S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యారంగాన్ని సంస్కరించాలి

ఖమ్మం, డిసెంబర్ 11: ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా విధానాలను ప్రోత్సహించి ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులో లేకుండా చేశారని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు సంస్కరణలు అవసరమని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన టిపిటిఎఫ్ ఖమ్మం జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అంటే సంపద పోగుపడటం కాదని, ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపడటమని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు విద్యే ప్రధాన సాధనమన్నారు.

వేటగాళ్ల ఉచ్చుకు చిరుతపులి బలి

ఆదిలాబాద్,డిసెంబర్ 11: వేటగాళ్ల ఉచ్చులో పడి కోటపల్లి మండలం అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవకముందే ఆదిలాబాద్ అటవీ డివిజన్ పరిధిలో మరో చిరుతపులి మృతి చెందిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. అడవులకు నిలయమైన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వరసగా వన్యప్రాణులు బలవుతున్న సంఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా పెన్‌గంగా పరివాహక ప్రాంతమైన భీంపూర్ మండలం తాంసికె గ్రామ సమీపంలోని బొర్లగుట్ట అటవీ ప్రాంతంలో చిరుతపులి మృతదేహాన్ని చూసి పశువుల కాపర్లు గ్రామ సర్పంచ్‌కు తెలిపారు.

రూ.1200 కోట్లతో కెజిబివిల అభివృద్ధి

ఖమ్మం, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో 73వేల మంది ఆడపిల్లలు విద్యనభ్యసిస్తున్న కస్తూర్బా పాఠశాలల అభివృద్ధికి 1200 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి విద్యార్థినులకు ఆయన రగ్గులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా కడియం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో విద్యార్థులకు వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడదన్నారు.

ఈసారి అధికారం మాదే

మహబూబాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో 2019లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్టశ్రాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లాలో బిజెపి జెండా ఎగురవేద్దామని అన్నారు. పూర్వం వరంగల్ జిల్లాల్లో 3ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయని 2019లో ఈ మూడు ఎస్టీ నియోజకవర్గాలలో కాషాయ జెండా ఎగురవేయాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లాకు తొలిసారిగా జిల్లా అధ్యక్ష పదవి ఆదివాసీ అయిన యాప సీతయ్యకు ఇచ్చామన్నారు. ఎ ఇతర పార్టీ కూడా ఇంతవరకు గిరిజనుడికి పదవులు జిల్లా పదవులు ఇవ్వలేదన్నారు.

నిధుల కోసం భిక్షాటన

కరీంనగర్, డిసెంబర్ 11: జిల్లాల పునర్విభజన అనంతరం తొలిసారిగా కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. జిల్లాల విభజనతో ఉమ్మడి జిల్లాలోని మండలాలు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విలీనం కావడం, ఆ ఏడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావటంతో ఈ సమావేశంలో జంబోజెట్ సీన్ ఆవిష్కృతమైంది.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏదీ?

హైదరాబాద్, డిసెంబర్ 11: ‘రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేకుండా బాధపడకూడదన్నది నా అభిమతం. అందుకే నిబంధనల ప్రకారం సాధ్యం కాదంటున్నా మానవతా దృక్పథంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను దశల వారీగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించాం’ వారం రోజుల కిందట విద్యుత్‌శాఖ ఉద్యోగుల సమ్మె నోటీసుపై స్పందిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇది. ‘ఒకే పని చేసే ఉద్యోగులకు ఒకేరకంగా వేతనం ఉండాలి. పర్మనెంట్ ఉద్యోగైనా, కాంట్రాక్టు ఉద్యోగి అయినా చేసే పని ఒక్కటే అయినప్పుడు జీతం మాత్రం ఒక్కటే ఎందుకు ఉండదు?. నా దృష్టిలో కాంట్రాక్టు వ్యవస్థ వెట్టి చాకిరిలాంటిదే.

బిజెపికి పెద్ద నోట్ల తలనొప్పి

హైదరాబాద్, డిసెంబర్ 11: బిజెపి నేతల గొంతుల్లో వెలక్కాయ పడ్డ చందంగా పెద్ద నోట్ల రద్దు అంశం పడింది. ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని తెలంగాణ పార్టీ నేతలు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు చేయడం వల్లే నల్ల కుబేరులు బయట పడుతున్నారని ప్రచారం చేయడంతో పాటు మొబైల్, క్రెడిట్, డెబిట్ కార్డులు. ఈ-బ్యాంకింగ్, వ్యాలెట్ల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని బిజెపి రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితిని పార్టీ నాయకులు అంఛనా వేశారు.

నక్సల్ దంపతుల లొంగుబాటు

పరకాల, డిసెంబర్ 11: నిషిద్ధ సిపిఐ మావోయిస్టు పార్టీ చర్ల-వెంకటపూర్ ఏరియా డివిజనల్ కమిటీ సభ్యుడు కుక్కల గణపతి అలియాస్ రాజు, అతని భార్య చెన్నూరి సర్వక్క అలియాస్ స్వరూప ఆదివారం భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ ఎదుట లొంగి పోయారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, గణపతి భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం షాపెళ్ళి గ్రామానికి, సర్వక్క భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కనుకనూరు గ్రామానికి చెందిన వారన్నారు. గణపతి చర్ల-వెంకటపూర్ ఏరియా డివిజన్ కమిటీ సభ్యునిగానూ, సర్వక్క ఏరియా కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు.

గొలుసుల దొంగ అరెస్టు

హైదరాబాద్/బేగంపేట, డిసెంబర్ 11: హైదరాబాద్‌లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతోన్న కరుడుగట్టిన చైన్ స్నాచర్‌ను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 60 తులాల బంగారు ఆభరణాలు, బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గొలుసు దొంగతోపాటు దొంగ బంగారం కొనుగోలు చేసిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి వై లింబారెడ్డి ఆదివారం విలేఖరులకు తెలిపారు. చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ అమీర్ (26) ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నాడు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని 15 పోలీస్ స్టేషన్లలో ఇతనిపై కేసులున్నాయి.

ఉత్తమ వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 11: సామాన్య ప్రజల కోసం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు ఆధునీకరించి అత్యుత్తమ వైద్యసేవలందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మంత్రి కార్యాలయంలో వైద్యసహాయం నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలందరికీ అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో 1100 వ్యాధులకు ఉచితంగా వైద్యసేవలు అందించడం జరుగుతోందన్నారు.

Pages