S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/13/2016 - 08:09

న్యూఢిల్లీ, నవంబర్ 12: పెద్ద నోట్ల రద్దు ‘పెద్ద కుంభకోణం’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడానికి ముందే ఈ విషయాన్ని బిజెపి తన మిత్రులందరికీ తెలియజేసిందని ఆయన ఆరోపిస్తూ, పెద్ద నోట్ల రద్దును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

11/13/2016 - 07:57

న్యూఢిల్లీ/ అహ్మదాబాద్/ ముంబయి, నవంబర్ 12: కేంద్రం అకస్మాత్తుగా పెద్ద నోట్ల చలామణిని రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల శాఖల వద్ద మూడో రోజు శనివారం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలైన్లలో నిలబడి తమ వద్ద ఉన్న పాత రూ.500, 1000 నోట్లను మార్చుకోవడానికి లేదా వాటిని తమ ఖాతాల్లో జమ చేసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు.

11/13/2016 - 07:56

ముంబయి, నవంబర్ 12: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముంబయి శివారు గోవండీ ప్రాంతంలో ఓ దంపతులకు పుత్ర శోకాన్ని మిగిల్చింది. పాత 500 రూపాయల నోట్లను తీసుకోవడానికి ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు చెందిన డాక్టర్ నిరాకరించడంతో వారికి అప్పుడే పుట్టిన మగబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.

11/13/2016 - 06:30

చెన్నై, నవంబర్ 12: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి శనివారం ప్రకటించారు. జయ ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగైందని ఆయన స్పష్టం చేశారు. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు డిశ్చార్జ్ కావొచ్చని ఆయన తెలిపారు. ‘తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదుటపడింది. డిశ్చార్జ్ ఎప్పుడన్నది ఆమె చేతుల్లోనే ఉంది.

11/13/2016 - 06:30

లక్నో, నవంబర్ 12: ఉగ్రవాదం వల్ల ప్రపంచానికి ఎదురయిన పెను ముప్పును ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సంఘటితం కావాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంఅద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదాన్ని అదుపు చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని శనివారం ఇక్కడ ‘్భజ్‌పురి అధ్యాన్ శోధ్ సంస్థాన్’ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

11/13/2016 - 06:29

మైసూరు, నవంబర్ 12: అక్రమార్కుల భరతం పట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా 2000 రూపాయల నోటును తీసుకు వస్తున్నట్లు ఆయన అ నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో వెల్లడించారు కూడా. అయితే మోదీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా తతంగమే నడిచింది. అరు నెలలుగా కఠోర శ్రమ, అంతకు మించి ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం..

11/13/2016 - 05:34

చిక్‌మగళూరు/ న్యూఢిల్లీ, నవంబర్ 12: మార్కెట్‌లోకి కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000 నోటు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రానే లేదు.. అసలు నోటు కంటే ముందు నకిలీ నోటు మార్కెట్‌లోకి వచ్చేసింది. ఏ నల్లధనాన్నైతే అరికడతామని, ఏ నకిలీ కరెన్సీనైతే నిలిపేస్తామని మోదీ సర్కారు రాత్రికి రాత్రి విప్లవాత్మకచర్య తీసుకుందో.. ఆ చర్యకు తూట్లు పడ్డాయి.

11/13/2016 - 04:37

నల్లకుబేరులను వదిలిపెట్టేది లేదు..
మరిన్ని చర్యలుండబోవన్న గ్యారంటీ లేదు
ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు
వారికి సెల్యూట్ చేస్తున్నా: మోదీ

11/13/2016 - 04:34

ఎటిఎం ఇబ్బందులు తొలగిపోతాయ
రెండు వారాల్లో రీకాలిబ్రేషన్ పూర్తి
రూ. 2 లక్షల కోట్లకు పైగా డిపాజిట్
పాత నోట్ల మార్పిడికి తొందర వద్దు
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణ

11/13/2016 - 08:20

కొరత ఏర్పడిందన్న వదంతులు
ఒక్కరోజులో 40% పెరిగిన ధర
హైదరాబాద్ పాతబస్తీలో కిలో రూ. 300కు అమ్మకం
ఏపీలోనూ ధరలకు రెక్కలు
హోల్‌సేల్ దుకాణాల వద్ద క్యూలైన్లు.. క్షణాల్లో స్టాక్ ఖాళీ

Pages