S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడర్‌షిప్ సదస్సు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా,
శోభన భారతీయతో కలిసి లీడర్‌షిప్ సదస్సుకు హాజరైన
బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ (కుడి)

ధైర్యమా? తెగింపా?

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మొండి వైఖరిని మార్చుకోవడంలేదు. లోధా కమిటీ సిఫార్సుల అమలును వ్యతిరేకిస్తున్న అతను తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో, హడావుడిగా నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లోనూ అతను కొత్తగా చెప్పిందేమీ లేదు. గతంలో పేర్కొన్న అంశాలను తిగిరి ప్రస్తావించాడే తప్ప తాజా నిర్ణయాలు ఏవీ ప్రకటించలేదు. లోధా సిఫార్సులను అమలు చేస్తామని ప్రకటించిన విదర్భ, త్రిపుర క్రికెట్ సంఘాలుఈ ఎస్‌జిఎంకు హాజరుకాలేదు.

200 మీటర్ల ప్రపంచ రికార్డు ఇప్పుడు కష్టమే

మొనాకో, డిసెంబర్ 3: పురుషుల 200 మీటర్ల పరుగును 19.19 సెకన్లలో పూర్తి చేసి తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేయడం లేదా బద్దలు చేయడం ఇప్పుడు తనకే కష్టమని ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) నుంచి ఈ ఏటి మేటి అథ్లెట్ అవార్డును అతను స్వీకరించాడు. మహిళల విభాగంలో ఈ అవార్డు అల్మాజ్ అయానాకు లభించింది. ఐఎఎఎఫ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అవార్డును తీసుకున్న తర్వాత బోల్ట్ మాట్లాడుతూ 19 సెకన్ల కంటే తక్కువ సమయంలో 200 మీటర్ల దూరాన్ని పరిగెత్తడం తనకు ఇప్పుడు సాధ్యం కాదన్నాడు.

మాక్స్‌వెల్‌కు జరిమానా

సిడ్నీ, డిసెంబర్ 3: సహచర ఆటగాడు మాథ్యూ వేడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్‌కు కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కూడా సభ్యుడిగా ఉన్న జట్టు మేనేజ్‌మెంట్ జరిమానా విధించింది. మాక్స్‌వెల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షిఫీల్డ్ షీల్డ్ టోర్నీలో తాను, వేడ్ విక్టోరియా తరఫున ఆడుతున్న విషయాన్ని ప్రస్తావించాడు. ఆ టోర్నీలో వేడ్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దింపి, తనను ఏడో స్థానానికి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒకే పూల్‌లో భారత్, పాక్ ఢీ

లండన్, డిసెంబర్ 3: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ వచ్చే ఏడాది జూన్ 15 నుంచి 25వ తేదీ వరకు జరిగే పురుషుల హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) సెమీ ఫైనల్‌లో ఒకే పూల్ నుంచి పోటీపడనున్నాయి. 2018 వరల్డ్ కప్ హాకీకి అర్హత పొందే జట్లను ఖరారు చేయడానికి హెచ్‌డబ్ల్యుఎల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లో పది ప్రపంచ మేటి జట్లు తలపడతాయి. ఇప్పటికే ఆరు జట్లు ఖరారయ్యాయి. భారత్, పాక్‌తోపాటు టోర్నీకి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాండ్, రియో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ చాంపియన్ నెదర్లాండ్స్, దక్షిణ కొరియా హెచ్‌డబ్ల్యుఎల్ సెమీస్‌కు అర్హత సంపాదించాయి.

జూ. జట్టుపై అనర్హత అన్యాయం

కరాచీ, డిసెంబర్ 3: జూనియర్ ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనకుండా తమ జూనియర్ హాకీ జట్టుపై అనర్హత వేటు వేయడం అన్యాయమని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) నిర్ణయాన్ని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) తప్పుపట్టింది. దీనిని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. లక్నోలో డిసెంబర్ 8 నుంచి 18 వరకు జరిగే జూనియర్ ప్రపంచ కప్ పోటీల్లో పాక్ జట్టు ఆడడం అనుమానంగానే కనిపించింది. భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడమే ఇందుకు కారణం. పాక్‌తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను భారత్ దాదాపుగా రద్దు చేసింది.

డబ్బుల్లేవ్..

ముంబయి, డిసెంబర్ 3: పెద్ద నోట్లను రద్దు చేసి మూడు వారాలకు పైగా అయినా మార్కెట్‌లో కరెన్సీ కొరత తీరడం లేదు. ఇప్పటికీ పెద్దసంఖ్యలో ప్రజలు బ్యాంకులు, ఎటిఎం కేంద్రాల ముందు నగదుకోసం బారులు తీరుతున్నారు. ముంబయిలో శనివారం వారాంతపు ఖర్చులకోసం ప్రజలు నానాఅవస్థలు పడ్డారు. గంటల తరబడి క్యూలో నిలబడుతున్నప్పటికీ బ్యాంకులు అంతంత మాత్రంగానే డబ్బులిస్తున్నాయి. ఉన్న నగదు అయిపోగానే ఆపేస్తున్నాయి. మిగిలినవారు ఉసూరుమంటూ వెళ్లిపోతున్నారు. ఎటిఎంల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. అనేక ఎటిఎంలలో ఇప్పటికీ నగదు ఉండటం లేదు. అక్కడక్కడా కొన్ని ఎటిఎంలలో మాత్రమే నగదు ఉంటోంది. వాటిముందు భారీఎత్తున ప్రజలు క్యూ కడుతున్నారు.

బిచ్చగాళ్లు కూడా స్వైపింగ్ వాడుతున్నారు!

మొరాదాబాద్, డిసెంబర్ 3: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం జరిగిన బిజెపి పరివర్తన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాలంతోపాటుగా మనమూ మారాల్సిన అవసరం ఉందని, డిజిటల్ లావాదేవీలకు మళ్లక తప్పదని, ఓ బిచ్చగాడు స్వైపింగ్ మిషన్‌ను ఉపయోగిస్తున్నట్లుగా వాట్సాప్‌లో వచ్చిన ఓ వీడియోను ప్రస్తావించారు. ‘అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు.. అయితే వాట్సాప్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు కారులోని ఓ వ్యక్తిని డబ్బులు అడుగుతాడు. అయితే తాను సాయం చేయాలని అనుకున్నా తనవద్ద చిల్లర లేదని ఆ కారు యజమాని చెప్తాడు.

నేనా.. రాష్టప్రతా? పెద్ద జోక్!

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వయసు మీద పడుతున్న కొద్దీ ఎవరికైనా అలుపన్నది సహజం. అయితే 74 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్‌లో అలాంటిదేమీ కనిపించదు. ఆయన ఇప్పటికీ సినిమాలు, రకరకాల కార్యక్రమాలతో ప్రతి రోజూ బిజీగా గడపడమే కాదు, హ్యూమర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎదుటి వాళ్లు అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పడమే కాదు, అందులో హాస్యం కూడా తొణికిసలాడుతూ ఉంటుంది. తాజాగా శనివారం హిందస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రయోక్త కరణ్ జోహార్‌తోపాటుగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. దేశ రాష్టప్రతిగా ఉండమని మిమ్మల్ని అడిగితే ఏం చెబుతారని అడగ్గా, ‘నేనా రాష్టప్రతా?

సాహసోపేత నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి అభివర్ణించారు. అంతేకాదు, దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో శనివారం నితీశ్ కుమార్ పాల్గొన్నారు.

Pages