S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూనీ ఎదురీత

మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్, ఇంగ్లాండ్ సాకర్ సూపర్ స్టార్ వేన్ రూనీ కెరీర్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా ఫామ్‌లో లేని అతను తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్ చివరిలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినా, యూరోపియన్ లీగ్‌లో ఫెయెనూర్డ్‌పై అద్భుతమైన గోల్ సాధించినా, అతనిని ఎవరూ ప్రశ్నించడం లేదు. మాంచెస్టర్ యునైటెడ్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన కెప్టెన్‌గా ఇప్పటికే అతను రికార్డు నెలకొల్పాడు. ఆ క్లబ్ తరఫున అన్ని స్థాయి పోటీల్లో ఆల్‌టైమ్ రికార్డు బాబీ చార్ల్‌టన్ పేరుమీద ఉంది. అతను 249 గోల్స్ చేశాడు. రూనీ 248 గోల్స్‌తో అతనికి గట్టిపోటీనిస్తున్నాడు.

ప్రాంతీయాభిమానం

అమెరికా బాస్కెట్‌బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్‌కు ప్రాంతీయాభిమానం ఎక్కువ. నార్త్ కరోలినాకు చెందిన అతను అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఎక్కువగా అతను ఆ ప్రాంతం పేరును ముద్రించిన నిక్కర్లనే వాడేవాడు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చికాగో బుల్స్ దుస్తులు వేసుకునేవాడు. అయితే, నార్త్ కరోలినా నిక్కరు వేసుకొని, దానిపై బుల్స్ యూనిఫామ్ ధరించి మ్యాచ్‌లు ఆడేవాడు. అతనికి ఉన్న ప్రాంతీయాభిమానం అలాంటిది. ‘నేను విఫలమయ్యాను.. మళ్లీ మళ్లీ మళ్లీ విఫలమయ్యాను.. ఎన్నో ఓటముల తర్వాతే విజయాలు లభించాయి’ అంటూ యువతకు స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పిన అతనికి ఇంత ప్రాంతీయాభిమానం ఏమిటో!

- సత్య

కబుర్లని కదిపితినా.. (కథ)

ఉదయం ఐదు గంటలకి వాకిట్లో ముగ్గు వేస్తున్నాను. ఒక వృద్ధురాలు పూర్తిగా నడుము వంగిపోయి నేలవంక చూస్తూ వెళుతోంది. ధనుర్మాసం. ఇంకా పూర్తిగా వెలుగురాని ఈ సమయంలో ఏం పని? మళ్లీ తొమ్మిది గంటలకి ఒక ప్లాస్టిక్ కవరులో బాక్స్ పెట్టుకుని మా ఇంటి ముందు నుంచే వెళ్లింది.
మా వీధిలో అందరి ఇళ్లల్లో వ్య క్తుల స్వభావాలు, చేసే ఉద్యోగాలు, జరిగే సంఘటనలు, సమస్యలు ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది (టివి వార్తల్లా వివరంగా) పనిమనిషి రామసాయి. చాలా హుషారుగా వుం టుంది. మిగిలిన పనివాళ్ల ద్వారా వాళ్లు పనిచేస్తున్న ఇళ్లలోని గొడవలు, ఇంట్లోవారి గుణగణాలు అన్నీ తెలుసుకుని నాకొచ్చి చెపుతుంది.

రష్యా టాప్!

క్రీడల్లో డోపింగ్ మహమ్మారి తీవ్రత మరోసారి తెరపైకి వచ్చింది. వెయట్‌లిఫ్టింగ్‌లో ఈ దుష్ట సంప్రదాయం చాలా తీవ్ర స్థాయలో ఉంది. రెండో స్థానంలో రెజ్లింగ్ ఉంది. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో, భారత వెయట్‌లిఫ్టింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ వేటు పడింది. జరిమానా చెల్లించుకొని, అతి కష్టం మీద సస్పెన్షన్ నుంచి సమాఖ్య బయటపడింది. రెజ్లింగ్‌లోనూ ఈ సమస్య వెళ్లూనుకుంటున్నదని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఇటీవల విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. ఒలింపిక్స్‌కు ఎంపికైన నర్సింగ్ యాదవ్ కూడా డోపింగ్ పరీక్షలో పట్టుబడడం మన దేశంలోనూ పెరుగుతున్న సమస్యకు అద్దం పడుతున్నది.

