S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/12/2016 - 04:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: జవహర్‌లాల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యకుమార్ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు మరోసారి చీవాట్లు పెట్టింది. గత ఫిబ్రవరి 17న కన్హయ్యను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంలో కొందరు వ్యక్తులు నల్ల బ్యాడ్జీలతో కోర్టు హాలులోకి కొందరు వ్యక్తులు ఎలా ప్రవేశించగలిగారని జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఏ ఎం సప్రేలతో కూడిన ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది.

04/12/2016 - 04:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: మహారాష్ట్ర కేబినెట్ కొత్త బార్ డాన్స్ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బార్‌లు, పబ్‌లలో డాన్స్‌లను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో చుక్కెదురు కావడంతో కొత్త బిల్లు తీసుకొచ్చారు. అయితే కొత్త బిల్లును ఈసారి పగడ్బందీగా రూపొందించారు.

04/12/2016 - 04:22

హైదరాబాద్, ఏప్రిల్ 11: శ్రీనగర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నుండి 120 మంది తెలుగు విద్యార్థులు వెనక్కు వస్తున్నారు. 15 రోజులుగా అట్టుడికిపోయిన నిట్ నుండి విద్యార్ధులు బయటకు వచ్చేందుకు కూడా యాజమాన్యం అంగీకరించకపోవడంతో విద్యార్ధులు క్యాంపస్‌లోనే భయం భయంగా గడుపుతున్నారు. అయితే విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు యాజమాన్యం ఆమోదం తెలిపింది.

04/12/2016 - 04:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ సంస్థలో అవకతవకలపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. ఇలాంటి అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆర్‌బిఐ వంటి ఏదైనా దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. వినోద్ కుమార్ అనే వ్యక్తి సుజనా గ్రూప్ సంస్థల్లో రూ.

04/12/2016 - 01:15

మహిళల నిషేధం సతీ, వరకట్న వేధింపుల కంటే దారుణం.
పిటిషనర్ వాదన
పురుష, మహిళా
క్రికెట్‌లో వేర్వేరు నిబంధనలున్నట్లే.. ఆలయాల్లోనూ ఉంటాయ.
శబరిమల పూజారి

04/11/2016 - 18:16

కోల్‌కత: అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు సోమవారం రెండోదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో విడతతో అస్సాంలో పోలింగ్ ప్రక్రియకు తెరపడింది. ఈ రాష్ట్రంలో 75 శాతం, బెంగాల్‌లో 70 శాతం మేరకు పోలింగ్ జరిగినట్లు అంచనా. ఒకటి, రెండు స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్‌లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

04/11/2016 - 18:15

గౌహతి: అస్సాంలోని తీన్‌సుకియా జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి కింద పడడంతో 11 మంది మరణించారు. మరో ఇరవైమంది గాయపడ్డారు. పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బుల్లెట్లు తగిలి విద్యుత్ తీగలు తెగి కిందకు పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని సమాచారం.

04/11/2016 - 18:15

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆలయాల్లో బాణసంచాను పూర్తిగా నిషేధించాలని ఆధ్మాత్మిక గురువు మాతా అమృతానందమయి ప్రభుత్వానికి సూచించారు. కేరళలోని పుట్టింగళ్ ఆలయంలో బాణసంచా పేలి 115 మంది మరణించడం దారుణమన్నారు. మనుషులు తమ సంతోషం కోసమే బాణసంచా కాలుస్తారని , దేవుడి ఆనందం కోసం కాదని ఆమె అన్నారు. దేవుడికి ఎలాంటి చెవుడు లేదు గనుక బాణసంచాను నిషేధించడం సరైన చర్య అని ఆమె వ్యాఖ్యానించారు.

04/11/2016 - 18:14

శ్రీనగర్: ఇక్కడి నిట్‌లో ఇంకా ఆందోళనకర వాతావరణం కొనసాగుతూనే ఉంది. సోమవారం జరిగిన వార్షిక పరీక్షలకు స్థానికేతర విద్యార్థులు హాజరు కాలేదు. తమపై దాడులు జరుగుతున్నా నిట్ అధికారులు స్పందించడం లేదని, తమను వేరే రాష్ట్రానికి పంపాలని స్థానిక విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దాడుల భయంతో ఇప్పటికే కొంతమంది స్థానికేతర విద్యార్థులు తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు.

04/11/2016 - 18:14

బాగ్‌పట్: కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఆ గ్రామంలోని వారంతా సామూహికంగా ప్రమాణం చేశారు. యుపిలోని బాగ్‌పట్ జిల్లా బావ్లి పంచాయతీలో ఈ మేరకు సోమవారం గ్రామస్థులంతా సమావేశమై వరకట్నాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో అమ్మాయిలెవరూ జీన్స్, బిగుతు దుస్తులు వేసుకోరాదని, ఆడపిల్లలు పుట్టకుండా భ్రూణహత్యలకు పాల్పడేవారిని గ్రామం నుంచి బహిష్కరిస్తామని పెద్దలు తీర్మానించారు.

Pages