S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/25/2017 - 02:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఎనిమిదేళ్ల క్రితం ఓ ఎంబిఎ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో నిందితులందరినీ ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చింది. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉండడం వల్లే రేపిస్టులు తప్పించుకోగలిగారని కోర్టు పేర్కొంది. నిందితులను గుర్తించేందుకు అవసరమైన జుడీషియల్ టెస్ట్ ఐడింటిఫికేషన్ ప్రక్రియను దర్యాప్తు అధికారి సరైన పద్ధతిలో నిర్వహించలేదని కోర్టు మండిపడింది.

02/25/2017 - 02:12

ఆజంగఢ్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 24: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా విరుచుకుపడ్డారు. ‘రాహుల్ ఇంకా పరిణతి సాధించలేదు. ఇందుకు మరికొంత సమయం పడుతుంది’ అని షీలా దీక్షిత్ అన్నారని పేర్కొంటూ, ‘అతను ఇంకా పరిణతి సాధించకుంటే, ఎందుకు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు? ఇదేమైనా రాజకీయ ప్రయోగశాలనా?

02/25/2017 - 02:12

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశరాజధానిలోని ఏపీ భవన్‌లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం అంబేద్కర్ ఆడిటోరియంలో టిం ఏపీ భవన్, ఏపీ ప్రభుత్వ సాంస్కృతికశాఖ ఆధ్వర్యలో జరిగిన ఈ ఉత్సవాల్లో తెలుగువారు విశేషంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏపీలోని కృష్ణా-గోదావరి నదుల నుంచి తెప్పించిన మృత్తిక (నదుల మట్టి)తో పురోహితులు పూజలు నిర్వహించారు.

02/25/2017 - 02:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల పట్ల హార్వర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, యేల్ అండ్ న్యూయార్క్ యూనివర్శిటీ తదితర అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన 400 మందికి పైగా విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు జెఎన్‌యు వైస్ చాన్సలర్ జగదీష్ కుమార్‌కు బహిరంగ లేఖ రాశారు.

02/25/2017 - 02:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: మధ్యంతర శ్రేణి క్షిపణి అభివృద్ధికి సంబంధించి ఇజ్రాయెల్‌తో భారత్ ఒప్పందం ఖరారైంది. 17వేల కోట్ల రూపాయల వ్యయంతో భూ ఉపరితలం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన క్షిపణిని అభివృద్ధి చేస్తారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డిఆర్‌డిఓ), ఇజ్రాయెల్ విమాన నిర్మాణ సంస్థ(ఐఏఐ) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడతాయి.

02/25/2017 - 01:38

కోయంబత్తూర్, ఫిబ్రవరి 24: భిన్నత్వంలో ఏకత్వమే భారతీయత ప్రత్యేకత అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.దీనే్న భారతీయ సాంస్కృతిక శక్తిగా అభివర్ణించారు.

02/25/2017 - 01:22

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఇపిఎఫ్‌ఓ) నాలుగు కోట్లకు పైగా ఉండే తమ చందాదారులకోసం వచ్చే నెల ఒక హౌసింగ్ పథకాన్ని ప్రారంభించబోతోంది. సభ్యులు ఇళ్లు కొనుగోలు చేయడానికి చెల్లించాల్సిన డౌన్‌పేమెంట్‌తో పాటుగా నెలవారీ కంతులను కూడా తమ ఇపిఎఫ్ ఖాతాలనుంచే చెల్లించేందుకు వీలుగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. ‘ఇపిఎఫ్‌ఓ తమ చందాదారులకోసం ఒక హౌసింగ్ పథకాన్ని సిద్ధం చేసింది.

02/24/2017 - 11:47

న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ కా ర్యక్రమానికి ప్రచారకర్తగా నటి శిల్పాశెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. పారిశుద్ధ్యం ఆవశ్యకతపై ప్రజలకు రేడియో, టీవీ ప్రసారాల ద్వారా ఆమె అవగాహన కల్పిస్తారని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ, స్వచ్ఛభారత్ డైరెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ పాత్రికేయులకు తెలిపారు ఆ మేరకు ఆమె ప్రచారం చేస్తున్నట్లు తెలిపే పోస్టర్లను దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తారు.

02/24/2017 - 11:36

న్యూఢిల్లీ: అమెరికాలోని కన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా కన్సాస్‌లోని ఓ బార్‌లో ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. మృతుడిని కూచిబొట్ల శ్రీనివాస్‌గా గుర్తించారు. కాల్పుల్లో గాయపడిన వారిలో మేడసాని అలోక్‌ పరిస్థితి విషమంగా ఉంది.

02/24/2017 - 02:56

బహ్రైచ్ (యూపీ), ఫిబ్రవరి 23: యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయొద్దన్న ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవాచేశారు. గురువారం ఇక్కడ బిజెపి విజయశంఖానాద్ ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ గుజరాత్ గాడిదలంటే అఖిలేశ్ ఎందుకంత భయపడుతున్నారో అర్థం కావడంలేదని అన్నారు.

Pages