S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/03/2016 - 04:06

భద్రాచలం, డిసెంబర్ 2: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల పిఎల్‌జిఎ వారోత్సవాలు అనేక హింసాత్మక సంఘటనల నడుమ శుక్రవారం ప్రారంభమయ్యాయి. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 204 కోబ్రా బలగాలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రెషర్‌బాంబు పేలి ఇద్దరు జవాన్లు ముమేంద్రకుమార్, తరుణ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.

12/03/2016 - 04:06

చింతూరు, డిసెంబర్ 2: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నేపథ్యంలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు పన్నిన వ్యూహం పోలీసుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది. జాతీయ రహదారిపై కరపత్రాలు, బ్యానర్ల కింద టిఫిన్ బాంబులు, డిటోనేటర్లు అమర్చగా, ఒఎస్‌డి ఫకీరప్ప పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి వెళ్లి చాకచక్యంగా వ్యవహరించి బాంబులను నిర్వీర్యం చేశారు. వివరాలిలా ఉన్నాయి.

12/03/2016 - 03:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: భారీ పరిమాణంలో ద్రవ్య రూపంలో నగదు ఉండటం వల్లే అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

12/03/2016 - 03:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. శుక్రవారం నాడు రాజ్యసభలో ప్రజాప్రతినిధుల అనర్హతకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, 191లలోని నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు.

12/03/2016 - 03:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ పదవి నుంచి అనిల్ సిన్హా శుక్రవారం పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన తరువాతి స్థానంలో ఉన్న గుజరాత్ కేడర్ 1984 బ్యాచ్ ఐపిఎస్ అధికారి రాకేష్ ఆస్థానా కొత్త చీఫ్‌గా ఆ బాధ్యతలను చేపట్టారు. సిబిఐకి తదుపరి పూర్తిస్థాయి డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం ఎవరినీ ఎంపిక చేయకపోవడంతో ఆస్థానా ఈ బాధ్యతలు చేపట్టారు.

12/03/2016 - 02:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశ వ్యాప్తంగా శుక్రవారం కూడా అన్ని బ్యాంకులు, ఎటిఎమ్‌లలో నగదు కటకట కొనసాగిన నేపథ్యంలో ఈ నెలాఖరు వరకూ దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అప్పట్లోగా పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. డిసెంబర్ 30నాటికి దేశంలో కరెన్సీ కొరత గణనీయంగా తీరుతుందని చెప్పారు.

12/03/2016 - 02:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులను తొలగించడానికి తీసుకొంటున్న చర్యలేమిటో తక్షణం తెలియజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ఆదేశించింది.

12/03/2016 - 02:04

కొచ్చి, డిసెంబర్ 2: నౌకాదళంలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమేనని, అయితే సామర్థ్యంపై దాని ప్రభావం ఎంతమాత్రం లేదని సదరన్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ ఎ.ఆర్.కావే స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు నావికా దళాలు సన్నద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

12/03/2016 - 01:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో విచారణలు మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలపించేలా ఆదేశివ్వాలని కోరుతూ బిజెపి అధికార ప్రతినిధి, న్యాయవాది అశ్వని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

12/03/2016 - 01:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఓటింగ్‌తో కూడిన చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన నినాదాలతో శుక్రవారం లోక్‌సభ దద్దరిల్లిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని దుర్వినియోగం చేస్తోందటూ ప్రతిపక్షాలు ఈరోజు లోక్‌సభను స్తంభింపజేశారు.

Pages