S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య ‘కహానీ’!

బాలీవుడ్ నటి విద్యాబాలన్ ‘కహానీ’లో తప్పిపోయిన భర్త ఆచూకీ కోసం వెతికే భార్య క్యారెక్టర్‌ను ఎంతో ఉన్నంతగా పోషించి అందరి చేత ప్రశంసలందుకుంది. ఆ పాత్రలో విద్య చూపిన నటన ప్రేక్షకులకే కాదు, విమర్శకుల్ని సైతం ఎంతగానో ఆకట్టుకుంది. అలా తన పాత్రకు జీవం పోసి అందర్నీ కదిలించింది కాబట్టే ‘కహానీ 2’లోనూ మరోసారి తన పాత్ర ద్వారా అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త సిద్ధార్థ్ రాయ్‌కపూర్‌తో విద్యాబాలన్‌కి పెళ్లయి అప్పుడే నాలుగేళ్లయింది. అతడితో విద్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా హ్యాపీగా గడిచిపోతుంది.

దటీజ్..అనుష్క!

ఎస్.ఎస్.రాజవౌళి ‘బాహుబలి ది కన్‌క్లూజన్’తో పాటు ‘బాగ్‌మతి’ సినిమాల్లో నటిస్తూ యమ బిజీ బిజీగా వుంది టాలీవుడ్ బ్యూటీ అనుష్క. నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’తో ప్రారంభమైన ఈమె జైత్రయాత్ర పదేళ్లు పూర్తి చేసుకుంది. గొప్ప గొప్ప చిత్రాలు.. అంతకంటే వైవిధ్యమైన పాత్రలు వేటికవే ప్రత్యేకంగా వుండడంతో కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదిగింది. యోగా టీచర్‌గా వున్న అనుష్కకు చిత్రసీమలో అవకాశాలు రావడంతో ఈమె కెరీర్ ఊపందుకుంది. వెనక్కు తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు ఈ భామకు. కెరీర్ ఎలా అనిపిస్తుంది అని అనుష్కను కదిలిస్తే- ‘‘హాయి హాయిగా సాగుతోంది. నా అదృష్టం కొద్దీ మంచి పాత్రలు.. మంచి బ్యానర్లు..

గ్లామర్‌పైనే మోజు!

బాలీవుడ్ సుందరాంగులు కెరీర్‌లో పైకి రావాలంటే గ్లామర్‌ను చిందించడం తప్పదన్నది అందరికీ తెలిసిందే. అదే కోవలో దూసుకొచ్చిన నటి కత్రీనాకైఫ్. ఈ గ్లామర్ ప్రపంచంలో అందాల ప్రదర్శన ఏ నటికైనా తప్పదు. అలా చేయలేదంటే ఆ నటికి కెరీర్‌లో ఒడిదుడుకులు తప్పవన్న విషయాన్ని ప్రతి కథానాయిక అంగీకరిస్తుంది. ఈ విషయం గురించి కత్రీనా చెబుతూ- ‘‘చిత్రసీమలో అడుగుపెట్టే ముందు పరిశ్రమ గురించి అన్నీ తెలుసుకొని తీరాలి. అలా తెలుసుకుంటేనే కెరీర్‌లో ముందుకు పరుగుతీయడానికి వీలుంటుంది. గ్లామర్.. గ్లామర్ అంటూ హీరోయిన్లపై చిందులేస్తుంటారు. వాటికి దూరంగా వున్న తారలను ఏ మాత్రం ప్రోత్సహించరు. గ్లామర్ ఉంటేనే కథానాయికకు గుర్తింపు.

