S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/11/2016 - 07:54

చెన్నై, ఆగస్టు 10: సేలం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం సినీ ఫక్కీలో జరిగిన రైలు దోపిడీ వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. 5.8 కోట్ల రూపాయల దోపిడీ వెనుక బ్యాంకు, రైల్వే సిబ్బంది హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వ్యాగన్‌లో పాత కరెన్సీని ఆర్‌బిఐ తరలిస్తున్న సమయంలో ఈ దోపిడీ జరిగింది. ఇందుకు సంబంధించి బుధవారం రైల్వే అధికారులు కీలక వివరాలు సేకరించారు.

08/11/2016 - 07:54

న్యూఢిల్లీ, ఆగస్టు 10: జమ్మూ, కాశ్మీర్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆజ్యం పోస్తోందని జాతీయ భద్రతా ఏజన్సీ (ఎన్‌ఐఏ) ఆరోపించింది. కాశ్మీర్‌లోయలో గత 33 రోజులుగా కొనసాగుతున్న హింసాకాండలో లష్కరే తోయిబా పాత్రకు సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నామని కూడా ఏజన్సీ తెలిపింది.

08/11/2016 - 07:53

ఇంఫాల్, ఆగస్టు 10: పదహారేళ్లగా కొనసాగిస్తున్న దీక్ష విరమించిన మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (జెఎన్‌ఐఎంఎస్) నిపుణుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలంపాటు నాసికద్వార ద్రవరూపంలోనే ఆహారం తీసుకున్న షర్మిల ఇప్పటికిప్పుడు ఘన ఆహారం ఇవ్వడం కుదరదు.

08/11/2016 - 08:13

అలహాబాద్, ఆగస్టు 10: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై గురువారం నాటికి నివేదిక అందించాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డిబి భోసలే, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం తల్లీ, కూతుళ్లపై జరిగిన గ్యాంగ్‌రేప్ కేసును సమోటోగా స్వీకరించింది. బుధవారం కేసు దర్యాప్తు వివరాలు తమకు అందించాలని తొలుత బెంచ్ ఆదేశించింది.

08/11/2016 - 07:52

న్యూఢిల్లీ, ఆగస్టు 10: లైంగిక వేధింపుల కేసుల విచారణ జరిగే సమయంలో బాధిత ఉద్యోగినులు మూడు నెలల సెలవు తీసుకోవచ్చునని కేంద్రమంత్రి జితేందర్‌సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల వివరాలను కేంద్రం నమోదు చేయడం లేదని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

08/11/2016 - 07:51

న్యూఢిల్లీ, ఆగస్టు 10: గత రెండేళ్ల కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ కార్యక్రమం (జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం), రాజీవ్ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస యోజన-అర్బన్‌లాంటి పథకాల కింద రెండు లక్షలకు పైగా గృహాలు నిర్మించినట్లు ప్రభుత్వం బుధవారం లోక్‌సభకు తెలియజేసింది.

08/11/2016 - 07:51

న్యూఢిల్లీ, ఆగస్టు 10: స్వతంత్ర భారతదేశంలో గంగానదిని కాలుష్యమయం చేసినందుకు నిర్వహిస్తున్న ప్రాయశ్చిత్తమే ‘నమామి గంగే’ (నమామి గంగా యోజన) అని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి అన్నారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గంగానని పరివాహక ప్రాంతంలోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలంతా సహకరించాలని ఆమె కోరారు.

08/11/2016 - 07:51

ఇస్లామాబాద్, ఆగస్టు 10: నియంత్రణ రేఖ వద్ద నుంచి కాశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను తాను ప్రోత్సహిస్తున్నట్లు భారత్ చేసిన ఆరోపణను పాకిస్తాన్ తోసిపుచ్చింది. నియంత్రణ రేఖ మీదుగా సీమాంతర చొరబాట్లను ప్రోత్సహిస్తున్నట్లు భారత్ చేసిన ఆరోపణను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంగళవారం రాత్రి పేర్కొంది.

08/11/2016 - 07:50

అలప్పుజా (కేరళ), ఆగస్టు 10: కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ప్రయాణిస్తున్న కారు ఢీకొని 65 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. కేరళలో ఒక కార్యక్రమంలో పాల్గొనందుకు ఈ యువనేత ఢిల్లీ నుంచి కొచ్చి చేరుకుని అక్కడనుంచి కారులో వెళుతుండగా ద్వితీయ వాహనంపై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని ఢీకొనడంతో ఆ వ్యక్తి మృతిచెందాడు.

08/11/2016 - 07:14

కూడంకుళం (తమిళనాడు), ఆగస్టు 10: ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన అణు విద్యుత్ కేంద్రాలలో కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలితతో కలిసి ఆయన కూడంకుళంలోని వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల అణు విద్యుత్ ప్లాంటు-1ను బుధవారం జాతికి అంకితం చేశారు.

Pages