మంచివాడు పోయినా వున్నట్లే! ( చిన్న కథ)

‘అమ్మా! మీ ప్రభాకర్ అన్నయ్య బకెట్ తనే్నశాడట. మా ఫ్రెండ్ చెప్పాడు’ అన్నాడు రవి.
‘పిచ్చివాగుడు ఆపరా. మొన్నకూడా ఆ తాయారమ్మ గారు పోయారని చెప్పావు. ఆవిడ నాకు రామకోటిలో కనిపించింది. ఎందుకిలా అందరినీ చంపేస్తున్నావు? మావోడికి కొద్ది నోటిదురుసు. అందుకే అందరం దూరంగా వున్నాం. చచ్చిపోయినా చెప్పనంత కక్షలు మామధ్య లేవు’ అంది దుర్గాంబ కోపంగా.
‘వాడికి ఇప్పుడే ఫోన్ చేస్తా విను’ అని స్పీకర్ ఆన్‌చేసి ‘ప్రభాకర్ గారు చనిపోయి ఎన్ని రోజులైందిరా?’ అని అడిగాడు రవి.

డోప్ నీడలో వెయిట్‌లిఫ్టింగ్!

మిగతా క్రీడలతో పోలిస్తే లిఫ్టర్లలోనే డోపింగ్ వాడకం ఎక్కువగా ఉండడం ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యుఎఫ్)ను ఆందోళనకు గురి చేస్తున్నది. చాలాకాలంగా డోపింగ్ నీడలోనే వెయిట్‌లిఫ్టింగ్ మనుగడ సాగిస్తున్నది. 1896లో మొట్టమొదటిసారి ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన ఈ క్రీడలో గతంలో ఎన్నడూ లేనంతగా డోపింగ్ కేసులు బయటపడుతున్నాయి. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో సేకరించిన శాంపిల్స్‌లో ఇప్పటికే 104 కేసులు వెలుగుచూశాయి. వీటిలో 48 కేవలం వెయిట్‌లిఫ్టర్లకు చెందినవే కావడం విశేషం. డోపింగ్ దోషులుగా తేలిన వారిలో ఎక్కువ మంది పతకాలు సాధించిన వారే.

- శ్రీహరి

డబ్బు కోసం ‘టెన్నిస్’ క్రికెట్!

దేశవాళీ టోర్నీల్లోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచే క్రికెటర్లకు కాసుల పంట మొదలవుతుంది. అయితే, అంతకంటే ముందే డబ్బు సంపాదించాలంటే చాలా మంది ఎంచుకునే దగ్గర దారి ‘టెన్నిస్’ క్రికెట్. గ్లేజ్ బంతితో కాకుండా టెన్నిస్ బంతితో ఆడే క్రికెట్‌కు మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువ క్రేజ్ ఉంది. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్లబ్‌ల ఆధ్వర్యంలో టోర్నమెంట్స్ జరుగుతాయి. మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఎంతో మంది పేరొందిన క్రికెటర్లు రంజీ ట్రోఫీకి ముందు టెన్నిస్ బంతితో జరిగే క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన వారే. పాకిస్తాన్ మాజీ వికెట్‌కీపర్ జుల్‌కర్నెన్ హైదర్ ఇప్పుడు అదే దారిని అనుసరిస్తున్నాడు.

నాకౌట్స్ హీరో మూర్

బాక్సింగ్ బౌట్స్‌లో పోటీపడడం అంటేనే ప్రాణాలతో చెలగాటం ఆడడం. ప్రత్యర్థిని ఓడించడానికి ఎంతో ప్రతిభ ఉండాలి. తిరుగులేని నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఇక నాకౌట్ విజయం కావాలంటే, అపారమైన శక్తిసామర్థ్యాలు అవసరం. తనతో సవాలు చేస్తూ రింగ్‌లోకి దిగిన బాక్సర్‌ను తిరిగి లేవకుండా మట్టికరిపించడమే నాకౌట్ విజయం. ఇలాంటి నాకౌట్స్‌లో ఆర్చీ మూర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతను ఏకంగా 141 బౌట్స్‌లో నాకౌట్ విజయాలను సాధించాడు.

అవినీతి చిరునామా (కథ)

‘నాలుగు రోజులుగా అనుకుంటున్న పనులు ఈ రోజైనా ఆఫీసుకు వెళ్లేప్పుడు పూర్తిచేయండి’ గుర్తుచేసింది శ్రీమతి కృష్ణమూర్తి.
‘అలాగే ఈ రోజు ముఖ్యమైన రెండు పనులు పూర్తిచేస్తా’2చెప్పాడు కృష్ణమూర్తి.

నీతి కోసం పోరాడే కాళి

ప్రముఖ తమిళ దర్శకుడు బాల తమిళంలో రూపొందించిన ఓ చిత్రం ‘కాళి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. బి స్టూడియోస్ పతాకంపై అధర్వ, ఆనంది, లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వరా మూవీస్, శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎం.ఆర్. అందిస్తున్నారు. శర్కునమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ- పక్కా పల్లెటూరు చిత్రంగా రూపొందించిన ఈ సినిమాలో నీతికోసం రెండు ఊర్లమధ్య జరిగిన పోరాటం ప్రధానంగా వుంటుందని తెలిపారు.

Pages