ఉద్యోగుల అలవాట్లు - అగచాట్లు

యువతకు జీవితం ఒక సవాల్. నిత్యం చదువుతో సమరం. తమ లక్ష్యాలను అడ్డంకొట్టే తల్లిదండ్రుల ఆంక్షలు. అయినా జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నిర్దేశించుకుని లక్ష్యాలు ఏర్పరచుకుని కృషిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.
మెదడులో ఆలోచన మొలకెత్తితే అది ఒక చర్యగా బహిర్గతమవుతుంది. చివరకు ఆ చర్య ఒక అలవాటుగా తయారవుతుంది. ఈ అలవాట్లు మనిషి వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా తయారవుతాయి. ఈ వ్యక్తిత్వం ఫలితంగా మన భవిష్యత్ ఊపిరి పోసుకుంటుంది.
తేడా అలవాట్లు.....................

-సి.వి.సర్వేశ్వరశర్మ

ఒక్క తూటా చాలు 7

శనివారం ఉదయం రాజిరెడ్డి పరవాడ వెళ్లి రాత్రికి తిరిగి రావడం నిజం కాదని దర్యాప్తులో తెలుసుకున్నాడు యుగంధర్. రాజిరెడ్డి శనివారం ఉదయం తన సెల్ నుంచి రాంప్రసాద్‌కి ఓ కాల్ చేశాడు. అలాగే మధ్యాహ్నం రెండుకి మరో కాల్ చేశాడు. రాంప్రసాద్‌ని కారులో ఎక్కించుకుని రాజిరెడ్డి తీసుకెళ్లడం రెండు గంటలకి డ్యూటీకొచ్చిన వాచ్‌మెన్ చూశాడు. ఆ శనివారం నెలలో రెండోది కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పని చెయ్యదు. అంటే సుందరం అబద్ధం చెప్పాడు. అన్నింటికంటే ముఖ్యంగా సుందరం, రాజిరెడ్డి తమ తండ్రుల పేరు మీద బ్యాంక్ లోను తీసుకున్నట్టు కనుక్కున్నాడు యుగంధర్.

-మంజరి 9441571994

బద్ధకస్తుడు (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

కొద్దిలో అతను పట్టుపడేవాడే. చంపడానికి వచ్చిన ఎర్ల్ ఆ ఇంటి వెనుక పొదల్లో నక్కి ఆ ఇంటి వంకే చూస్తున్నాడు.
అరగంట క్రితం అతను ఛార్లీని చంపడానికి ఐదు నిమిషాల దూరంలో ఉండగా షెరీఫ్ ఫ్రెడ్ అడ్డంకి అయ్యాడు.
‘ఓ ఛార్లీ! తలుపు తెరు’ అన్న ఫ్రెడ్ మాటలు విన్న తక్షణం అతను ఛార్లీ ఇంట్లోకి ప్రవేశించే తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
‘లేదా నేను తలుపు విరక్కొట్టుకుని లోపలకి వస్తాను’
వెంటనే అతను తన రివాల్వర్‌ని జేబులో ఉంచుకుని జారుకున్నాడు. ఫ్రెడ్ ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చి ఉంటే బహుశ తను హంతకుడిగా పట్టుబడి ఉండేవాడు అనుకున్నాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఆ రాత్రి (కథల పోటీలో ఎంపికైన రచన)

‘వౌంట్ అబు’ - రాజస్థాన్‌లోని అత్యంత సుందరమైన హిల్‌స్టేషన్. రాజస్థాన్ అంటే విశాలమైన ఇసుక మేటలు వేసిన ఎడారులు, ఒంటెల సవారీ, రాజప్రాసాదాలు, వాటిని చుట్టుకుని వయ్యారంగా నిలబడిన సరస్సులు - ఇవే మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. అయితే వీటన్నింటికీ దూరంగా ‘అసలు ఇది రాజస్థానేనా?’ అని ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది వౌంట్ అబు.
చుట్టూ ఎతె్తైన కొండలు, పచ్చదనాన్ని పారాణిగా పూస్తున్నట్లు ఎతె్తైన వృక్షాలు, కొండ మలుపులు, లోతైన లోయలు కనువిందు చేస్తూంటాయి. వీటన్నింటి మధ్యలో మొత్తం పాలరాతితో నిర్మించిన ‘దిల్వారా జైన్ మందిరం’ చూసేవారికి జీవితాంతం మరచిపోలేని ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది...

