S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/11/2016 - 05:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10:ఢిల్లీ, హిమాచల్, హర్యానా, జమ్ము,కాశ్మీర్ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలు భూ ప్రకంపనలకు గురయ్యాయి. అఫ్గానిస్తాన్‌లోని పర్వతమయ హిందుకుష్ కేంద్రంగా ఆదివారం రిక్టర్ స్కేలుపై 6.6 పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ఉపరితలానికి 210కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా నిర్థారించారు. పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాలూ ప్రకంపనల తాకిడికి గురయ్యాయి.

04/10/2016 - 18:17

కొల్లం:అగ్నిప్రమాదం జరిగిన పుట్టింగల్ ఆలయాన్ని ఏఐసిసి నేత రాహుల్‌గాంధీ సందర్శించారు. కొల్లం చేరుకున్న ఆయన బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

04/10/2016 - 18:17

న్యూదిల్లి:జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఎన్నికయ్యారు. దిల్లీలో ఆదివారం జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు పార్టీ అధ్యక్షునిగా మూడుసార్లు బాధ్యతలు నిర్వహించిన శరద్‌యాదవ్ నాలుగోసారి అందుకు నిరాకరించడంతో నితీశ్‌కు పగ్గాలు అందించారు.

04/10/2016 - 18:15

తిరువనంతపురం:కేరళలోని పుట్టింగల్ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు. కాగా తిరువనంతపురం ఆస్ప్రతి లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పరామర్శించారు. జాతియావత్తు కేరళకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

04/10/2016 - 18:14

కొల్లం:పుట్టింగల్ ఆలయంలో ప్రమాదం అనంతరం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. త్రివిధ దళాలకు చెందిన సైనికులు, అధికారులు, వైద్యసిబ్బంది హుటాహుటిని చేరుకుని సేవలు అందిస్తున్నారు. ఆరు హెలికాప్టర్లు, రెండు విమానాల్లో మందులు, వైద్యులను తరలించి క్షతగాత్రులకు చికిత్స మొదలుపెట్టారు. శిథిలాల తొలగింపు మొదలైంది. ప్రమాదం జరిగినప్పుడు పదివేలమంది భక్తులు ఆలయ పరిసరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

04/10/2016 - 18:14

కొల్లం:కేరళలో భారీ అగ్నిప్రమాదానికి గురైన పుట్టింగల్ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సందర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది ఉన్నారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చారు. పుట్టింగల్‌లో జరిగిన విధ్వంసాన్ని చూశారు. బాధితులను ఓదార్చారు.

04/10/2016 - 17:06

ముంబై:ముంబైలో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో మిస్ ఇండియా వరల్డ్‌గా దిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ ఎంపికైంది. విజేత పేరును బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ ప్రకటించారు. మొదటి రన్నరప్‌గా బెంగళూరుకు చెందిన సుశ్రీత, రెండవ రన్నరప్‌గా పంఖుడి గిడ్వాని ఎంపికయ్యారు. సానియామిర్జా, ఏక్తాకపూర్ సహా పలువురు బాలీవుడ్ నటీనటులతో కూడిన జ్యూరీ విజేతలను ఎంపిక చేసింది.

04/10/2016 - 17:04

తిరువనంతపురం:కేరళలోని కొల్లం ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పుట్టింగల్ ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించి భారీ ప్రాణనష్టం సంభవించింది. మీనాభరణి ఉత్సవాలలో భాగంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు బాణాసంచా కాలుస్తుండగా మంటలు అంటుకుని నలువైపులా వ్యాపించాయి. వేడుకల్లో ఉన్న భక్తులు తప్పించుకునేలోగానే వందమందికిపైగా మృత్యువాద పడ్డారు. వందల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు.

04/10/2016 - 07:02

పూణే, ఏప్రిల్ 9: భారత్ మాతాకీ జై అనడాన్ని తానెంతో గర్వంగా భావిస్తానని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు. మాతృదేశాన్ని గౌరవించడం అంటే ఏదో ఘోరం జరిగిపోయినట్టు వ్యాఖ్యానించడం, దాన్నొక సమస్యగా సృష్టించడం దారుణమని శనివారం ఇక్కడ చెప్పారు.

04/10/2016 - 05:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజిఎన్‌ఆర్‌జిఏ) కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటానిధుల కింద రూ.12,230 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేసింది. ఈ పథకంకోసం ఒకేసారి ఇంత భారీగా నిధులు విడుదల చేయడం ఇదే మొదటిసారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంటోంది.

Pages