S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/11/2016 - 18:13

దిల్లీ: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి కంపెనీలో భారీగా అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణకు సిబిఐని ఆదేశించాలంటూ వినోద్‌కుమార్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై విచారణకు తాము ఆదేశాలు ఇవ్వలేమని, పిటిషనర్ సరైన కోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం పేర్కొంది.

04/11/2016 - 16:29

దిల్లీ: భారత రాజ్యాంగం ప్రకారం మహిళలకూ పురుషులతో పాటు అన్ని హక్కులు ఉన్నాయని, అయితే ఆలయాల్లో మహిళల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంలో విచారణ మొదలైంది.

04/11/2016 - 16:29

కొల్లం: కేరళలోని కొల్లం జిల్లాలో పుట్టింగళ్ ఆలయం వద్ద బాణసంచా పేలుడులో గాయపడిన వారికి ఆరెస్సెస్ కార్యకర్తలు అండగా నిలిచారు. క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు వందల సంఖ్యలో ఆరెస్సెస్ కార్యకర్తలు త్రివేండ్రం వైద్యకళాశాల వద్దకు తరలివచ్చారు. బాధితులకు మందులు,మంచినీళ్లు ఇస్తున్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఆరెస్సెస్ కార్యకర్తలు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.

04/11/2016 - 16:27

కామ్‌రూప్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ సందర్భంగా కామ్‌రూప్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద జనాన్ని చెదరగొట్టేందుకు ఓ జవాను గాలిలోకి కాల్పులు జరిపాడు. ఓటు వేసిన ఓ మహిళ తిరిగి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడాన్ని అక్కడే ఉన్న జవాను అడ్డుకున్నాడు. పోలింగ్ కేంద్రంలో ఉండిపోయిన బిడ్డను తెచ్చుకునేందుకు ఆమె వెళ్లగా జవాను ఘర్షణ పడ్డాడు. దీంతో స్థానికులు గుమికూడి జవానుతో వాదనకు దిగారు.

04/11/2016 - 16:25

కొల్లం: కేరళలోని కొల్లం వద్ద పుట్టింగళ్ ఆలయం వద్ద మూడు కార్లలో పేలుడు పదార్థాలున్నట్లు సోమవారం పోలీసులు గుర్తించారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు బాంబు స్క్వాడ్‌ను రప్పించారు.

04/11/2016 - 16:24

కొల్లం: కేరళలోని కొల్లం వద్ద పుట్టింగళ్ ఆలయం వద్ద బాణసంచా ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 112కు చేరింది. సుమారు 500 మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. బాణసంచా పోటీలను నిషేధించినప్పటికీ ఎవరూ ఖాతరు చేయకపోవడం వల్లే ఈ దారుణ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండడంతో ఈ ప్రాంతంలో విషాదం అలముకుంది.

04/11/2016 - 16:24

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు పట్టం గడితే సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని డిఎంకె అధినేత కరుణానిధి తమ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈసారి ఉచిత పథకాలకు బదులు యువత, రైతులు, మహిళలను ఆకుట్టుకునేందుకు డిఎంకె తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. చిన్న, సన్నకారు రైతులు బకాయిపడ్డ రుణాలను, విద్యారుణాలను రద్దు చేస్తామని కరుణ ప్రకటించారు.

04/11/2016 - 14:18

హరిద్వార్: షిర్డీ సాయిబాబాను భక్తులు ఆరాధించడంపై తరచూ విమర్శలు గుప్పించే ద్వారకా శారదా పీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హరిద్వార్ పర్యటన సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ, ఫకైరైన షిర్డీ సాయిని ఆరాధించడం వల్లే మహారాష్టల్రో కరవు విలయ తాండవం చేస్తోందన్నారు. దేవుడ్ని పూజించవచ్చని, ఫకీర్లను ఆరాధించడం తగదన్నారు.

04/11/2016 - 12:57

కోల్‌కత: పోలింగ్ అధికారి ఆకస్మికంగా గుండెపోటుకు లోనై మరణించిన ఘటన బుర్ద్వాన్ జిల్లాలో సోమవారం జరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండోవిడత పోలింగ్ సందర్భంగా బుర్ద్వాన్ జిల్లా పండవేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 234 నెంబర్ పోలింగ్ బూత్ వద్ద పరిమళ్ బౌరీ అనే అధికారి విధి నిర్వహణలో ఉండగా హఠాత్తుగా గుండెపోటుకు లోనై తుదిశ్వాస విడిచారు.

04/11/2016 - 12:56

దిల్లీ: కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన కంపెనీలో సుమారు 7,600 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగినందున ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ విషయమై సిట్ ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వలేమని, పిటిషనర్ ఆర్‌బిఐని లేదా ఎన్‌ఎఫ్‌ఐఓను ఆశ్రయించాలని కోర్టు సూచించింది.

Pages