S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన విద్యావిధానం విద్యారంగానికి చేటు

విజయనగరం(టౌన్), డిసెంబర్ 11: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావిధానాలు ప్రభుత్వ రంగ విద్యకు చేటు కలిగించే విధంగా ఉన్నాయని, వీటిని తిప్పి కొట్టేందుకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎంవి ఎస్ శర్మ పిలుపు నిచ్చారు. ఎపి ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య 42వ రాష్ట్ర మహాసభలు ఆదివారం విజయనగరం పట్టణంలో ఘనంగా ప్రారంభయ్యాయి. రెండు రోజలు జరిగే సమావేశాల్లో విద్యారంగంలో ఎదురవుతున్న సవాళ్లు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి పూర్తిస్ధాయిలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మన్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నర్సీపట్నం, డిసెంబర్ 11: విశాఖ ఏజన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పది రోజుల క్రితం లంబసింగిలో ఐదు డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుఫాన్ కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఈనెల 8వ తేదీ గురువారం చింతపల్లిలో 7.5, లంబసింగిలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 9వ తేదీన చింతపల్లిలో 8, లంబసింగిలో 6.5, 10వ తేదీన చింతపల్లిలో 9.5, లంబసింగిలో 8.0, 11వ తేదీన చింతపల్లిలో 11.5, లంబసింగిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నగదు కోసం బారులు

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 11: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు నగదు కోసం నానా అవస్థలు పడుతున్నారు. గత నెలరోజులుగా నగదు కోసం ప్రజలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుసగా శనివారం నుండి సోమవారం వరకు బ్యాంకులకు సెలవులు కావడంతో ప్రజల వద్ద నిత్యావసర ఖర్చులకు డబ్బుల్లేక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏటిఎంల్లోనైనా నగదు ఉన్నట్లయితే వచ్చిన రెండువేలుతోనైనా అవసరం తీరేది. అయితే మూడురోజులు బ్యాంకులకు సెలవు అని ప్రజలకు తెలియడంతో ఏటిఎంల్లో ఉన్న నగదు శుక్రవారం రాత్రే ఖాళీ చేసారు.

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం

విశాఖపట్నం, డిసెంబర్ 11: ఉరుకుల పరుగుల జీవితంలో క్రీడలను మనిషి దూరం చేసుకుని, ఆరోగ్య సమస్యలతో ప్రశాంతతను కోల్పోయి సమస్యలకు దగ్గర అవుతున్నాడని ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడిసిఎల్) చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ అన్నారు. ఆదివారం పోర్టు కళావాణి స్టేడియం వేదికగా నిర్వహించిన ఏపీ విద్యుత్ సంస్థల క్రీడాసమితి ఆధ్వర్యంలో 9వ తేదీన ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు వత్తిడి ఇనుండి ఉపశమనం కలిగిస్తాయని, అధిక వత్తిడిలో పనిచేసే విద్యుత్ సిబ్బందికి క్రీడలు మరింత అవసరమన్నారు.

క్యాష్ కష్టాలు

విశాఖపట్నం, డిసెంబర్ 11: నోట్ల రద్దు జరిగి నెల పూర్తయింది. రెండవ మాసాంలోకి అడుగుపెట్టాం. అయినా సమస్య తీరడంలేదు. ఇది ఒక కొలిక్కి రావడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తే ఏమీ పట్టించుకోవడంలేదు. పైగా రోజుకో సమస్యను సృష్టిస్తున్నాయి. దీంతో సామాన్యుల వెతలు అన్నీ ఇన్నీ కాకుండా పోతున్నాయి. నెలంతా చెమటోడ్చి పని చేసినా వేతనం చేతికందక సామన్య ఉద్యోగులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అప్పుడే నెలలో సగం రోజులు అయిపోతున్నాయి. ఈపాటికి గత నెల జీతం ఖర్చు చేసే సామాన్య ఉద్యోగులు చేబదుళ్ళు, అప్పుల కోసం పరుగులు తీస్తుండాలి. అటువంటిది అసలు జీతమే చేతికందని పరిస్థితులు.

