S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/22/2018 - 13:00

జమ్మూకాశ్మీర్: పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపురా ఏరియాలోని ఆరాంపుర గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని అందిన పక్కా సమాచారం మేరకు భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

12/22/2018 - 12:59

ఖాట్మాండ: నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 23మంది దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం రాత్రి బొటానికల్ గార్డెన్ టూర్‌కు వెళ్లిన విద్యార్థుల బస్సు ఓ మారుమూల ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 23మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

12/22/2018 - 02:07

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్ ఆఫీసును ప్రస్తుతం ఉన్న భవనం నుండి రెండు వారాల్లోగా ఖాళీ చేయాలని ఢిల్లీ హఐకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికను గతంలో ప్రచురించిన విషయం విదితమే.

12/22/2018 - 02:02

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని పసిగట్టడం, పంపించే సందేశాలు, స్వీకరించే సమాచారాన్ని పర్యవేక్షించి తెలుసుకునే అధికారాన్ని పది కేంద్ర ఏజన్సీలకు అప్పచెప్పడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం విమర్శించింది. ఈ మేరకు సీపీఎం పొలిట్‌బ్యూరో ప్రకటనను విడుదల చేసింది. వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించే విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయని సీపీఎం పేర్కొంది.

12/22/2018 - 02:00

న్యూఢిల్లీ,డిసెంబర్ 21: రైల్వేశాఖలో పనిచేస్తున్న క్వాసీ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులను క్రమబద్ధం చేయాలని ఉద్యోగ సంఘాలు రైల్వేశాఖ ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశాయి. దేశంలో వివిధ విభాగాలలో సుమారు అన్ని జోన్లలో 1176 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు రాజ్‌కుమార్, తిరుపతి, శ్రీధర్ శుక్రవారం కేంద్ర రైల్వే మంత్రిత్వాశాఖ ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు.

12/21/2018 - 23:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: రాజ్యసభలో గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న గొడవ, గందరగోళం పట్ల దేశ ప్రజల్లో ఆందోళన చేటుచేసుకుంటున్నదని, ఇది మంచి పరిణామం కాదని ఉప రాష్టప్రతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. సభను సజావుగా జరగనివ్వకపోవడం మంచి పరిణామం కాదని అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలను ఆయన హెచ్చరించారు.

12/21/2018 - 23:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: అధికారంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ భద్రత పేరుతో ప్రజల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ సాధనపై నిఘా పెట్టే అధికారాన్ని పది భద్రతా సంస్థలకు ఇవ్వడాన్ని ప్రతిపక్ష పార్టీలు నిరసించాయి. ఈ విషయంలో శుక్రవారం రాజ్యసభలో అధికార, ప్రతిపక్షం సభ్యుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఎంతకూ సద్దుమణగకపోవడంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

12/21/2018 - 23:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: సైబర్ నేరాలను అరికట్టడంలో భాగంగా, కంప్యూటర్ సిస్టమ్స్‌లో ఉన్న సమాచారాన్ని కనుగొనేందుకు, పర్యవేక్షించేందుకు పది కేంద్రం ఆధీనంలో ఉంటే నిఘా ఏజన్సీలకు అధికారాన్ని ఇస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏజన్సీలకు కొత్తగా అధికారాలు ఏమీ ఇవ్వలేదని , పాత నిబంధనల మేరకే రూపొందించామని హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపారు.

12/21/2018 - 23:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: విశాఖపట్నం- యశ్వంతపుర వీక్లీ స్పెషల్ రైలు సర్వీసు త్వ రలోనే అందుబాటులోకి రానుంది. జనవరి నుంచి ఏప్రిల్ 2019 వరకూ ఈ సర్వీసును పునఃప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ వారంతపు రైలుకు విపరీతమైన రద్దీ ఉన్న విషయం వాస్తవమేనా? అలాంటప్పుడు నిలిపివేయడానికి కారణాలేమిటి?

12/21/2018 - 22:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నదని ఆరోపిస్తూ, తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్‌లో శుక్రవారం కూడా తమ నిరసనను కొనసాగించారు. ఉదయం పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు చేతబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Pages