S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/30/2016 - 01:58

పెద్ద నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా జనం ఇబ్బందులు ఒకరకం కాదు. దేశం మొత్తంమీద లక్షలాది ఏటిఎంలున్నా, కోట్లాది రూపాయల కొత్త నోట్లు అందించడం గగనమైంది. బ్యాంకుల్లో డబ్బు సరిపోకపోవడంతో, ఎక్కడికక్కడ ఏటిఎంలు మూతపడుతున్నాయ. దీంతో ఢిల్లీలో జనం అవసరాలు తీర్చేందుకు మైక్రో ఏటిఎంలు ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీ నార్త్ బ్లాక్‌లో మైక్రో ఏటిఎంల ద్వారా నగదు అందచేస్తున్న బ్యాంకు సిబ్బంది.

11/30/2016 - 01:38

న్యూఢిల్లీ, నవంబర్ 29: విపక్షాల నినాదాలు, గందరగోళ పరిస్థితుల మధ్య ఆదాయం పన్ను సవరణ బిల్లును ఎలాంటి చర్చ లేకుండా లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత డిపాజిట్ అయ్యే నల్లధనంపై 50శాతం పన్ను విధించడానికి, అలాగే మరో పాతిక శాతాన్ని నాలుగేళ్ల పాటు ప్రభుత్వం వద్దే ఉంచుకోవడానికి, మిగిలిన పాతిక శాతం మొత్తానే్న తిరిగి తీసుకోవడానికి బిల్లు వీలు కల్పిస్తోంది.

11/30/2016 - 01:36

జమ్ము, నవంబర్ 29: జమ్ములో మంగళవారం జరిగిన సాయుధ ఉగ్రవాదులు రెండో చోట్ల జరిపిన దాడుల్లో ఓ మేజర్ సహా ఏడుగురు జవాన్లు మరణించారు. బిఎస్‌ఎఫ్ డిఐజితో పాటు ఎనిమిది మంది జవాన్లు గాయపడ్డారు. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదుల్ని జవాన్లు మట్టుబెట్టారు.

11/30/2016 - 01:01

న్యూఢిల్లీ, నవంబర్ 29: వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తాజాగా దాఖలయిన రెండు పిటిషన్లను పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్)తో కలిపి డిసెంబర్ 2న విచారించడానికి సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది.

11/30/2016 - 00:59

న్యూఢిల్లీ, నవంబర్ 29: నగదుకు కొరత లేదని ఆర్‌బిఐ హామీల మీద హామీలు గుప్పిస్తున్నా, బ్యాంకుల ముందు పెద్ద క్యూలు, నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తున్న ఏటిఎంలు వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి. దేశంలో పెద్ద నోట్లు రద్దయ 21 రోజులైనా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు.

11/30/2016 - 00:55

న్యూఢిల్లీ, నవంబర్ 29: ప్రధాని నరేంద్ర మోదీ సభకు వచ్చి చర్చలో పాల్గొనాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష పట్టుబట్టింది. విపక్ష సభ్యులు పోడియం వద్ద ఇచ్చిన నినాదాలతో రాజ్యసభ మారుమోగింది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, ఉపాధ్యక్షుడు పిజె కురియన్ సభను అదుపు చేసేందుకు అనేకసార్లు విఫలమయ్యారు. కురియన్ పలుమార్లు ప్రతిపక్ష సభ్యులను పేరుపేరునా హెచ్చరించారు.

11/30/2016 - 00:50

రావల్పిండి, నవంబర్ 29: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా జనరల్ కమర్ జావేద్ బాజ్వా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులను త్వరలోనే మెరుగుపరుస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలోని ఆర్మీ హాకీ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో రహీల్ షరీఫ్‌నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు.

11/30/2016 - 00:50

న్యూఢిల్లీ, నవంబర్ 29: దేశంలో ప్రజలు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నారని, అవినీతి, దుష్పరిపాలనలను సహించటం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయాలే ఇందుకు తార్కాణమని ఆయన అన్నారు. మంగళవారం ఇందుకు సంబంధించి ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు చేశారు.

11/30/2016 - 00:49

న్యూఢిల్లీ, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దు నిర్ణయం అమలులోకి వచ్చిన నాటినుంచి కాకుండా అంతకు ముందునుంచే బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేల బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నవంబర్ 8కి (8/11) ముందు వీరందరి బ్యాంకు ఖాతాల లావాదేవీలను బహిర్గతం చేస్తే ప్రధాని మోదీ చెబుతున్న పారదర్శకతకు అర్థం వుంటుందని కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ డిమాండ్ చేశారు.

11/30/2016 - 02:02

ముంబయి, నవంబర్ 29: లింగ వివక్షపై మహిళలు సాధించిన విజయానికి ప్రతీకగా దాదాపు అయిదేళ్ల తరువాత ముంబయిలోని ప్రతిష్ఠాత్మక హాజీ అలీ దర్గాలోకి మహిళలు మంగళవారం ప్రవేశించారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సహ వ్యవస్థాపకురాలు నూర్జహాన్ ఎస్ నియాజ్ నేతృత్వంలో సుమారు 80మంది మహిళలు వర్లీలో ఉన్న ఈ దర్గాలోకి మధ్యాహ్నం 3గంటలకు ప్రవేశించి ప్రార్థనలు జరిపారు.

Pages