S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/02/2016 - 02:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: కోర్టులు రాజకీయాలకు వేదికగా మారడం సమంజసం కాదని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ఒక రాజకీయ పార్టీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయవచ్చా, అనుసరించవచ్చా అనే అంశంపై వాదనల సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘దీనివల్ల రాజకీయాలు కోర్టులకు మళ్లుతాయనే భయాలున్నాయి. మాకు ఇది ఇష్టం లేదు.

12/02/2016 - 02:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యను ప్రముఖ ప్రొఫెషనల్ రెజిలర్ కాళీ గట్టిగా సమర్థించారు. గ్రేట్ కాళీగానే అందరికీ బాగా తెలిసిన దలీప్ సింగ్ రాణా గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు దీర్ఘకాలంలో దేశానికి మేలు చేస్తుందని చెప్పారు.

12/02/2016 - 02:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాడివేడిగా ఉంటున్న రాజ్యసభ గురువారం కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. సభ వాయిదాపడిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ 15 నిముషాలసేపు సభలోనే ఉండి ఎంపీలతో పిచ్చాపాటీ మాట్లాడుతూ కనిపించారు. ప్రతిపక్ష పార్టీల సభ్యులను పలకరిస్తూ వారితో మాట్లాడుతూ గడిపారు.

12/02/2016 - 02:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురయిన మరుసటి రోజే ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి)కు చెందిన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తులు దానిలో కొన్ని అభ్యంతరకరమైన ట్వీట్లు పోస్ట్ చేశారని కాంగ్రెస్ గురువారం పేర్కొంది.

12/02/2016 - 02:41

చెన్నై/ కడలూరు, డిసెంబర్ 1: నాడా తుపాను గురువారం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారడంతో తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలకు కొంత ఊరట కలిగింది. ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

12/02/2016 - 02:40

చెన్నై, డిసెంబర్ 1: డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి మందులు వికటించి ఎలర్జీ రావడంతో గురువారం ఉదయం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఇదే సమస్యంతో గత నెల రోజుల నుంచి ఆయన బయటకురావడం లేదు. డ్రగ్ ఎలర్జీతో 93ఏళ్ల కరుణానిధిని కావేరీ ఆసుపత్రిలో చేర్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొద్దిరోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉంటారని వారు తెలిపారు.

12/02/2016 - 02:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించటం ద్వారా ప్రజాస్వామ్యంతోపాటు ప్రతిపక్షాల నోరు నొక్కుతోందని పదహారు ప్రతిపక్ష పార్టీల నాయకులు గురువారం రాత్రి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.

12/02/2016 - 02:05

సూళ్లూరుపేట, డిసెంబర్ 1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 7న పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో ముహూర్తం ఖరారు చేసింది.

12/02/2016 - 01:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశంలో గురువారం ఒకవైపు విమానాలలో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్) ధర తగ్గగా, సామాన్య జనం సహా అధిక సంఖ్యలో ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువు అయిన సబ్సిడీ వంటగ్యాస్ (ఎల్‌పిజి) ధర పెరిగింది. ఎటిఎఫ్ ధర 3.7 శాతం తగ్గగా, సబ్సిడీపై అందజేసే ఎల్‌పిజి ధర సిలిండర్‌కు రూ. 2.07 శాతం చొప్పున పెరిగింది. సబ్సిడీ వంట గ్యాస్ ధర పెరగడం గత ఆరు నెలల్లో ఇది వరుసగా ఏడోసారి.

12/02/2016 - 01:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: బంగారంపై కేంద్రం పన్ను విధిస్తుందని, జరిమానా వేస్తుందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ, ప్రత్యక్ష పన్నుల విభాగం(సిబిడిటి) వివరణ ఇచ్చాయి. పసిడిపై పన్నుకు సంబంధించి వస్తున్న వదంతులు వేటినీ నమ్మరాదంటూ గురువారం సిబిడిటి స్పష్టమైన ప్రకటన చేసింది. వారసత్వంగా సంక్రమించిన బంగారంపై కానీ, వెల్లడించిన ఆదాయంతో కొన్న బంగారంపై కానీ ఎలాంటి పన్నూ ఉండవని తేల్చి చెప్పింది.

Pages