S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/14/2016 - 03:10

కన్నౌజ్ (యుపి), నవంబర్ 13: పెద్దనోట్ల రద్దువల్ల ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ప్రతిపక్ష బిఎస్‌పి అభినేత్రి మాయావతికి నిద్రే కరవయిందని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. వేలాదికోట్ల రూపాయల మేర నల్లధనం చెల్లని కాగితాల్లా మారడంతో ఈ ఇద్దరి నేతల ముఖాల్లో కళ తగ్గిందని అమిత్ షా అన్నారు.

11/14/2016 - 02:47

న్యూఢిల్లీ, నవంబర్ 13: జపాన్‌తో ఇటీవల కుదుర్చుకున్న చరిత్రాత్మక పౌర అణు ఒప్పందంలోని ‘రద్దు’ నిబంధన భారత్‌కు శిరోధార్యం ఏమీ కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే జపాన్ తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలో భాగంగా ఈ నిబంధనను పొందుపరచడం జరిగిందని అధికార వర్గాలు ఇక్కడ తెలిపాయి.

11/14/2016 - 02:46

చిత్రం.. ఆదివారం పుణెలోని వసంత దాదా సుగర్ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించి, అక్కడ ఉపయోగించే బ్యాటరీ కారులో పరిసరాలను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

11/14/2016 - 02:42

రాయపూర్, నవంబర్ 13: పెద్దనోట్ల రద్దుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నక్సల్స్ కార్యకలాపాలపైనా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. చత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలయిన బస్తర్‌లాంటి చోట్ల దాచి ఉంచిన వందలాది కోట్ల రూపాయల నగదును ఎలా మార్చుకోవాలో అర్థంకాక నక్సల్స్ ఇబ్బంది పడుతున్నారని పోలీసులు అంటున్నారు.

11/14/2016 - 02:40

లతిహార్ (జార్ఖండ్), నవంబర్ 13: సౌర విద్యుత్‌తో పనిచేసే సరికొత్త సెల్ టవర్ల ఏర్పాటుతో జార్ఖండ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల స్వరూపం మారిపోతోంది. నక్సలైట్ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు భద్రతా బలగాలకు, స్థానిక గిరిజనులకు సాధికారత చేకూర్చేందుకు ఈ టవర్లు దోహదపడుతున్నాయి.

11/14/2016 - 01:50

భద్రాచలం, నవంబర్ 13: చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని మావోయిస్టులు ఆదివారం అతని స్వగ్రామంలో కిడ్నాప్ చేశారు. జిల్లా పరిధిలోని కామ్‌కానార్ గ్రామానికి వచ్చిన విద్యార్థి సంతోష్ బొడ్డే వారపు సంతకు వెళ్లగా అక్కడి నుంచి నక్సల్స్ అపహరించుకు పోయారు. కిడ్నాప్‌నకు కారణాలు తెలియరాలేదు.

11/14/2016 - 01:05

పనాజీ/ బెలగావి, నవంబర్ 13: పెద్ద నోట్లను రద్దు చేయడంపై చెలరేగుతున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇటు చిత్తశుద్ధి అటు ఆత్మ విశ్వాసం మేళవించిన ఉద్వేగ స్వరంతో తిప్పికొట్టారు. తాను తీసుకున్న నిర్ణయం తప్పని తేలితే తనను బహిరంగంగా ఉరితీయాలని సవాలు విసిరారు. 5వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ రద్దు బాధాకరమే అయినా ఉజ్వల భవితవ్యానికి ఉద్దేశించిందేనని ఉద్ఘాటించారు.

11/14/2016 - 01:08

న్యూఢిల్లీ, నవంబర్ 13 : పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా నెలకొన్న నగదు కొరతను తీర్చే చర్యల్ని కేంద్రం చేపట్టింది. ఇప్పటి వరకూ అమలులో ఉన్న ఆంక్షల్ని సడలించింది. బ్యాంకు కౌంటర్లు, ఎటిఎమ్‌ల నుంచి తీసుకునే నగదు పరిమితిని, పాత నోట్లు మార్చుకునే పరిమితిని ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పెంచింది. అత్యవసరంగా 500కొత్త కరెన్సీనీ అందుబాటులోకి తెచ్చింది.

11/13/2016 - 08:10

న్యూఢిల్లీ/ కోల్‌కతా, లక్నో/ తిరువనంతపురం/ ముంబయి, నవంబర్ 12: ప్రధాని నరేంద్ర మోదీ నల్ల ధనాన్ని నియంత్రించడానికి పెద్దనోట్ల చలామణిని రద్దు చేయలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆడిన జిమ్మిక్కే ఈ చర్య అని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

11/13/2016 - 08:08

న్యూఢిల్లీ, నవంబర్ 12: పెద్ద నోట్ల రద్దు వెనక పెద్ద కుట్ర, కుంభకోణం ఉందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను జైట్లీ ఖండించారు. కొందరు రాజకీయ నాయకులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు తమ డబ్బు తాము తీసుకునేందుకు క్యూలో నిలబడివలసిన అవసరం ఏమిటంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రశ్నను తిప్పికొట్టారు.

Pages