S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/09/2016 - 08:39

న్యూఢిల్లీ, నవంబర్ 8: గూఢచర్యానికి పాల్పడుతున్నారని పాక్ ఆరోపించడమే కాకుండా వారి పేర్లను సైతం బహిర్గతం చేయడంతో భారత్ ఇస్లామాబాద్‌లోని తన హైమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గు రు దౌత్య ధికారులను మంగళవారం వెనక్కి పిలిచింది. వాణిజ్య వ్యవహారాల ఫస్ట్ సెక్రటరీ అనురాగ్ సింగ్ ఈ ముగ్గురిలో ఒకరు. గత వారం పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రతినిధి నఫీస్ జకరియా ఈ ముగ్గురి పేర్లను వెల్లడించారు.

11/09/2016 - 08:38

ఇస్లామాబాద్, నవంబర్ 8: సరిహద్దుల్లో భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిందని ఆరోపిస్తున్న పాకిస్తాన్ దీనిపై వివరణ కోరేందుకు మంగళవారం భారత డిప్యూటీ హైకమిషనర్‌ను తన విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించింది. అయితే పాకిస్తాన్ సైన్యాలే అధీన రేఖ వెంబడి ఎలాంటి కవ్వింపూ లేండానే కాల్పులు పాల్పడుతోందని, ఫలితంగా భారత సైనికులతో సహా పలువురు పౌరులు మృతి చెందారని భారత డిప్యూటీ కమిషనర్ ప్రత్యారోపణ చేశారు.

11/09/2016 - 08:38

బెంగళూరు, నవంబర్ 8: కర్నాటకలోని తిప్పగొండనహల్లి రిజర్వాయర్‌లో మునిగిపోయిన సినీనటులు అనిల్, ఉదయ్ ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. ఈ ఘటనకు సంబంధించి ఆ సినిమా నిర్మాత, డైరెక్టర్, స్టంట్ డైరెక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ‘మస్తిగుడి’ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని బెంగళూరు నీటి సరఫరా, సివరేజ్ బోర్డు అధికారులు ఆరోపించారు.

11/09/2016 - 08:36

చెన్నై, నవంబర్ 8: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగైంది. అమ్మ అపోలో ఆసుపత్రి నుంచి వారం పది రోజుల్లో డిశ్చార్జి అవుతారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సి పొన్నియన్ మంగళవారం వెల్లడించారు.‘జయకు ఫిజియోథెరపీ జరుగుతోంది. ఆమె చక్కగా స్పందిస్తున్నారు. రెండు వారాల్లోపే అమ్మ డిశ్చార్జి అవుతుంది’అని ఆయన చెప్పారు. జయలలితకు వెంటిలేటర్ తొలగించినా శ్వాస తీసుకోగలుగుతున్నానని తెలిపారు.

11/09/2016 - 07:24

న్యూఢిల్లీ,నవంబర్ 8: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారం రాష్ట్ర స్థాయి పర్యావరణ సంస్థకు లేదని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తరఫు న్యాయవాది రిత్విక్ దత్తా వాదించారు. అమరావతిపై మంగళవారం ఎన్‌జిటిలో విచారణ కొనసాగింది.

11/09/2016 - 07:10

న్యూఢిల్లీ, నవంబర్ 8: రద్దు చేసిన నోట్ల స్థానంలో మార్కెట్‌లోకి రానున్న రూ.2000 నోటు పని చేసే విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నోట్‌పై నానో టెక్నాలజీతో రూపొందించిన జిపిఎస్ అమరిక ఉంటుంది. దీనికి బ్యాటరీ, విద్యుత్ అవసరం లేకుండానే పని చేస్తుంది. ఇది కేవలం సిగ్నల్ రిఫ్లెక్టర్‌గానే ఉపయోగపడుతుంది. ఉపగ్రహం నుంచి వచ్చే సంకేతాలకు ఇది ప్రతిస్పందిస్తుంది.

11/09/2016 - 07:08

పాతవి ఇక చిత్తు కాగితాలే రేపట్నుంచే కొత్త నోట్లు

11/09/2016 - 07:07

మీరు ఏమి చేయాలంటే..

ఎలాంటి పరిమితి లేకుండా 500, 1000 కరెన్సీ నోట్లను బ్యాంకులు లేదా పోస్ట్ఫాసుల్లో 10 నవంబర్ నుంచి 30 డిసెంబర్ 2016 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే విత్‌డ్రావెల్స్‌కు సంబంధించి రోజుకు పదివేలు, వారంలో 20వేల వరకు పరిమితి వర్తిస్తుంది. రానున్న రోజుల్లో ఈ పరిమితి క్రమంగా పెరుగుతుంది.

11/09/2016 - 06:59

పెద్ద నోట్ల చలామణీకి మంగళం

పెద్ద నోట్ల రద్దు.. దేశ హితానికి కొత్త పొద్దు
ఉగ్రవాదం, అవినీతికి ఇక చరమగీతం
దేశ చరిత్రలో ఇదో చారిత్రక పరిణామం
అందరి సహకారంతోనే భారత్‌కు అగ్రస్థానం
ఇదో మహాయజ్ఞం.. ప్రజా మద్దతుతోనే విజయం
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

11/09/2016 - 06:57

పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ‘ఇదో సాహసోపేతమైన నిర్ణయం’ అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు విషయమై మోదీ రాష్టప్రతిని మంగళవారం సాయంత్రం కలిసి వివరించారు. దీనివల్ల లెక్కలోకి రాని ఆదాయం తేలడంతోపాటు నకిలీ నోట్లను నియంత్రించగలుగుతామని రాష్టప్రతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Pages