S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/30/2017 - 02:01

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు చౌకబారుగా ఉన్నాయని బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా శుక్రవారం విమర్శించారు. అంతేకాదు తన పనిని జైట్లీ విమర్శించడమంటే తనకు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలను అప్పగించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిని విమర్శించడమే అవుతుందని ఆయన అన్నారు.

09/30/2017 - 01:07

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్)కు 2017-18 సంవత్సరం రెండో విడతగా రాష్ట్రానికి రూ.299.60 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది. అలాగే ‘స్వదేశీ దర్శని’ పథకంలో భాగంగా బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి రూ.10 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్ర విడుదల చేసిన నిధులను 10 శాతం ఫెక్సీ నిధులుగా వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.

09/30/2017 - 00:43

ముంబయి, సెప్టెంబర్ 29: దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. స్థానిక ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లోని ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాటలో 22 మంది మృత్యువాతపడ్డారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దసరా పండుగ రోజున జరిగిన దుర్ఘటన పలువురిని విషాదంలో ముంచివేసింది. ఈ రైల్వే స్టేషన్‌లో లోకల్ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి.

09/30/2017 - 00:41

ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ పేరును మార్చే రోజునే తొక్కిసలాట ఘటన జరగడం గమనార్హం. ముందు నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ స్టేషన్ పేరును ప్రభాదేవి స్టేషన్‌గా పేరు మార్చాల్సి ఉండింది. బ్రిటీష్ పాలనలో ఈ ప్రాంతాన్ని పాలించిన గవర్నర్ ఎల్విన్‌స్టోన్ గౌరవార్థం అప్పట్లో ఈ స్టేషన్‌కు ఆయన పేరు పెట్టారు.

09/29/2017 - 02:17

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: రైల్వేల ఆధునీకరణ, ప్రయాణికుల భద్రత పెంచేందుకు రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి మనోజ్ సిన్హా, రైల్వే బోర్డు అధ్యక్షుడు అశ్వినీ లోహానీ గురువారం విలేఖరుల సమావేశంలో ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు. రైలు ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు.

09/29/2017 - 02:15

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: విద్యాసంస్థల వసతి గృహల్లో ఆహారం కలుషితం కావడం, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తరచూ వింటూనే ఉంటాం. అయితే దేశ రాజధాని ఢిల్లీలోని ఓ వసతి గృహంలో తయారుచేసిన చట్నీలో చనిపోయిన ఎలుక దర్శనం ఇవ్వడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన జరిగింది ఏదో మామూలు వసతి గృహంలో కాదు.

09/29/2017 - 02:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మఖన్ లాల్ ఫోతేదార్ గురువారం కన్నుమూశారు. మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు విశ్వాసపాత్రుడయిన ఫోతేదార్ ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో గల ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

09/29/2017 - 02:10

లండన్, సెప్టెంబర్ 28: తల్లి గర్భం దాల్చిన నాలుగులోజులకే శిశువుకు గుండె రూపుదిద్దికుంటుంది. గర్భస్రావాలపై శాస్తవ్రేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నేచర్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో అధ్యయన నివేదిక ప్రచురితమైంది. తల్లి కడుపులో పిండం గుండె ఎదుగుదలపై పరిశోధనలు జరిపారు. లీడ్స్ యూనివర్శిటీ శాస్తవ్రేత్తలు ఎంఆర్‌ఐ టెక్నాలజీని ఉపయోగించి అధ్యయనం చేశారు.

09/29/2017 - 02:10

కర్నాల్, సెప్టెంబర్ 28: డేరాబాబా గుండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశాడు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు ఇరవై ఏళ్లు జైలుశిక్ష పడ్డ సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. డేరా సచ్ఛా సౌదాలోని ఖుర్బానీ విభాగం నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆయన వాపోయాడు.

09/29/2017 - 02:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తన గుజరాత్ పర్యటనలో పలు హిందూ అలయాలను సందర్శించడాన్ని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఎద్దేవా చేస్తూ ముందు మీరు హిందువు అనే విషయాన్ని రుజువు చేసుకోండంటూ రాహుల్‌కు సూచించారు. ‘తాను హిందువునని ఆయన మొదట ప్రకటించాలి’ అని స్వామి గురువారం విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

Pages