S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/26/2017 - 02:52

ఇంఫాల్, ఫిబ్రవరి 25: మణిపూర్‌లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నాగా ఒప్పందంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి ఎన్నికల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని శనివారం ఇక్కడ ఆరోపించారు. ‘నాగా ఒప్పందంవల్ల మీకు వీసమంత ఎత్తు నష్టం జరగదని నేను భరోసా ఇస్తున్నాను. మణిపూర్ ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్నదే మా ఉద్దేశం’ అని ప్రధాని స్పష్టం చేశారు.

02/26/2017 - 02:37

అహ్మదాబాద్, ఫిబ్రవరి 25: అహ్మదాబాద్ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. శుక్రవారం సాయంత్రమే ఈ సంఘటన జరిగినప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చింది.

02/25/2017 - 02:40

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: తమిళనాడు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను డిఎంకె వర్కింగ్ ప్రెసిండెంట్ స్టాలిన్ జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం 10 జన్‌పథ్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీఅయ్యారు.

02/25/2017 - 02:39

శ్రీనగర్, ఫిబ్రవరి 24: జమ్మూ-కాశ్మీరులో శాంతిని పునరుద్ధరించేందుకు భారత్, పాకిస్తాన్ మధ్య మళ్లీ చర్చలు జరగాల్సిన అవసరం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఉద్ఘాటించారు.

02/25/2017 - 02:29

గోండా, ఫిబ్రవరి 24: నోట్ల రద్దు తర్వాత మహారాష్టత్రో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ఘన విజయాలు సాధించడంతో నూతనోత్సాహంతో ఉరకలు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిని తుదముట్టించడానికి తాను కృతనిశ్చయంతో ఉన్నానని చెప్పారు. ‘ఒడిశా రాష్ట్రం.. పేదరికం, ఆకలి, నిరుద్యోగం అక్కడ చాలా ఎక్కువ.. అక్కడ బిజెపికి తమ పార్టీ జెండా ఉంచడానికి కూడా పట్టు లేదు.

02/25/2017 - 02:27

బహ్రైచ్(యూపీ), ఫిబ్రవరి 24: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను బలహీన ప్రధానిగా అభివర్ణిస్తూ బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని శుక్రవారం ఇక్కడ విరుచుకుపడ్డారు. మోదీ స్వరం సన్నగిల్లుతోందని, బలహీనపడుతోందని వ్యాఖ్యానించారు. ఓ ఎలుక కంటే కూడా మోదీ స్వరం బలహీన పడిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

02/25/2017 - 02:29

చెన్నై, ఫిబ్రవరి 24: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేన కోడలు దీపా జయకుమార్ శుక్రవారం కొత్త రాజకీయ ఫోరం ప్రారంభించారు. తన రాజకీయ ప్రస్థానం మొదలైందని పేర్కొన్న దీప ఈ ఫోరం జెండాను కూడా ఆవిష్కరించారు. ఎంజిఆర్ అమ్మ దీపా ఫోరంగా పేర్కొనే ఈ రాజకీయ వేదిక పతాకంపై ఎంజిఆర్, జయలలిత బొమ్మలు ముద్రించారు.

02/25/2017 - 02:18

చెన్నై, ఫిబ్రవరి 24: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత 69వ జయంతిని ఆ రాష్ట్ర ప్రభు త్వం, ఎఐఎడిఎంకె పార్టీతో పాటు అసమ్మతి నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం వర్గీయులు శుక్రవారం పోటాపోటీగా నిర్వహించి, మరోసారి పరస్పరం మాటల తూటా లు పేల్చుకున్నారు. వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పేద ప్రజలకు సహాయాన్ని అందజేయడం ద్వారా వారు జయలలిత పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు.

02/25/2017 - 02:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: భారతీయ జనతా పార్టీని ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి తీసుకు రావడానికి వారణాసి నియోజకవర్గం కేంద్రంగా ఆ పార్టీ పెద్ద నాయకులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.

02/25/2017 - 02:14

ఇంఫాల్, ఫిబ్రవరి 24: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మరే పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే రాష్ట్రంలోనూ తమ పార్టీ నాయకుడని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీతో బిజెపి ముఖాముఖి పోటీ పడుతోంది.

Pages