S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రంప్‌బర్డ్

చైనాలో అందరికీ ట్రంప్ గుర్తొస్తున్నట్లున్నాడు. దేన్ని చూసినా ట్రంపే వారికి కన్పిస్తున్నాడు. ఈ మధ్య హోంగ్జౌ జూలో ని బర్డ్ సఫారీలో కన్పించిన ఓ పక్షిని చూసిన ఓ జర్నలిస్టు అది అచ్చం ట్రంప్‌లా ఉందంటూ ట్రంప్‌కు, దానికి ఉన్న పోలికలను వర్ణిస్తూ కథనాలు ప్రచురించాడు. దీంతో ఇప్పుడు ఆ పక్షిని చూడడానికి జనం క్యూకట్టారు. గోల్డెన్ ఫీజెంట్ జాతికి చెందిన ఆ పక్షిని తేరిపార చూస్తే ట్రంప్ పోలికలు కనిపిస్తున్నమాట నిజమే. ఇప్పుడు చైనా మీడియాలో ఇదో విశేష వార్తగా మారిపోయింది. నెటిజన్లకైతే ఇది ఓ ఆకర్షణీయమైన అంశం.

భారతి

సంస్క‘రణం’లో సామాన్యులు!

పత్తిమొక్కను ఆశ్రయించుకొని సుమారు పదకొండు వందల రకాల సూక్ష్మజీవులు బతుకుతాయట. వీటిలో 1,090 రకాల సూక్ష్మజీవులు మొక్క ఎదుగుదలకు దోహదం చేస్తాయని, మిగిలిన పదిరకాలు మాత్రమే పంటకు హాని చేస్తాయని వ్యవసాయ నిపుణులు చెబుతుంటారు. ఈ విషయాలు తెలిసినా తెలియకపోయినా పంటను రక్షించుకొనేందుకు రైతులు క్రిమిసంహారక మందులు విరివిగా వాడుతుంటారు. రసాయన మందులను మితిమీరి వాడడం వల్ల సూక్ష్మజీవులే కాదు, ఒక్కోసారి మొక్కలూ చనిపోతుంటాయి. దీంతో రైతు ఆర్థికంగా చితికిపోతాడు. మొక్కలూ బతకాలి, పంటకు మేలు చేసే కొన్నిరకాల పురుగులూ బతకాలి. మొక్కకు కీడు చేసే సూక్ష్మజీవులు మాత్రమే నాశనం కావాలి.

-వరిగొండ కాంతారావు

నువ్వూ నేనూ ఒకటే..

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యకి తపేరు తోఫర్ బ్రోఫై. పార్ట్‌టైమ్ కళాకారుడు. ఇతడి పక్కనే ఉన్న శునకం పేరు రోసెమ్‌బర్గ్. ఆ శునకం అంటే అతడికి ఇష్టం. తోఫర్ అంటే బర్గ్‌కూ అమితమైన ప్రేమ. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలకు చిహ్నం ఈ ఫొటో. ఒకేలా కనిపించేందుకు తరచూ విభిన్నరూపాల్లో దర్శనమిస్తూ వెబ్ మీడియాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు తోఫర్. స్కైడైయింగ్, సర్ఫింగ్, టెన్నిస్ ఆడటం, ఇలా ఏదో ఒక ఈవెంట్‌కు హాజరవడం, ఒకేలాంటి మేకప్, దుస్తులతో దర్శనివ్వడం వీరి ప్రత్యేకత. ఇప్పటివరకు దాదాపు పదిహేను రూపాల్లో ఈ జంట దర్శనమిచ్చింది. అందుచేత వీరిని ఏకరూపులందామా?

భారతి

ఇది ఒక మాయ! మాయ అనగా..

పెద్దనోట్ల రద్దు వల్ల మూడు వారాలుగా ఎటూ పోలేని పరిస్థితి. విమానంలో వెళ్ళడం సులభం. ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్ తీసుకోవచ్చు. పెద్ద నగరాలకి కూడా ఆన్‌లైన్‌లో బస్ టిక్కెట్ దొరుకుతుంది. కాని ఏభై, వంద కిలోమీటర్ల దూరం బస్సులో ప్రయాణించాలంటేనే కష్టం.. బస్టాండుకు పోవాలన్నా, బస్సెక్కాలన్నా, నీళ్ళ సీసా కొనాలన్నా చిల్లర కావాలి. తివిరి ఇసుకనందు తైలంబు తీయవచ్చునేమో గాని, బ్యాంకుల్లోంచి చిల్లర తీ యలేం. చిల్లర మాలక్ష్మి కంటికి కానరావడం లేదు. ఇప్పుడు లక్ష్మి కంటికి కనుపించదు. అదృశ్యమై అంకెల్లోనే కనుపించాలట అదీ మొబైల్ ఫోనుల్లోనే. పూజగదిలో లక్ష్మీదేవి ఫొటోలకి ఇక ప్రాసంగికత తగ్గిపోతుంది.

