S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/24/2017 - 02:55

లక్నో, ఫిబ్రవరి 23: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి గురువారం జరిగిన నాలుగోవిడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 61 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 1.84 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 12 జిల్లాల పరిధిలోని 55 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారి వెల్లడించారు. వెనుకబడిన బుందేల్‌ఖండ్‌లోనూ పోలింగ్ సజావుగా సాగింది. ఉదయం బూత్‌ల వద్ద ఓటర్లు స్వల్పంగా కనిపించారు.

02/24/2017 - 02:53

కొచ్చి, ఫిబ్రవరి 23: ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన ముద్దాయిని అరెస్టు చేయడం ద్వారా పోలీసులు కొంత పురోగతి సాధించారు. సంఘటన జరిగి ఆరు రోజులైనప్పటికీ నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

02/24/2017 - 02:51

చెన్నై, ఫిబ్రవరి 23: అమ్మబాట నుంచి దారితప్పిన వారిని తిరిగి అదేబాటలోకి సాదరంగా ఆహ్వానిస్తామని అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ గురువారం అన్నారు. పార్టీ నుంచి బహిష్కృతులైన వారినందరినీ తిరిగి పార్టీలోకి అమ్మ ప్రేమతో ఆదరిస్తామన్నారు. తాను పార్టీలోకి తిరిగి రావటంపై వచ్చిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

02/24/2017 - 02:48

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: దేశంలో విభిన్న సమాజాల మధ్య సహనం, అందరి పట్ల కరుణ, ప్రేమ, మాతృభూమి పట్ల ఎనలేని దేశభక్తి భారత్‌కు ఉన్న వౌలిక విలువలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ‘్భరత్ విధానం సుసంపన్నమైన సంప్రదాయాలు, నాగరిక విలువలను ప్రపంచానికి అందించింది. ఇవి సార్వకాలికమైనవి. ఇవాళ్టికీ వర్తించేవి’ అని ఆయన అన్నారు.

02/24/2017 - 02:46

అంబేద్కర్‌నగర్ (యుపి), ఫిబ్రవరి 18: దేశంలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాను మించిన ‘కసబ్’లు లేరని బిఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా విమర్శించారు. అంబేద్కర్‌నగర్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ అమిత్‌షాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలను కలిపి ‘కసబ్’ అంటూ ఉగ్రవాదితో అమిత్‌షా పోల్చటాన్ని ఆమె తప్పుపట్టారు.

02/24/2017 - 02:45

చెన్నై, ఫిబ్రవరి 23: అన్నాడి ఎంకె దివంగత అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమ ఆసుపత్రిలో చేరిన తరువాత ఆమె కోరిక మేరకే ఫోటోలు విడుదల చేయలేదని చెన్నై అపోలో ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. వైద్యం జరుగుతున్న సందర్భంలో ఫోటోలు తీసినప్పటికీ, జయ నిరాకరించటంతో ఫోటోలు విడిదల చేయలేదన్నారు.

02/24/2017 - 02:44

వారణాసి, ఫిబ్రవరి 27: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఎన్నికల ప్రచారంతో వేడెక్కనుంది. ఈ నెల 27న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీ సిఎం అఖిలేశ్ యాదవ్ రోడ్‌షో నిర్వహించనున్నారు. రోడ్‌షోను విజయవంతం చేయడానికి ఇరుపార్టీల కార్యకర్తలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో వారణాసి లోక్‌సభ ఉంది. మార్చి 8న అక్కడ ఎన్నికలు జరుగుతాయి.

02/24/2017 - 02:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ గురువారం రాత్రి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో ్ర నియమాలకు విరుద్ధంగా పళనిస్వామి విశ్వాస పరీక్ష జరిగిందని రాష్టప్రతికి ఫిర్యాదు చేశారు.

02/24/2017 - 02:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: శ్రీకృష్ణుడి నగరం ద్వారకను పర్యాటక వలయంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ద్వారక మందిరానికి 6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు 16.27 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. ద్వారకకు సమీపంలోని రాంచోడ్ తలవ్, షఖందర్ సరస్సులను కూడా ఈ పథంకంలో భాగంగా అభివృద్ధి చేస్తారు.

02/24/2017 - 02:41

గాంధీనగర్, ఫిబ్రవరి 23: రైతు ఆత్మహత్యలపై గుజరాత్ అసెంబ్లీ గురువారం అట్టుడికిపోయింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ముష్టిఘాతాలకు పాల్పడ్డారు. ఇరుపక్షాలు పరస్పరం దాడులకు దిగాయ. ఘర్షణల్లో ఓ మహిళా మంత్రితోపాటు మరో శాసన సభ్యుడు గాయపడ్డారు. గొడవకు కారణమైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభనుంచి సస్పెండ్ చేశారు.

Pages