S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/27/2015 - 06:01

ఆర్‌ఎస్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయను * సుప్రీంకోర్టులో రాహుల్ స్పష్టీకరణ

11/27/2015 - 05:57

సామాజిక అశాంతికి అదే కారణం
42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చారు
ఈ ఆలోచన అంబేద్కర్‌కు ఎన్నడూ లేదు
అందరి హక్కులకూ పూర్తి రక్షణ
రాజ్యాంగంపై చర్చలో రాజ్‌నాథ్ ఉద్ఘాటన

11/27/2015 - 05:56

రాజ్యాంగ పరిషత్ చేపట్టిన రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియపై ప్రదర్శనను గురువారం
న్యూఢిల్లీలో ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు,
లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహజన్‌ను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు

11/26/2015 - 18:41

న్యూఢిల్లీ : ముంబయి 26/11 ఉగ్రవాద ఘటనలో చనిపోయిన వారికి సభ నివాళులర్పించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సభ్యులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నాటి ఘటనలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన భద్రత దళాల సాహసాన్ని, ధైర్యాన్ని గుర్తుచేశారు. వారిని మరోసారి ప్రశంసించారు. అలాగే ఇటీవల కన్నుమూసిన దాదాపు 13 మంది మాజీ పార్లమెంటు సభ్యులకు లోక్‌సభ నివాళులర్పించింది.

11/26/2015 - 18:32

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఎవర్నీ దూషించాల్సిన అవసరం లేదని, తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము విభజనను కోరలేదంటూ లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు చేసిన వ్యాఖ్యలపై జితేందర్ స్పందించారు.

11/26/2015 - 18:31

న్యూఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని తాము కోరలేదని... గత ప్రభుత్వం విభజించిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు.

11/26/2015 - 18:18

న్యూఢిల్లీ: షీనాబోరా హత్యకేసులో నిందితుడు స్టార్‌ఇండియా మాజీ సీఈవో పీటర్‌ముఖర్జియా సీబీఐ కస్టడీని కోర్టు నవంబర్ 30వరకు పొడిగించింది. షీనాబోరా హత్య కేసులో పీటర్‌ముఖర్జియాను ప్రశ్నించేందుకు కస్టడీని మరో 7రోజులు పొడిగించాలని సీబీఐ కోర్టును కోరింది.

11/26/2015 - 16:37

న్యూఢిల్లీ : రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని పార్లమెంట్‌ ఆవరణలో ఓ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌లు ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నరేంద్రమోదీ ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

11/26/2015 - 16:07

కోల్ కతా: భారత్ లో అసహన పరిస్థితులున్నాయంటూ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమర్థించారు. గురువారం ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక భారతీయుడిగా ఆయన ఎలా ఫీలయ్యారో అదే విషయాన్ని ఆమిర్ చెప్పారని అన్నారు. అసలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపొమ్మని చెప్పడానికి మీరెవరు అంటూ ఆయనను నిందించిన వారిని ప్రశ్నించారు.

11/26/2015 - 16:00

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ పార్టీ ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 2013లో ఆదర్శ్‌నగర్‌లో జరిగిన ఓ అల్లర్ల కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయనను జైలుకు తరలించారు.

Pages