S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోల్‌గేట్లలో ‘చిల్లర ’కష్టాలు

నల్లగొండ, డిసెంబర్ 3: పెద్ధనోట్ల రద్ధు పిదప శనివారం తెల్లవారుజాము నుండి మళ్లీ టోల్ టాక్స్ వసూళ్లు చేస్తుండటంతో వాహనాదారులకు మళ్లీ ‘చిల్లర’ కష్టాలు మొదలయ్యాయ. దీంతో టోల్ ప్లాజాల వద్ధ పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. తొలిసారిగా స్వైప్ మిషన్లు వాడినా, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టోల్‌టాక్స్ చెల్లింపులు ప్రవేశపెట్టినా టోల్‌ఫ్లాజాల వద్ధ సమస్యలు మాత్రం తీరలేదు.

నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదలలో జాప్యం

నల్లగొండ, డిసెంబర్ 3: నాగార్జున సాగర్ ఎడమకాలువకు డిసెంబర్ 1నుండి నీటి విడుదల చేస్తామంటు తెలంగాణ ప్రభుత్వం ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు నుండి అనుమతి లభించకపోవడంతో నీటి విడుదలపై ప్రతిష్టంభన నెలకొంది. సాగర్ ఎడమకాలువకు ఈ నెల 1నుండి ఏడు దఫాలుగా నీటి విడుదల చేస్తామంటు ఎన్‌ఎస్పీ అధికారులు ప్రకటించడంతో ఈ మేరకు రైతులు ఆరుతడి పంటలకు సాగుకు కొందరు, వరి నారుమడుల కోసం మరికొందరు రైతులు పనులు చేపట్టారు. వ్యవసాయశాఖ సైతం రైతులకు విత్తన పంపిణీ చేపట్టింది.

ప్రెషర్ బాంబు పేలుడులో మాజీ సర్పంచ్‌కు గాయాలు

భద్రాచలం, డిసెంబర్ 3: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పిఎల్‌జిఏ వారోత్సవాలు హింసాత్మకంగా మారాయి. నక్సల్స్ వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేసి వాటి కింద ప్రెషర్ బాంబులు పెడుతున్నారు. మొన్న తెలంగాణలోని భూపాల్‌పల్లి జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీలో, నిన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని హిరోలీ, నేడు ఇదే రాష్ట్రంలోని సుక్మా జిల్లా పోలంపల్లి వద్ద ప్రెషర్‌బాంబులు పేలాయి.

‘రెవెన్యూ అధికారులకు త్వరలో ల్యాప్‌టాప్‌లు’

వరంగల్, డిసెంబర్ 3: జిల్లాలలో పాలనావ్యవహారాలు సజావుగా సాగేందుకు, సమస్యలు సత్వరంగా పరిష్కరించేందుకోసం రెవెన్యూ అధికారులకు 15 రోజుల్లో ల్యాప్‌టాప్‌లు అందచేస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. అదే విధంగా రాష్టవ్య్రాప్తంగా తహశీల్ధార్లకు వాహన సదుపాయం కల్పించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు.

రాళ్ల వర్షం

ఈ ప్రపంచంలో వివరణ దొరకని చాలా విచిత్రాలు జరిగాయి. అలాంటి వాటిలో ఒకటి ఆకాశం నించి పడే వర్షం. ఐతే నీటి బిందువులు కాక రాళ్లు వర్షించడం విచిత్రం. ప్రపంచంలో అనేక కాలాల్లో, అనేక చోట్ల అంతుపట్టని రాళ్ల వర్షాలు కురిసాయి.

-పద్మజ

జైళ్లకు పటిష్ఠ భద్రత

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ జైళ్లశాఖ జైళ్లకు పటిష్ట భద్రతకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా జైళ్లలో సిసి కెమెరాల ఏర్పాటుకు నడుం బిగించింది. గత నెలలో మధ్యప్రేశ్‌లోని భోపాల్ జైలు నుంచి టెర్రరిస్టులు పారిపోవడం, పంజాబ్‌లోని నభ జైలు నుంచి ఖైదీలు పారిపోయిన నేపథ్యంలో తెలంగాణలో జైళ్ల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు జైళ్ల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భోపాల్, నభ లాంటి సంఘటనలు తెలంగాణలో చోటుచేసుకోవకపోయినా జైళ్ల భద్రతకు ప్రభుత్వం రూ. 30 కోట్లు కేటాయించింది. ఇంకా కొన్ని నిధులు విడుదల చేయాల్సి ఉందని జైళ్లశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

దేశద్రోహులకే బిజెపి వ్యతిరేకం

హైదరాబాద్, డిసెంబర్ 3: భారతీయ జనతా పార్టీ దేశద్రోహులకే వ్యతిరేకమని, ముస్లింలకు కాదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బిజెపి రాష్టక్రార్యాలయంలో మైనార్టీ మోర్చ అధ్యక్షుడిగా అఫ్సర్ పాషా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల ట్రిపుల్ తలాఖ్ , రిజర్వేషన్ల విషయంలో బిజెపికి స్పష్టమైన వైఖరి ఉందని అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ముస్లిం మైనార్టీలు అందులో భాగస్వామ్యులై లబ్ది పొందాలని అన్నారు.

నోట్ల రద్దుతో ఊహించని దెబ్బ

హైదరాబాద్, డిసెంబర్ 3: ‘పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణకు ఊహించని దెబ్బ తగిలింది. ఆదాయం గణనీయంగా తగ్గింది’ అని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి అనుకుంటే నోట్ల రద్దుతో మొత్తం రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో పాటు నెలకు దాదాపుగా 15 వందల కోట్ల నుంచి 2 వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం పడిపోతోందని, ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని ఆయన అన్నారు. నల్లధనం నిర్మూలనకు ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే సామాన్యులకు ఇబ్బంది కలుగకుండా సరైన వ్యూహంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపడితే బాగుండేదని అన్నారు.

డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులు

హైదరాబాద్, డిసెంబర్ 3: యూనివర్శిటీలు ఎప్పటికపుడు మారాలని, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులను ఆఫర్ చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సబ్జెక్టు టీచర్ల కోసం ప్రిన్సిపాల్స్ కోసం కోర్సులు నడపవద్దని, వాటిని మూసేసి, విద్యార్ధులకు అవసరమై కోర్సులు నడపాలని అన్నారు. తెలంగాణలోని 11 యూనివర్శిటీల్లో ప్రమాణాలు, ఫలితాలు పెరగాలని కోరారు. తెలంగాణ యూనివర్శిటీలో సౌత్ బ్లాక్‌కు సమానంగా నార్త్ బ్లాక్ డెవలప్ చేయాలని ఆయన పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురై తెలంగాణలో విద్యావ్యవస్థ దెబ్బతిన్నదని, దానిని తాము గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.

ఫలించిన చర్చలు

హైదరాబాద్, డిసెంబర్ 3: విద్యుత్ శాఖకు చెంది ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను శనివారం ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి వద్ద జరిగిన చర్చలు ఫలించాయి. విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగుల సమస్యలపై 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రితో చర్చించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా క్రమబద్దీకరించేందుకు మంత్రి అంగీకరించారు. చర్చల తర్వాత మంత్రి స్వయంగా ఈ విషయం వెల్లడించారు. చర్చల తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, ఉద్యోగుల సమస్యలపై కూలంకషంగా చర్చించామని తెలిపారు.

Pages