S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/10/2016 - 02:43

ముంబయ, నవంబర్ 9: దేశవ్యాప్తంగా 500 రూపాయిలు, వెయ్యినోట్లను రద్దు చేసినా, వాటి విలువ ప్రకారం బ్యాంకుల్లో మార్పిడి చేయడం జరుగుతుందని ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికానక్కర్లేదని, పాత నోట్ల స్థానే, కొత్త నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో జారీ చేస్తారని ఆర్‌బిఐ పేర్కొంది.

11/10/2016 - 02:36

షిర్డీ, నవంబర్ 9: ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్టీలో 500 నోట్లు, 1000 నోట్లను ఆలయ సిబ్బంది తీసుకునేందుకు నిరాకరించడంతో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. శ్రీ షిర్డీ సాయిబాబా ట్రస్ట్ స్వయంగా నడిపిస్తున్న భక్తినివాస్‌లో నిర్వాహకులు పెద్దనోట్లను తీసుకోవడంలేదని లూధియానాకు చెందిన రామవిజ్ వాపోయారు. తనవద్ద వందనోట్లు లేవని, దాంతో ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు.

11/10/2016 - 02:17

న్యూఢిల్లీ, నవంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మెడికల్ కమిషనర్‌ను నియమించాలని అఖిల భారత పంచాయితీ రాజ్ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు ఇఎస్‌ఐ డైరెక్టర్ జనరల్‌కు విజ్ఞప్తి చేశారు. వీరాంజనేయులు బుధవారం ఇఎస్‌ఐ డిజిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మెడికల్ కమిషనర్‌ను నియమించలేదని ఆయన తెలిపారు.

11/10/2016 - 02:07

న్యూఢిల్లీ, నవంబర్ 9: ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా రద్దు చేయటంతో ఇరకాటంలో పడిపోయిన ప్రతిపక్షాలు తమ ఆగ్రహం, అక్కసును వెళ్లగక్కటం ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికల వేళ నోట్లను రద్దు చేయటంతో ఈ రాష్ట్రాల్లో పోటీచేస్తున్న పార్టీలకు ఎన్నికల ప్రచారానికి డబ్బు కరువై పోయిందని అంటున్నారు.

11/10/2016 - 01:56

న్యూఢిల్లీ, నవంబర్ 9: అవినీతి రహిత భారత దేశాన్ని సృష్టించడం కోసం 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో తన నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలియజేసిన ప్రముఖులకు ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.

11/10/2016 - 01:52

న్యూఢిల్లీ, నవంబర్ 9: రానున్న 50రోజుల కాలంలో రెండున్నర లక్షలకు మించి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే..ఈ మొత్తానికి డిపాజిటర్ ఆదాయానికి పొంతన లేకపోతే పన్ను, 200శాతం జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత స్పష్టం చేసింది.

11/09/2016 - 08:46

న్యూఢిల్లీ, నవంబర్ 8: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అంశాలనైనా ఎదుర్కోవడానికి సైనిక దళాల సంసిద్ధత గురించీ వివరాలు తెలుసుకున్నారు. పాక్ సైన్యం గత రెండు నెలల నుంచి తెరిపి లేకుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో సైనిక దళాల సంసిద్ధతపై త్రివిధ దళాధిపతులతో మోదీ చర్చించటం గమనార్హం.

11/09/2016 - 08:44

అహ్మదాబాద్, నవంబర్ 8: భారతీయులంతా మాతృభాషను ప్రోత్సహించాలని, తమ పిల్లలకు మాతృభాషను అలవాటు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల్లో ఆంగ్లభాష వ్యామోహం పెరిగిపోవడంతపై మంగళవారం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.‘మన పిల్లలందరికీ మాతృ భాష నేర్పాలి. హిందీ, తమిళ్, మలయాళీ, అస్సామీ, పంజాబీ, భోజ్‌పురి ఏ ప్రాంతం వారిమైనా మాతృ భాషను పిల్లలకు బోధించాలి.

11/09/2016 - 08:41

జమ్మూ, నవంబర్ 8: కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని భారత సైనిక స్థావరాలపైన, పౌర నివాస ప్రాంతాలపైన తరచూ కాల్పులు జరుపుతున్న పాక్ సైన్యానికి భారత్ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. మంగళవారం ఉదయం జమ్మూ, కాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లోనియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపైన, నివాస ప్రాంతాలపై పెద్ద ఎత్తున మోర్టార్‌లతో గుళ్ల వర్షం కురిపించింది.

11/09/2016 - 08:39

న్యూఢిల్లీ, నవంబర్ 8: లంచం తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి పిల్లలు తెలుసువడానికి వీలుగా పాఠ్య పుస్తకాల్లో లంచానికి వ్యతిరేకంగా ఉండే పాఠ్యాంశాలను చేర్చాలని కేంద్ర నిఘా కమిషన్ (సివిసి) సివిసి) కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను కోరింది.

Pages