17న నగరానికి సిఎం

విశాఖపట్నం, డిసెంబర్ 11: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న విశాఖ నగరంలో పర్యటించనున్నారు. 17న ఉదయం ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకునే ముఖ్యమంత్రి రాత్రి 9 గంటలకు తిరిగి వెళ్తారు. 12 గంటల వ్యవధిలో చంద్రబాబు ఆరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నిర్మించిన చిల్డ్రన్స్ ఎరీనాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రారంభించి, అనంతరం కొద్దిసేపు చిల్డ్రన్స్ థియేటర్‌లో చిత్ర ప్రదర్శన తిలకిస్తారు. అక్కడ నుంచి 10.30 గంటలకు ఎయు ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌కు చేరుకుని 68వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొంటారు.

ఈ హుండీకి ఆదరణ కరవు

విశాఖపట్నం, డిసెంబర్ 11: నోట్ల రద్దు దేవాలయాలనూ ప్రభావితం చేస్తున్నాయి. నోట్ల రద్దు తొలి రోజుల్లో రద్దయిన పెద్ద నోట్లను భక్తులు స్వామికి కానుకల రూపంలో చెల్లించారు. క్రమేపీ కానుకల్లో కూడా పెద్ద నోట్ల రాక తగ్గుతూ వస్తోంది. ఇక నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో ప్రఖ్యాత సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అధికారులు ప్రవేశపెట్టిన పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) యంత్రాల ద్వారా కానుకల స్వీకరణతో పాటు ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయాల్లోనూ అమలు చేస్తున్నారు. దేవస్థానంలో కానుకల స్వీకరణతో పాటు టికెట్ విక్రయాల వద్ద ఇప్పటి వరకూ 12 పిఓఎస్ యంత్రాలను ఏర్పాటు చేశారు.

వుడా చేతికి మరో భారీ ప్రాజెక్టు

విశాఖపట్నం, డిసెంబర్ 11: సుమారు 13,500 కోట్ల వ్యయంతో 42.5కిలోమీటర్ల మేర విశాఖ మెట్రోరైల్ నిర్మించాలని, అందుకు అనుగుణంగా ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) ఆధ్వర్యంలో సమగ్ర పథక నివేదిక (డిపిఆర్) రూపొందించారు. మూడు కారిడార్లుగా 35 స్టేషన్లతో మెట్రోరైల్ ప్రాజెక్టు డిపిఆర్ కేంద్ర ఆమోదాన్ని పొందింది. మొదటి కారిడార్ కొమ్మాది నుంచి గాజువాక వరకూ 30.38 కి.మీగాను, రెండో కారిడార్ గురుద్వార నుంచి పాతపోస్ట్ఫాసుకు 5.2 కిమీగాను, మూడో కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరుకు 6.9 కిమీగాను నిర్ణయించారు.

ప్రతి నియోజకవర్గానికి 1350 ఇళ్లు మంజూరు

వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 11: రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 1350 ఇళ్లు బలహీనవర్గాలకు మంజూరైనట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖామంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం బెండికొండ వద్ద హుదూద్ తుపాన్‌లో నష్టపోయిన బాధిత కుటుంబాలకు రూ.7కోట్ల 46 లక్షలతో నిర్మించనున్న 192 ఇళ్లకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలకు పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యమన్నారు. హుదూద్ నష్టం కింద 10 వేలు ఇళ్లు మంజూరు కాగా జిల్లాకు 2500 ఇళ్లు వచ్చాయన్నారు. ఈ విపత్తులో నష్టపోయిన ప్రతి లబ్ధిదారునికి పక్కా ఇల్లు నిర్మించి అందివ్వడమే ప్రభుత్వ సంకల్పమన్నారు.

ప్రతి పేదవానికి సొంతంటి కల నెరవేరుస్తాం

కందుకూరు, డిసెంబర్ 11: రాష్ట్రంలోని ప్రతి పేదవానికి తన సొంతింటి కలను నెరవేర్చడమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎస్‌ఎస్ ట్యాంక్ సమీపంలో గృహాల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జి మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్ అన్నం వెంకటేశ్వర్లుతో కలసి స్థల వివరాలు తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గృహాలు నిర్మిస్తే పేదలకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా అన్న కోణంలో అధికారులు అలోచించాలన్నారు.

Pages