S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

03/13/2018 - 23:44

విశాఖపట్నం, మార్చి 13: విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రకటించడంతో విశాఖలో నిరసనలు హోరెత్తాయి. జోన్ ఇవ్వనందుకు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ తెలుగుదేశంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు మంగళవారం రోడ్డెక్కి నిరసన తెలియచేశాయి. స్థానిక రైల్వేస్టేషన్ వద్ద దక్షిణ నియోజకవర్గ టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

03/13/2018 - 23:43

విశాఖపట్నం, మార్చి 13: ప్రజా ధనం వృధా చేసిన, ప్రభుత్వ ఆస్తులకు నష్టకలిగించిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారిలో కొంతమందిని శిక్షణించి, మరికొంతమందిని నిర్దోషులుగా విడిచిపెట్టిన ఘటనలు విశాఖ రెవెన్యూ శాఖలో నిత్యం దర్శనమిస్తున్నాయి. విశాఖలో సుమారు 3000 కోట్ల రూపాయల భూ కుంభకోణంలో కేవలం కొద్ది మంది రెవెన్యూ అధికారులపైనే చర్యలు తీసుకున్నారు.

03/13/2018 - 23:41

పాడేరు, మార్చి 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని పోరాటాన్ని ఉదృతం చేస్తామని సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి సభ్యులు సి.హెచ్.నర్సింగరావు చెప్పారు. స్థానిక గిరిజన భవన్‌లో మంగళవారం నిర్వహించిన సి.పి.ఎం. జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బి.జె.పి. ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని అన్నారు.

03/13/2018 - 23:40

అరకులోయ, మార్చి 13: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో మానవ వనరులు, వౌళిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల సరళిని కేంద్ర పరిశోధన బృందం పరిశీలించింది. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ బృందం గత మూడు రోజులుగా మానవ వనరులు, వౌళిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల సరళిని పరిశీలించి మండల స్థాయి అధికారులతో మంగళవారం సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

03/13/2018 - 23:39

రావికమతం, మార్చి 13: వివిధ అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన మూడు కోట్ల 50 లక్షల రూపాయల విలువైన గంజాయిని డీ ఐజీ సి.హెచ్.శ్రీకాంత్, రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, నర్సీపట్నం ఎ ఎస్పీ అరీప్ హఫీజ్ సమక్షంలో మంగళవారం మారకద్రవ్య నిరోధక బృందం దగ్ధం చేసింది. మండలంలో కళ్యాణపులోవ పోతురాజుబాబు ఆలయ సమీపంలో భారీ గొయ్యిని తవ్వి దీనిలో వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి తీసుకువచ్చిన గంజాయిని పోసారు.

03/12/2018 - 22:19

పాడేరు, మార్చి 12: పాడేరుకు సమీపాన చింతలవీధి గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణీ దుర్మరణం పాలయ్యింది. మండలంలోని గుత్తులపుట్టు పంచాయతీలో ఉపాధి హామీ పథకంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఈశ్వరమ్మ (35) గుత్తులపుట్టు నుంచి పాడేరు వస్తుండగా వెనుకనుంచి వచ్చిన క్వారీ లారీ ఆమెను ఢీ కొట్టింది. దీంతో ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.

03/12/2018 - 22:17

అరకులోయ, మార్చి 12: అరకులోయలో వైసీపీ అవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ శాసనసభ్యుడు కుంభా రవిబాబు, అరకులోయ నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్త చెట్టి ఫల్గుణలు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వైసీపీ జెండాను ఆవిష్కరించారు.

03/12/2018 - 22:16

కొయ్యూరు, మార్చి 12: మండలంలోని నడింపాలెం సమీప జీడిమామిడి తోటలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి కొయ్యూరు పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కొయ్యూరు ఎస్సై రుక్మంగధరరావు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. నడింపాలెం సమీపంలో పేకాట పందాలు సాగుతున్నాయన్న సమాచారంతో కొయ్యూరు సి. ఐ.

09/10/2017 - 04:09

‘‘నేను చెప్పినట్లే నువ్వు వినాలి’’2
‘‘అలా జరగనే జరగదు’’2
‘‘నీకు పొగరెక్కువ’’
‘‘తెలుసు కదా! పద్ధతిగా వుండండి’’
‘‘పద్దతి గురించి నిన్ను చూసి నేర్చుకోవలసిన అవసరం లేదు’’
‘‘పద్ధతి తెలీదు నేర్చుకునే ఓపికా లేదు’’
‘‘నువ్వు యిలాంటి దానివని తెలిస్తే....’’2
‘‘తెలిస్తే ఏమయ్యేది’’
‘‘నిన్ను చచ్చినా పెళ్లి చేసుకోకపోదును’’
‘‘పీడా విరగడయ్యేది’’

09/10/2017 - 04:08

మార్పు కోరుకునేవాడు
ముందు తను మారాలి
ఆచరించి చూపాలి
అందరు అధికారులు
అవినీతిపరులే అనుకోవద్దు
ఎందరో ఆదర్శవంతులున్నారు
వారి సాయంతో సమస్య పరిష్కారం
ప్రేమంటే చావు కాదు
ప్రతీకారం అంతకన్నా కాదు
ప్రేమ అర్థం తెలుసుకో ప్రేమ సౌథాన్ని నిర్మించుకో
- గుడిమెట్ల గోపాలకృష్ణ, అరసవిల్లి.

Pages