S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మో..అమీ!

అందాలతార అమీజాక్సన్ ప్రేమలో పడిందట. అదీ..బాలీవుడ్ హీరో సల్మాన్‌తోనట! అవునా..నిజమా? అని అనుకుంటున్నారా? అదే మరి నిజమేనట! ఇప్పటి వరకు సల్మాన్‌కు ఎంతో మంది హీరోయిన్లతో అఫైర్ వుందని వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ సల్మాన్ సోదరుడు సొహైల్ నటించిన ‘ఫ్రీకీ అలీ’లో నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా రజనీ ‘2.0’ ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమానికి ఎవరూ పిలవకుండానే సల్మాన్ హాజరుకావడంతో ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చినట్లయింది. అదీ కాకుండా అమీజాక్సన్, సల్మాన్ కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

-సమీర్

ఒక్క తూటా చాలు 8

రాజిరెడ్డి ఆలోచనలు చెదరగొడుతూ స్టేషన్ ముందు జీప్ ఆగింది. యుగంధర్ లోపలికి వచ్చి విజిటర్స్ గదిలో కూర్చున్న వాళ్లని చూసి చిన్నగా నవ్వి తన రూములోకి వెళ్లాడు. రెండు నిమిషాల తర్వాత స్టేషన్ రైటర్ లోపలికి ప్రవేశించి సెల్యూట్ చేసి చెప్పాడు.
‘సార్! రాజిరెడ్డిని కోర్టులో హాజరు పెట్టడానికి అవసరమైన పేపర్స్ రెడీగా ఉన్నాయి. కోర్టుకి తీసుకెళ్లడానికి వ్యానుతోపాటు ఎస్కార్టుని రమ్మన్నాను’
‘గుడ్.. రాజిరెడ్డిని, సుందరాన్ని తీసుకెళ్లి హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వస్తాను’ చెప్పాడు.
ఓ పది నిమిషాల తర్వాత జీప్ బయలుదేరింది.

-మంజరి 9441571994

ఎలా వుందీ వారం? ( డిసెంబర్ 4 నుండి 10 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

కృషి మేరకే అనుకున్న పనులు పూర్తవుతాయి. అనుకున్నట్లు కొన్ని కార్యాలు ఉన్నా, చివరలో ఆలస్యంగా పూర్తి కానున్నాయి. వృత్తి, వ్యాపారాలు క్రమక్రమంగా మెరుగవుతాయి. అనుకున్నది ఒకటి, అయినది ఒకటిలా ఉంటుంది. చేపట్టినవి సంయమనంతో పూర్తి చేసుకోవాలి. ఆదాయం అవసరాలకు తగ్గట్లు ఉంటుంది. మధ్యవర్తిత్వాలకు, హామీలకు దూరంగా ఉండండి. కుటుంబ సౌఖ్యం. నిరుద్యోగులకు, చిరుద్యోగులకు విద్యార్థులకు కృష్యానుకూలంగా ఫలాలందుకుంటారు. వాతావరణానుకూలంగా ఆరోగ్యం యోగ్యం. సంతాన ప్రాప్తి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855

భూతల స్వర్గం

మేఘాలయ భూతల స్వర్గం. మబ్బు తునకలు చాలా క్రిందికి తలల మీంచి పిల్ల తెమ్మెరలకు మల్లే పయనించడం తీయటి అనుభూతి. కొన్ని మబ్బులు తమతోపాటు మనల్ని కూడా తీసుకుపోతున్నట్లుగా ఉంటుంది. అంత క్రిందుగా మేఘ మాలికలు సాగిపోతాయక్కడ. చక్కటి వాతావరణం, పచ్చని ప్రకృతి, ఎతె్తైన పర్వతాలు, ఉవ్వెత్తున ఎగసి దుమికే జలపాతాలు.. చూడచక్కని అందాలెన్నో. చక్కని ఆతిథ్యం ఇచ్చే ‘ఖాసీ’ ‘జైన్‌టియాస్’ ‘గారోస్’ తెగలకి చెందిన ఆదివాసీలు.. మేఘాలయ అంటేనే మబ్బులమయమైన స్వర్గ్ధామం.
ఇక్కడ ముఖ్యంగా చూడవల్సినవి ఎలిఫెంట్ ఫాల్స్, షిల్లాంగ్ పీక్, కేథలిక్ చర్చ్, లేడీ హైదరీ పార్క్, వార్డ్స్ లేక్, సంగ్మా స్టేట్ మ్యూజియం.

-కె.సీత 9440587580

ముగ్గురు అతిథులు (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

ఆ రాత్రి అకస్మాత్తుగా నా కాటేజ్ బయట అడుగుల చప్పుడు వినిపించింది. నేను తలుపు తెరచి చూస్తే అందులోంచి దిగిన ముగ్గురు కనిపించారు. ఆ అపరిచితులు నా కాటేజ్‌కి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు.
‘మేము ఈ రాత్రికి మీ అతిథులం’ వారు లోపలికి వచ్చాక బాస్‌లా కనిపించే వ్యక్తి చెప్పాడు.
మాటల్లో వారిలోని ఒకరి పేరు హేంక్స్ అని నాకు తెలిసింది. మిగిలిన ఇద్దరి పేర్లు తెలీలేదు.
‘నువ్వు ఉండేది ఇక్కడేనా?’ సన్నటి మీసం గల వ్యక్తి అడిగాడు.
అవునన్నట్లుగా తల ఊపాను.
‘నీ దగ్గర రేడియో ఉందా?’

