S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/05/2016 - 17:13

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి మంచి జోరు మీదున్న మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 66.78 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 369 పాయింట్లు లాభపడి 28078 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 132 పాయింట్లు లాభపడి 8683 పాయింట్లకు చేరుకుంది.

08/05/2016 - 16:40

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆర్థిక బిల్లు అని లోక్‌సభ కార్యదర్శి స్పష్టం చేశారని, ద్రవ్యబిల్లుపై ఓటింగ్ జరిపే సంప్రదాయం రాజ్యసభలో లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం స్పష్టం చేశారు. కొన్ని అంశాలపై రాజ్యసభలో నేరుగా చట్టం చేసే అవకాశం లేదన్నారు.

08/05/2016 - 16:40

ఇంఫాల్: పదహారేళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను విరమించుకోవద్దని, బయటి వ్యక్తిని వివాహం చేసుకోవద్దని ‘మణిపూర్ ఉక్కుమహిళ’ షర్మిలకు కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులకు ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లుగా ఆమె దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

08/05/2016 - 16:39

గౌహతి: అస్సాంలోని కోక్రాఝార్‌లో శుక్రవారం ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతాదళాలు గాలింపుచర్యలను ప్రారంభించాయి. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

08/05/2016 - 16:37

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో అత్యాచార ఆరోపణలతో జైలుకెళ్లిన నిందితుడిని ఖైదీలు దాడి చేసి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. సుపేలా పోలీసుస్టేషన్‌ పరిధిలో అజయ్‌ దేవంగన్‌(34) అత్యాచార ఆరోపణలపై అరెస్టయ్యాడు. శుక్రవారం ఉదయం జైలు సిబ్బంది చూసేసరికి తనగదిలో చనిపోయి ఉన్నాడు. ఇద్దరు ఖైదీలు అతడిపై తీవ్రంగా కొట్టి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

08/05/2016 - 16:31

దిల్లీ: కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు శుక్రవారం రాజ్యసభలో ఛైర్మన్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

08/05/2016 - 16:16

ముంబైః శుక్రవారం ఉదయం నుంచీ ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైఃలో జన జీవనం స్తంభించిపోయింది. పలు రైళ్ళు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్ పోర్ట్ , రోడ్లు, రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఫీసులు, స్కూళ్ళకు వెళ్ళాల్సిన జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

08/05/2016 - 15:38

దిల్లీ: తాను ప్రధానిగా ఉన్నప్పుడు ఏపీకి ఇచ్చిన హామీలను ఇప్పటి ప్రభుత్వం నెరవేర్చి సభా గౌరవాన్ని కాపాడాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం డిమాండ్‌ చేశారు. తాను ఇచ్చిన హామీలపై 2014, మార్చి 1న అప్పటి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఆ ముసాయిదా ప్రతిని రాష్ట్రపతికి పంపగా ఎన్నికల షెడ్యూల్‌ ఉన్నందున ఆగిపోయిందన్నారు.

08/05/2016 - 15:13

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రైవేట్‌ బిల్లుపై చర్చ పూర్తయిందని, కోరం లేక ఓటింగ్‌ వాయిదా పడిందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ శుక్రవారం చెప్పారు. ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ఎప్పుడూ ద్రవ్య బిల్లు కాదని, ఈ విషయంలో బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి చట్టం అక్కర్లేదని అన్నారు. బిల్లుకు మద్దతిచ్చిన 11 పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.

08/05/2016 - 14:23

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ తనకు చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. ఈరోజు పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోదీని ఆయన కలిసి కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎపికి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రధాని వద్ద సిఎం ప్రస్తావించారు.

Pages