S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందకొడిగా పోలింగ్!

కాకినాడ, ఆగస్టు 29: చెదురు మదురు ఘటనలు వినా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా సాగింది. పోలింగ్ మందకొడిగా కేవలం 64.78 శాతంగా నమోదయ్యింది. ఉదయం 7నుంచి నగరంలోని 48 డివిజన్లలో ఏర్పాటుచేసిన 196 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం కాగా, కొన్ని పోలింగ్ స్టేషన్లలో మధ్యాహ్నం వరకు ఓటర్లు కనిపించకపోవడం విశేషం. నగరపాలక సంస్థలోని 48 డివిజన్లలో 2 లక్షల 29వేల 373 మంది ఓటర్లకుగాను లక్ష 48వేల 598 మంది ఓటు హక్కు వినియోగించున్నారు. పోలింగ్ ప్రారంభం నుంచి కొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి.

మునిగిన ముంబయి

ముంబయి, ఆగస్టు 29: దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహానగరం వర్షాలు, వరదలతో తల్లడిల్లిపోతోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా సబర్బన్ రైలు సర్వీసులకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. కొన్ని సర్వీసులను రద్దుచేశారు. రహదారులపై నీరు ప్రవహించడంతో వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా దాదాపుఅన్ని చోట్లా ఎవరూ ఎక్కడికి కదలేని పరిస్థితి నెలకొంది. రోడ్లు మోకాలిలోతుమేర నీళ్లతో నిండిపోయాయి. జనం రోడ్లపై ఈదుకుంటూ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఆఫీసులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు తక్కువ హాజరీతోనే పనిచేశాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

తెలుగే మన ఊపిరి

విజయవాడ, ఆగస్టు 29: తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం చేయాల్సినంత కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భావితరాలకు మన వారసత్వ సంపద అందించేందుకు అహరహం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి అధికారికంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సభలో చంద్రబాబు ముఖ్య అతిధిగా మాట్లాడారు. తెలుగు భాష పరిరక్షణకు కమిటీ వేశామని, కమిటీ సిఫార్సులకు అనుగుణంగా భాషాభివృద్ధికి 7 అకాడమీలు ఏర్పాటు చేశామన్నారు. అందుకు సంబంధించిన జీవోను సభలో ఆవిష్కరించారు.

జిపిఎస్ లింకుతో చంద్రన్న పర్యవేక్షణ

విజయవాడ, ఆగస్టు 29: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటంలో భాగంగా చంద్రన్న సంచార వైద్య కేంద్రాలను జిపిఎస్ విధానంతో అనుసంధానించనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. దీనివల్ల ఏ వాహనం ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. చంద్రన్న వైద్య సంచార కేంద్రాల ద్వారా వైద్య, రోగనిర్ధారణ, నర్సింగ్ సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్శిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడ్‌టెక్ జోన్ నిర్మాణంలో ప్రగతి, తదితర వివరాలను వివరించారు.

సవాళ్లకు బెదరం

ఉదయ్‌పూర్ (రాజస్తాన్), ఆగస్టు 29: తమ ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని నిబద్ధతతో అమలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం కారణంగా మొత్తం వ్యవస్థే చతికిల పడిందని మంగళవారం ఖేల్‌కావ్‌లో జరిగిన భారీ ర్యాలీలో అన్నారు. మూడేళ్ల క్రితం ఎన్‌డిఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు మొత్తం వ్యవస్థే కుంటుపడిపోయిన స్థితిలో ఉందని గుర్తు చేశారు. ‘అలాంటి సమయంలో అధికారం చేపట్టిన మేము ధైర్యంగా ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేదే’నని మోదీ అన్నారు.

పోటీ మరింత తీవ్ర రూపం

అంతర్జాతీయ బాడ్మింటన్ మ్యాచ్‌లలో పోటీ మరింత తీవ్ర రూపం దాల్చింది. సుదీర్ఘమైన ర్యాలీలతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయ. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి బాడ్మింటన్ మ్యాచ్‌లు అంత సులభంగా లేవు. పురుషుల సింగిల్స్, డబుల్స్ సహా అన్ని విభాగాల మ్యాచ్‌లూ సుదీర్ఘమైన ర్యాలీలు హోరాహోరీగా సాగుతున్నాయ. ప్రతిభతోపాటు క్రీడాకారుల మధ్య పోటీ విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
- హైదరాబాద్‌లో పి.వి. సింధు

చరిత్ర సృష్టించిన జఝరియా

న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్న తొలి పారా అథ్లెట్‌గా దేవేంద్ర జఝరియా చరిత్ర సృష్టించాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో మంగళవారం కన్నుల పండువగా జరిగిన కార్యక్రమంలో అతను హాకీస్టార్ సర్దార్ సింగ్‌తో కలసి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు క్రీడా పురస్కారాలను అందుకున్నారు.

గెలుపు తేలిక్కాదు

హైదరాబాద్, ఆగస్టు 29: అంతర్జాతీయ బాడ్మింటన్ మ్యాచ్‌లలో పోటీ మరింత తీవ్ర రూపం దాల్చిందని, దీంతో సుదీర్ఘమైన ర్యాలీలతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయని ‘తెలుగు తేజం’ పివి.సింధు (22) అభిప్రాయపడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆదివారం సుదీర్ఘంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరాతో హోరాహోరీగా తలపడిన సింధు చివరికి రజత పతకాన్ని గెలుచుకుంది. సుదీర్ఘమైన ర్యాలీలతో ఆద్యంతం నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో 110 నిమిషాల పాటు ఒకుహరాతో తలపడిన సింధు చివరికి వెంట్రుకవాసిలో ఓటమిని ఎదుర్కొంది.

సత్తా చాటిన గౌరవ్

హాంబర్గ్, ఆగస్టు 29: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ గౌరవ్ బిధూరీ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. వైల్డ్‌కార్డుతో ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్న అతను మంగళవారం ఇక్కడ 56 కిలోల బాంటమ్ వెయిట్ విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో ట్యునీషియాకి చెందిన బిలెల్ మహ్మదీని మట్టికరిపించి భారత్‌కు పతకాన్ని ఖాయం చేశాడు. ఈ విజయంతో అతను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలి ప్రయత్నంలోనే పతకాన్ని అందుకోనున్న రెండవ భారత బాక్సర్‌గానూ, వైల్డ్‌కార్డు ద్వారా పతకాన్ని అందుకోనున్న నాలుగవ భారత బాక్సర్‌గానూ ఆవిర్భవించనున్నాడు.

షరపోవా బోణీ

న్యూయార్క్, ఆగస్టు 29: డోపింగ్ వ్యవహారంలో 15 నెలల పాటు నిషేధాన్ని పూర్తి చేసుకుని మళ్లీ ర్యాకెట్ చేతబట్టిన రష్యా అందాల భామ మరియా షరపోవా (30) యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభాన్ని సాధించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో ఆమె 6-4, 4-6, 6-3 తేడాతో రుమేనియాకి చెందిన ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి సిమోనా హాలెప్ (25)ను మట్టికరిపించి తన సత్తా చాటుకుంది. తద్వారా ఆమె గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తన పునరాగమనాన్ని విజయంతో మొదలు పెట్టింది.

Pages