-జయధీర్ తిరుమలరావు jayadhirtr@gmail.com సెల్ : 9951942242

స్వచ్ఛ బొలీవియా

స్వచ్ఛ్భారత్‌లాంటి కార్యక్రమమే బొలీవియాలో ఏళ్లతరబడి నిర్వహిస్తున్నారు. పరిశుభ్రమైన ప్రపంచం కోసం వారు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి కొత్త వస్తువులను ఉత్పత్తి చేయడం, పర్యావరణాన్ని రక్షించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై విద్యార్థులు, చిన్నారులలో అవగాహన, చైతన్యం కలిగించేందుకు ఏటా ‘్ఫక్‌లారిక్ డ్యాన్స్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూంటారు. రీసైక్లింగ్ వస్తువులతో విభిన్న వేషధారణలు ధరించిన కుర్రకారు సంప్రదాయ రీతిలో సామూహిక నృత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ జానపద సాంస్కృతిక కార్యక్రమం అక్కడి జనావళికి ప్రీతిపాత్రమైనది.

భారతి

రెండు తోడేళ్లు

నేను మా అమ్మాయి ఆల్బమ్ తిరగేస్తుంటే నేను ఓ మీటింగ్‌లో పాల్గొన్న ఫొటో కనిపించింది. నా పక్కన ఓ యువకుడు కూర్చొని ఉన్నాడు. అతను కాళ్లు బాగా చాపి కూర్చున్నాడు. ‘ఇంత నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తి ఎవరు?’ అని మా అమ్మాయి అడిగింది. ఆ కుర్రవాడు చాలా మంచివాడని చెప్పడానికి కొంత సమయం పట్టింది. పుస్తకం అట్టని చూసి పుస్తకాన్ని అంచనా వేయడం ఏ విధంగా సరైంది కాదో, మనిషి కూర్చున్న విధానం గురించి ఆ వ్యక్తిని అంచనా వేయడం కూడా సరైంది కాదు. కానీ శరీర భాష కూడా మంచిగ ఉండటం అవసరమే. శరీర భాష బాగుంటే ఇలాంటి అభిప్రాయానికి రావటానికి అవకాశం ఉండదు.

-జింబో 94404 83001

నీతో వున్న వాళ్లని ప్రేమించు (సండేగీత)

ప్రేమించి వివాహాలు చేసుకున్న వ్యక్తులు చాలామంది కన్పిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా విఫలం అవుతున్నాయి. మహిళలకి ఆర్థిక స్వాతంత్య్రం రావడంవల్ల ఈ విధంగా జరుగుతున్నాయని చాలామంది అంటూ ఉంటారు. కానీ పురుషుల ఆధిక్య భావన వల్ల జరుగుతున్నాయని అంటున్న వ్యక్తులు చాలా తక్కువగా కన్పిస్తారు.
ఇది ఇలా ఉంటే, చాలామంది ప్రేమలో పడతారు. కానీ అందరూ ప్రేమ వివాహాలు చేసుకోకపోవచ్చు. వివిధ కారణాల వల్ల ప్రేమించిన వ్యక్తులని కాకుండా వేరే వ్యక్తులను వివాహం చేసుకొని రావచ్చు.

పెద్దల మాట

ఏ ఒక్క రోజైనా నీకు సమస్యలు ఎదురుకాలేదంటే
నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం.

ఎలా వుందీ వారం? ( నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఎన్ని అవరోధాలున్నా పనులు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. విమర్శలు పట్టించుకోకండి. అపజయం నుండి జయాన్ని అందుకుంటారు. బకాయిలు వసూలవుతాయి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, పరిశ్రమ, శ్రమ జీవన రంగాల వారు వృద్ధిని పొందుతారు. మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. చైన్ స్నాచింగ్ పట్ల జాగ్రత్త వహించండి. నిరుద్యోగులకు ఉపాథి అవకాశాలు. ఐకమత్యమే బలం అని గుర్తిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. ఆదాయ ప్రయత్నాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855

ఊహలు గుసగుసలాడే...!

అందాలతార క్రేజీ గర్ల్ టాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ రాశీఖన్నా ఊహలు గుసగుస లాడుతూనే వున్నాయట. టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. చక్కటి అవకాశాలను సొంతం చేసుకుంటూ కెరీర్‌లో రివ్వున ముందుకు దూసుకెళుతోంది. యువతరం హీరోలతో పాటు పెరుకున్న హీరోల చిత్రాలో నటించే అవకాశం కూడా రాశీకి దక్కుతోంది. డైరీ ఏ మాత్రం ఖాళీగా లేకుండా యమ బిజీగా వుంది. వరుసగా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా కాలం గడుపుతున్న రాశీ తన మకాంను కూడా హైదరాబాద్‌కి మార్చేసిందంటే ఎంతగా బిజీగా వుందో ఇట్టే అర్థం అవుతుంది. యువ హీరోలతో కలిసి పనిచేయడం వల్లే తనకు కెరీర్‌లో బాగా కలిసివచ్చిందని చెబుతోంది.

-సమీర్

Pages