మల్లాది వెంకట కృష్ణమూర్తి

‘స్థితం’ కాగలగటమే ‘అద్వైత’ సిద్ధి

ఉన్న స్థితిలో ఉండలేకపోవటం - ఉన్నత స్థితికి చేరుకోవాలన్న ప్రయత్నం - ఈ రెండింటి నడుమా కోరికలతో పరితపించటం.. ఇదీ సంసార జంఝాటం - ఇదే జీవన చక్రం.. జీవన యానం.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946

గర్వం (కథాసాగరం)

మనుషులయినా దేవతలయినా అందరం పరమాత్మ సృష్టిలో భాగం. మనం అహంకరిస్తే అది మనకే ప్రమాదం. దీనికి ఎవరూ మినహాయింపు కారు. దేవతలు రాక్షసుల్ని యుద్ధంలో జయించారు. అదంతా తమ ప్రతాపంవల్లనే అని వాళ్లు విర్రవీగారు. అది పరమాత్ముని కృప వల్ల జరిగిందని వాళ్లు అనుకోలేదు. అదంతా స్వయంశక్తి వల్లనే సాధ్యమయిందని, సృష్టిలో తమని మించిన శక్తిసంపన్నులు ఎవరూ లేరని గర్వించారు.
ఒకసారి గర్వం మొదలు కావాలి కానీ దానికి అంతముండదు. దానివల్ల అంధులవుతారు. విచక్షణ కోల్పోతారు.

ఇష్టం లేకపోతే అడుగు కదపవు

ఒంటె జాతికి చెందిన ఈ ‘యామా’లు చూడటానికి చాలా ముచ్చటగా ఉండాయి. దక్షిణ అమెరికాకు చెందిన ఇవి బలిష్టమైన జంతువులు. మన దేశాల్లో గాడిదల్లా బరువు మోయడంలో ఇవి పేరుపొందాయి. కానీ అవి మోయలేనంత బరువు వేసినా, వాటికి నచ్చకపోయినా ఒక్క అడుగుకూడా ముందుకు వేయవు. కొంచెం అయినా వాటిమీద వేసిన వస్తువులు తొలగిస్తేనే అది అడుగుకదుపుతుందట. ఇవి ఒంటెల జాతికి చెందినవే అయినా మూపురాలు ఉండవు. వీటి ఉన్నితో బట్టలు, తాళ్లు, రగ్గులు నేస్తారు. ఒంటెల్లాగానే ఇవి కూడా భయపడ్డప్పుడు ఎదుటివారిపై ఉమ్ముతాయి. వీటికి అత్యంత సునిశితమైన చూపు, వినగలిగే, వాసన పసిగట్టే శక్తి ఉన్నాయి. అందువల్లే శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టి హెచ్చరిస్తాయి.

ఎస్.కె.కె.రవళి

పుట్టినప్పుడు చిక్కుడు గింజంత ఉంటాయ్

ప్లాటిపస్ పేరు అందరికీ తెలిసిందే. టాస్మేనియా, తూర్పు ఆస్ట్రేలియాల్లో కన్పించే ఇవి బాతు, ఒట్టర్, బీవర్ జంతువుల పోలికలతో ఉంటాయి. బాతులాంటి ముక్కు, కాళ్లు, బీవర్‌లా తోక, ఒట్టర్‌లా శరీరం వీటి ప్రత్యేకత. ముందుకాళ్లతో ఈదుతూ, తోకను స్టీరింగ్‌లా ఉపయోగించడం వీటి ప్రత్యేకత. వీటి వెనకకాళ్ల కింద ఉండే ముళ్లవంటి భాగంతో శత్రువులను కాటువేయడం వీటికి ఉన్న రక్షణ వ్యవస్థలో ఓ చర్య. కుక్క స్థాయి జంతువులైతే వీటి కాటుకు మరణిస్తాయి. మనిషికూడా స్పృహతప్పి పడిపోయేంత ప్రభావం వీటి విషానికి ఉంది. అందువల్ల ప్లాటిపస్ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. ఇది ఉభయచర క్షీరదం.

ఎస్.కె.కె.రవళి

తోకతో చరిచిందంటే...ప్రమాదం ఉన్నట్లే

‘రోడెంట్’ వర్గానికి చెందిన జీవుల్లో ‘బీవర్’ అతి పెద్దది. దాదాపు 30 కేజీల బరువు వరకు పెరిగే ఇవి 25 ఏళ్లపాటు జీవిస్తాయి. యురేషియా, ఉత్తర అమెరికా దేశాల్లో ఇవి కనిపిస్తాయి. తెడ్డులాంటి తోక వీటికి ప్రత్యేకం. నీళ్ల లోపల పావుగంటపాటు గడపగలగడం వీటి స్పెషాలిటీ. అవి జీవించి ఉన్నంతకాలం పెరిగే బలమైన దంతాలు వాటి ఆయుధాలు. నీటి మధ్యలోను, సరస్సులు, చెరువుల ఒడ్డున, కాల్వల మధ్య కర్రలు, బెరడు, చెట్ల ఆకులతో వంతెనల్లాంటివి నిర్మించడంలో ఇవి నైపుణ్యం చూపిస్తాయి. నీటి ఉపరితలంపై గూడుకట్టి, నీటి అడుగనుంచి ప్రవేశద్వారం పెట్టకోవడం వీటి రక్షణ వ్యవస్థలో భాగం.

ఎస్.కె.కె.రవళి

Pages