

07/26/2016 - 23:59

‘‘ఒరేయ్ విజయ్! ఇది చాలా పెద్ద కంపెనీ. మంచి జీతం. మరిచిపోకుండా ఇంటర్వ్యూకి వెళ్లు. సర్ట్ఫికెట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి సరిగ్గా చూసుకో’’ గోపాలరావు కొడుక్కి పదేపదే జ్ఞాపకం చేయసాగాడు.

07/26/2016 - 23:57

ఆత్మలో మమతల వనం నవనవలాడింది అక్షరామృత ఆస్వాదనలో మానవత్వపు విశ్వరూపం ఆవిష్కృతమైంది. సర్వులకు చిరునవ్వు కన్నీళ్లు ఒక్కటే యని ఆ భావ సమైక్య మైకమే నన్ను మనిషిని చేసింది. అంటూ బుద్ధికి జల్లెడ పట్టే జన హృదిని స్పృశించే ఏభైఏడు కవితల్ని ‘నైవేద్యంగా’ ఆవిష్కరించారు శ్రీమతి ఎస్ సుమత్రాదేవి. ఎంతో జీవితానుభవం గలిగిన చేయి తిరిగిన రచయిత్రిగా తన రెండవ కృతిగా మధుర మంజుల, భావరంజిత, కావ్యాన్నందించారు.

07/17/2016 - 07:38

‘‘మన స్కూల్లో ఎడ్మిషన్ కోసం వచ్చారట సార్’’ అన్నాడు ప్రిన్సిపాల్‌తో అటెండర్.
‘‘కూర్చోండి’’ మమ్మల్ని చూసి అన్నారు ప్రిన్సిపాల్‌గారు.
‘‘నమస్తే సార్. వీడు మా అబ్బాయి వినీత్’’ అని చెబుతూనే వినీత్ వైపు తిరిగి ‘‘సార్‌కి నమస్కారం చెప్పరా’’ అని చెవి దగ్గర గొణిగాను.
రెండు చేతులూ జోడించాడు వినీత్.
‘‘ఇంతకు ముందు ఏ స్కూల్లో చదివావు వినీత్?’’ నవ్వుతూ అడిగారు ప్రిన్సిపాల్.

,
07/10/2016 - 22:55

ఊళ్లకు ఊళ్లే నోరు తెరచి
వేయి కళ్లతో వేచి ఉన్నాయి
ఆల్చిప్పలై
ముత్యాలు రాలకపోవా
చినుకులుగా మారకపోవా అంటూ

ఎటు చూసినా ఎండమావులే
వడదెబ్బలిక సహజ చావులే
దేశమే ఎడారి కొలిమి మరి

07/10/2016 - 22:44

సాహిత్యం సమాజానికి అద్దం వంటిదని మన ప్రియతమ నాయకుడు, మొట్టమొదటి ప్రధాని నెహ్రూ అన్నారు. సమాజంలో చోటు చేసుకున్న సామాజిక పరిస్థితులు, బలాలు, బలహీనతలు, ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బడుగు జీవుల జీవన పోరాటం, జరుగుతున్న మోసాలు, కుట్రలు అన్నీ సాహిత్యంలో మనకు కనిపిస్తాయి.

07/10/2016 - 22:40

ఇదొక అపూర్వమైన, అద్భుతమైన వచన రచన. స్వామి వివేకానంద తన జీవితకాలంలో ఆధ్యాత్మిక, చారిత్రక, సామాజిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు. స్వామి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అవన్నీ గ్రంథస్థం అయ్యాయి. కాని శివాజీ గురించి ప్రస్తావించిన ప్రసంగం ఆ సంకలనంలో ఎక్కడా లేదు. ఇది కాకతాళీయమో, మరొకటో తెలియదు.

Pages