S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/19/2017 - 03:08

పెట్రేగిపోయిన డిఎంకె సభ్యులు
స్పీకర్ చొక్కానే చించిన వైనం
స్పీకర్ సీట్లో కూచుని వీరంగం
రెండుసార్లు సభ వాయిదా
డిఎంకె సభ్యులను సస్పెండ్
చేసి విశ్వాస పరీక్ష నిర్వహణ
పక్కా ప్రణాళిక ప్రకారం
స్టాలిన్ బృందం అరాచకం
ఆత్మహత్య చేసుకుంటానని
ఎంకె స్టాలిన్ బెదిరింపు
1989 నాటి
సన్నివేశాలు పునరావృతం

02/19/2017 - 03:04

ఉదయపూర్, ఫిబ్రవరి 18: దేశమంతటా ఒకేరకమైన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలు దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. దీనిని అమలు చేయడం వల్ల రాష్ట్రాలకు వచ్చే రెవిన్యూ నష్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన చట్టాన్ని జిఎస్‌టి కౌన్సిల్ శనివారం ఆమోదించింది. దీని అమలుకు వీలుగా తీసుకురావలసిన అనుబంధ చట్టాల ఆమోదాన్ని తదుపరి సమావేశానికి వాయిదా వేసింది.

02/18/2017 - 03:41

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేజోన్ ఏర్పాటుపై రైల్వేబోర్డు అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని ఉంది కదా అని విలేఖరులు శుక్రవారం బోర్డు అధికారులను ప్రశ్నించగా ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం వలన ఏం లాభం? అని వారు ఎదురు ప్రశ్నించారు.

02/18/2017 - 02:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: పర్యావరణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుకు కారణం గురించి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా అంతా కలిసి స్వచ్ఛమైన పర్యావరణం కోసం కృషి చేయాలని ఆయన ఉద్బోధించారు. పర్యావరణాన్ని పరిరక్షించవలసిన అవసరంపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన 16 బోగీలతో కూడిన సైన్స్ ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం ఇక్కడ ఆయన ప్రారంభించారు.

02/18/2017 - 02:17

రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 17: ఉత్తరప్రదేశ్‌కి దత్తపుత్రుడిలా సేవలు అందిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంతో మంది పుత్రులున్న ఉత్తరప్రదేశ్‌కు నిజంగా బయటి నాయకులు అవసరమా? అని ప్రియాంక ప్రశ్నించారు.

02/18/2017 - 02:15

ఎటావా, ఫిబ్రవరి 17: సమాజ్‌వాది పార్టీకి కంచుకోట అయిన ఎటావాలో చిన్నాన్న శివపాల్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పరోక్షంగా విమర్శలు కరిపిస్తూ, తన నేతృత్వంలోనిదే అసలైన సమాజ్‌వాది పార్టీ అని, తనను బలహీనపరచడానికి ప్రయత్నించే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.‘నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నవారు నాకు, నేతాజీకి (ములా యం) మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించారు.

02/18/2017 - 02:13

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: మహాత్మాగాంధీ హత్యకు సంబంధించిన ఇతర రికార్డులతో పాటుగా ఆయనను కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను జాతీయ ప్రాచ్య పత్ర భాండాగారం (నేషనల్ ఆర్కైవ్స)కు చెందిన వెబ్‌సైట్‌లో తక్షణం ఉంచాలని కేంద్ర సమాచార కమిషన్(సిఐసి) తీర్పు చెప్పింది.

02/18/2017 - 02:13

లక్నో, ఫిబ్రవరి 17: లక్నో సెంట్రల్ నియోజకవర్గంలో ‘ఓటరు నంబర్ 141’ మరోసారి తన ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఈ ఓటరు ఎవరో కాదు. లోక్‌సభలో వరుసగా అయిదుసార్లు లక్నో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన 92 ఏళ్ల మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి. చివరిసారిగా 2004 లోక్‌సభ ఎన్నికల్లో వాజపేయి ఓటు వేశారు. ఆయన 2004 ఎన్నికల్లోనే చివరిసారిగా పోటీ చేశారు.

02/18/2017 - 02:09

చెన్నై, ఫిబ్రవరి 17: తమిళనాడులో అధికార అన్నాడిఎంకెలో తలెత్తిన రాజకీయ సంక్షోభం రోజుకో మలుపుతిరుగుతోంది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం శనివారం తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శశికళ వర్గానికి కంటిమీద కునుకు లేకుండా చేయడానికి పన్నీర్‌సెల్వం నేతృత్వంలోని ప్రత్యర్థివర్గం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

02/18/2017 - 02:07

పూణె, ఫిబ్రవరి 17: తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి అయనా అక్కడి ప్రభుత్వాన్ని కేంద్రం బలపరుస్తుందని, అవసరమైన సహాయం చేస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. తమిళనాడులో అధికార అన్నాడిఎంకె ఆంతరంగిక వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకో బోదని తెలిపారు. తమిళనాడు లో తమకు కావలసింది స్థిరమైన ప్రభుత్వ మే తప్ప, దానికి ఎవరు ముఖ్యమంత్రి అన్నది కాదని ఆయన స్పష్టం చేశారు.

Pages