S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/10/2016 - 05:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై శనివారం ఒక వ్యక్తి బూటు విసిరాడు, వాహనాలకు సరి-బేసి పథకం అమలుకు సంబంధించి సచివాలయంలో కేజ్రీవాల్ విలేఖరులతో మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి విడిపోయిన ఆమ్‌ఆద్మీ సేనకు చెందిన వేద ప్రకాశ్ అనే వ్యక్తి సిఎంపై బూటు విసిరాడు.

04/10/2016 - 05:21

అహ్మద్‌నగర్, ఏప్రిల్ 9: శని దేవునికి పూజలు చేయడానికి శనివారాన్ని పవిత్రమైన రోజుగా భావిస్తుంటారు. అందునా దేశంలోనే ప్రసిద్ధి గాంచిన మహారాష్టల్రోని సింగ్నాపూర్ గ్రామంలో గల శని దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని తొలగించిన తరువాత వచ్చిన మొదటి శనివారం కావడంతో అనేకమంది పురుషులు, మహిళలు ఉదయమే పూజలు చేయడానికి ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.

04/10/2016 - 05:17

శ్రీనగర్, ఏప్రిల్ 9: శ్రీనగర్‌లోని ‘నిట్’ను కాశ్మీర్‌నుంచి వేరే చోటికి మార్చాలన్న బయటి రాష్ట్రాల విద్యార్థుల డిమాండ్‌ను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు తోసిపుచ్చారు. అయితే వారి న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

04/10/2016 - 05:14

జమ్మూ, ఏప్రిల్ 9: దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో వేంచేసిన అమర్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న భక్తులు లక్ష దాటారు. జూలై 2 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. దీనికోసం అడ్వాన్స్ రిజిస్ట్రేషన్లు లక్ష దాటాయని అమర్‌నాథ్ ఆలయ సిఇవో వెల్లడించారు.

04/10/2016 - 05:14

గౌహతి/ కోల్‌కతా, ఏప్రిల్ 9: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ నెల 11న పోలింగ్ జరుగనున్న నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. అసోంలో ఈ రెండవ, చివరి విడతలో మిగిలిన 61 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 126 సీట్లున్న అసోం అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బిజెపి కూటమి గట్టిగా పోరాడుతోంది.

04/10/2016 - 05:13

ముంబయి, ఏప్రిల్ 9: మజ్లిస్ పార్టీ నాయకులైన ఒవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌పై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ థాకరే శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెడపై కత్తి పెట్టినప్పటికీ ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదం చేసే ప్రసక్తే లేదంటున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లకు దమ్ముంటే మహారాష్టక్రు వచ్చి ఆ ప్రకటన చేయాలని సవాలు విసిరారు.

04/10/2016 - 05:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ప్రధాని నరేంద్ర మోదీది అంతా కొత్త పోకడే. దేశంలో క్షణం విరామం లేకుండా పనులు చేస్తూ, సహచర మంత్రులను, అధికారులను పరుగులు పెట్టిస్తున్న ప్రధాని విదేశీ పర్యటనల్లోను ఇంతకుముందున్న ప్రధానులకు భిన్నంగా తనదైన ముద్ర వేస్తున్నారు. మోదీ తన పర్యటనల సమయాన్ని తగ్గించుకోవడానికి రాత్రి పూట ప్రయాణాలు చేస్తూ, విమానాల్లోనే నిద్రపోతూ సమయాన్ని అదా చేసుకుంటున్నారు.

04/10/2016 - 05:07

కోల్‌కతా, ఏప్రిల్ 9: ఐఐటి ఖరగ్‌పూర్ 2016లో అత్యధిక పేటెంట్లు సంపాదించిన విద్యాసంస్థగా భారత ప్రభుత్వ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖనుంచి తమకు ఒక లేఖ అందినట్లు ఐఐటి ఖరగ్‌పూర్ డైరెక్టర్ పార్థ ప్రతిమ్ చక్రబర్తి చెప్పారు. తమ ‘వంద పేటెంట్ల డ్రైవ్’ ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలనిస్తున్నాయని ఆయన అంటూ, ఈ అవార్డును సాధించేందుకు కృషి చేసిన సహచర బృందాన్ని అభినందించారు.

04/10/2016 - 04:46

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును హైదరాబాద్‌లో తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్‌ను కోరింది. ఈ మేరకు వారు ఒక వినతిపత్రం సమర్పించారు. తాత్కాలిక భవనాలు ఈ ఏడాది జూన్ 15 నాటికి సిద్ధమవుతాయన్నారు.

04/10/2016 - 04:42

హైదరాబాద్, ఏప్రిల్ 9: వివాదాలతో అట్టుడికి పోతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ దేశంలోనే మరో మారు అత్యుత్తమ వర్శిటీగా ఎంపికైంది. అవుట్‌లుక్ పత్రిక నిర్వహించిన సర్వేలో 826 యూనివర్శిటీలు పాల్గొనగా, అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఏడో స్థానంలో నిలిచి విశిష్ఠ విశ్వవిద్యాలయంగా ఎంపికైంది.

Pages