-డి.స్వర్ణశైలజ

విద్యార్థుల విజయసూత్రాలివే..

పాఠశాలలు తెరుచుకుని దాదాపు సగం కాలం గడిచిపోయింది. కొన్నిచోట్ల రివిజన్ కూడా మొదలైపోయింది. పాఠశాల స్థాయి నుంచి కళాశాల్లోకి వెళ్ళే పదో తరగతి విద్యార్థులపై అందరి దృష్టి ఉంటుంది. వారి భవిష్యత్ బంగారంలా ఉండాలని కలలు కంటుంటారు. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా వారి వారి స్థాయిలో శ్రమిస్తుంటారు. విద్యార్థులూ పోటీపడి చదువుతూ అందరి కంటే తామే అగ్రస్థానంలో ఉండాలని పట్టుదలతో ఉంటారు. అయితే, ఇంత చదివినా ఫలితం లేకపోతే ఏమిటి పరిస్థితి? ఊహించుకుంటేనే భయమెస్తుంది కదూ.. అందుకే పరీక్షల్లో ఆఖండ విజయం కోసం ‘పరీక్షల రామసేతు’ను కట్టుకోవాలి.

- కళ్యాణి

మాటతీరుతో గుండె పదిలం

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేది సామెత. నాడు మన పెద్దలు చెప్పిన పలు హితోక్తులను నేడు మనం పెడచెవిన పెడుతున్నాం. అంతేకాకుండా, పెద్దలు చెప్పిన మాటలకు శాస్ర్తియత లేదని కొట్టివేస్తున్నాం. అయితే పెద్దల మాటలు చద్దిమూటలు వంటివని, వాటికి శాస్ర్తియత ఉందని ఇప్పటికే పలు అంశాలలో తేటతెల్లం అయింది. తాజాగా నోరు మంచిదైతే గుండె పదిలంగా ఉంటుందని నూటికి నూరుపాళ్ళు నిజమని ఒక పరిశోధనలో తేలింది. నోరు మంచిది అయితే గుండె చక్కగా పనిచేస్తుందని ఈ పరిశోధనలో వెల్లడి అయింది. నోటికి, గుండెకి మధ్య సంబంధం ఏముంది అనే అనుమానం కలగడం సహజమే.

- పి.్భర్గవ్‌రామ్

‘స్పైడర్ మంకీ’లకు ఆ పేరెలా వచ్చింది?

చిలీ మినహా మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో కన్పించే ‘స్పైడర్ మంకీ’లకూ, సాలెపురుగులకూ ఎటువంటి సంబంధం లేదు. కానీ చెట్లపై అవి సంచరించేటపుడు సాలెగూడు ఆకారంలో విన్యాసాలూ చేస్తూండటం వల్ల వాటిని ‘స్పైడర్ మంకీ’లుగా పిలవడం ప్రారంభమైంది. దట్టమైన అడవుల్లో, సముద్రమట్టానికి 12,500 అడుగుల ఎత్తున అవి బతకగలవు. దట్టమైన అడవుల్లో చెట్లపై సంచరించే ఈ కోతుల్లో తోక చాలా పొడవుగా ఉంటుంది. బొటన వేలుండదు. నాలుగు వేళ్ల చేతులు, కాళ్లు, తోక సహాయంతో అవి చెట్లపై బ్యాలన్స్ చేస్తూ తిరుగుతాయి. ఒకే సమయంలో ఐదువైపులా కాళ్లు చేతులు, తోకను కొమ్మలకు బిగించి సాలెపురుగు గూడులా అల్లుకుని కన్పిస్తూంటాయి. చాలా అరుదుగా నేలమీదకు వస్తాయి.

ఎస్.కె.కె.రవళి

Pages