S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/13/2016 - 12:39

న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి ఇవాళ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఇవాళ ఆయన సుష్మాను కలుసుకుని ఇరు దేశాల ధ్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, అంతకు ముందు వాంగ్ యి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కాగా, వాంగ్ యి మూడు రోజుల పర్యటన కోసం మన దేశానికి విచ్చేశారు.

08/13/2016 - 04:59

న్యూఢిల్లీ, ఆగస్టు 12: స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ‘తిరంగా యాత్ర’ పేరిట పెద్ద ఎత్తున స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర మంత్రులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ యోధుల జన్మస్థలాలను. సరిహద్దు ఔట్‌పోస్టులను సందర్శించనున్నారు.

08/13/2016 - 04:56

న్యూఢిల్లీ, ఆగస్టు 12: కాశ్మీర్ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటామని, అక్కడ శాంతి నెలకొల్పడంలో కృషిచేస్తామని శుక్రవారం పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇటీవల అలర్లలో జరిగిన ప్రాణనష్టం పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్ర ప్రజల్లో నమ్మకాన్ని, ధీమాని కలిగించే విధంగా శాంతియుత పరిస్థితులు పాదుగొల్పడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ తీర్మానంలో పిలుపునిచ్చింది.

08/13/2016 - 04:53

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశంలో పన్నుల వ్యవస్థను సమూలంగా మార్చివేసిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుతోపాటు పలు ముఖ్యమైన బిల్లులను ఆమోదించిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. జూలై 18న ప్రారంభమై మొత్తం ఇరవై రోజులపాటు కొనసాగిన పార్లమెంటు సమావేశాలు చాలా సంవత్సరాల తరువాత ప్రశాంతంగా జరిగాయి.

08/13/2016 - 03:49

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశ భద్రత, సమగ్రత విషయంలో ఎవ్వరితో ఎలాంటి రాజీ పడేది లేదని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం జమ్ముకాశ్మీర్‌లో అంతర్భాగమేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆక్రమిత కాశ్మీర్ ప్రజలతో చర్చలు జరుపుతామని శుక్రవారం ఇక్కడ జరిగిన అఖిల పక్ష సమావేశంలో స్పష్టం చేశారు.

08/13/2016 - 03:02

న్యూఢిల్లీ, ఆగస్టు 12: హైకోర్టు ప్రదాన న్యాయమూర్తుల, న్యాయమూర్తుల బదిలీలు నియామకాలపై కొలీజియం నిర్ణయాలను అమలు చేయడంలో జాప్యం పట్ల సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రంపై తీవ్రంగా మండిపడింది. దీనివల్ల న్యాయ వ్యవస్థ కుప్పకూలిపోతోందని సుప్రీంకోర్టు అంటూ, ఈ జాప్యాన్ని ఎంతమాత్రం సహించబోమని, ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడం కోసం జోక్యం చేసుకుంటామని హెచ్చరించింది.

08/12/2016 - 18:00

దిల్లీ: దిల్లీలో డీజిల్‌ కార్లు, ఎస్‌యూవీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే, హరిత పన్ను కింద వాహనాల రిటైల్‌ ధరలపై ఒక శాతం అదనపు సుంకాన్ని విధించనున్నట్లు తెలిపింది.2000 సీసీ అంతకంటే ఎక్కువ కెపాసిటీ కల్గిన డీజిల్‌ వాహనాలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

08/12/2016 - 16:50

లక్నో: తన తల్లిని చంపినవారి అంతు చూడాలని 9వ తరగతి చదువుతున్న లితికా బన్సల్ అనే 15 ఏళ్ల బాలిక యూపీ సిఎం అఖిలేష్ యాదవ్‌కు రక్తంతో లేఖ రాసింది. జూన్ 14న బులంద్‌షహర్‌లో లితికా తల్లి అనూ బన్సల్‌ను సజీవదహనం చేశారు. తల్లిని చంపవద్దని తనతో పాటు తన 11ఏళ్ల సోదరి తన్యా ఎంత బతిమిలాడినా వినకుండా చంపేశారని రాసింది. అబ్బాయిలకు జన్మనివ్వలేదని ఆరోపిస్తూ తన బాబాయిలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వెల్లడించింది.

08/12/2016 - 16:47

మా టీవీ, మాగోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్ లైసెన్స్‌లను రద్దు చేశారు. మా టీవీ నెట్‌వర్క్ లైసెన్స్ రెన్యూవల్స్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నిరాకరించింది. తాజాగా రెన్యువల్ చేసిన లైసెన్స్‌‌ల జాబితా నుంచి మా టీవీ నాలుగు చానెల్స్‌ను కేంద్రం తొలగించింది. మా సంస్థ డైరెక్టర్‌పై ఉన్న ఆర్థిక నేరాల అభియోగాల కారణంతో క్లియరెన్స్‌ను హోంశాఖ సెక్యూరిటీ నిరాకరించింది.

08/12/2016 - 16:27

ముంబయి: దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 293 పాయింట్లు లాభపడి 28,152 వద్ద ముగిసింది. నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 8,672 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.87 వద్ద కొనసాగుతోంది.

Pages