S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/05/2016 - 12:17

చెన్నై: తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలను ఒకప్పుడు గడగడలాడించిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ బతికి ఉన్నపుడు ఆయన తరచూ పూజించే ఆలయానికి అధికారులు ఇపుడు తాళాలు వేశారు. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని మారియమ్మన్ ఆలయంలో అమ్మవారిని పూజించి ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించడం వీరప్పన్‌కు అలవాటు. అతని కారణంగా ఆ ఆలయం రెండు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది. గత మంగళవారం ఆ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు.

08/05/2016 - 12:15

ముంబయి: పురాతన వంతెన కూలిపోయి రెండు బస్సులు సహా పలు వాహనాలు సావిత్రి నదిలో పడిపోయిన రెండు రోజులకు 14 మృతదేహాలు లభించాయి. గల్లంతైన వారి కోసం నదిలో ఇంకా గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. ముంబయి- గోవా రహదారిపై మహద్ వద్ద సావిత్రి నదిపై పురాతన వంతెన కూలిపోగా పలు వాహనాలు కొట్టుకుపోయి దాదాపు 50 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు.

08/05/2016 - 12:15

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న ఎపి సిఎం చంద్రబాబు ఈరోజు ఉదయం కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, ప్రకాష్ జవదేకర్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌లను కలిశారు. కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా వారిని ఆయన ఆహ్వానించారు. కాసేపట్లో ప్రధాని మోదీని చంద్రబాబు కలిసి పుష్కరాలకు ఆహ్వానిస్తారు.

08/05/2016 - 11:49

ముంబై : శుక్రవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.86 పైసలుగా ఉంది. సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా, నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది.

08/05/2016 - 05:58

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో ఓటింగ్ జరగకుండా చూసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. సవరణ బిల్లు మనీ బిల్ కావటం వలన దీనిపై రాజ్యసభలో చర్చ జరిపేందుకు వీలు లేదని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ గత వారం చెప్పటం తెలిసిందే.

08/05/2016 - 05:05

రాజవొమ్మంగి, ఆగస్టు 4: గల్లంతైన వాయుసేవ విమానం కోసం తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో గురువారం కూడా హెలీకాప్టర్ల సహాయంతో గాలింపు చేపట్టారు. గత నెల 22న చెన్నై నుండి ఎఎన్ 32 అనే విమానం గల్లంతైన విషయం విదితమే. దాని జాడ నేటివరకు తెలియకపోవడంతో పలుమార్లు వాయుసేన, నేవీ అధికారులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.

08/05/2016 - 03:56

హైదరాబాద్, ఆగస్టు 4: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వౌలానా అబుల్‌కలాం అజాద్ సుజల స్రవంతి స్కీం పేరు మార్చి మిషన్ భగీరథ పేరును పెట్టారని, ఈ స్కీంను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. మిషన్ భగీరథ ప్రారంభానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దూరంగా ఉండాలని టిపిసిసి సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, టి జగ్గారెడ్డి, మల్లు రవి ప్రధానిని కోరారు.

08/05/2016 - 03:55

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలపై చర్చించారు. తెలుగు దేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, లోక్‌సభలో పార్టీ పక్షం నాయకుడు తోట నరసింహం, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

08/05/2016 - 03:08

న్యూఢిల్లీ,ఆగస్టు 4: కాళేశ్వరం, మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితుల సమస్యలు వివరించేందుకు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ది పథకాలను ప్రారంభించేందకు నరేంద్ర మోదీ తెలంగాణకు వెళుతున్న విషయం తెలిసిందే.

08/05/2016 - 03:27

న్యూఢిల్లీ, ఆగస్టు 4: అత్యంత వివాదాస్పదంగా మారిన రాష్ట్ర హైకోర్టు విభజన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందా? చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఠాకూర్‌ను కలిసి కృష్టా పుష్కరాల ఆహ్వానం అందజేసినప్పుడు హైకోర్టు విభజన అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది.

Pages